ద్వారకా బస్ స్టేషన్
ద్వారకా బస్ స్టేషన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 17°43′26″N 83°18′25″E / 17.72389°N 83.30694°E |
యజమాన్యం | ఎపిఎస్‌ఆర్‌టిసి |
ఫ్లాట్ ఫారాలు | 29[1] |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | VSP |
History | |
Opened | 1979 |
Location | |
ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ విశాఖ పట్టణం నగరానికి తూర్పు వైపు ఉన్న ఒక బస్ స్టేషను. ఈ బస్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్‌టిసి) యాజమాన్యంలో ఉంది.[2] ఇది ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన బస్సు స్టేషన్లలో ఒకటి. కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల నుండి అనేక బస్సులు ఈ స్టేషన్ వద్దకు చేరుకుంటాయి. ఇక్కడ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు, నగరానికి కూడా బస్సులు తమ సేవలను అందిస్తాయి. ఈ బస్సు స్టేషన్ యొక్క ఆగ్నేయ దిశగా సిటీ బస్సు టెర్మినస్ ఉంది.
చరిత్ర
[మార్చు]ప్రముఖంగా ఆర్‌టిసి కాంప్లెక్స్ అని పిలువబడే ద్వారకా బస్ స్టేషన్ (డిబిఎస్ కాంప్లెక్స్) నకు 80 లక్షలు రూపాయల అంచనా ధరలో ఒక ప్రధాన ఫెసిలిఫ్ట్ ఇవ్వబడింది. 1974 అక్టోబరు 13 న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆర్టీసీ కాంప్లెక్స్ నకు పునాది వేసాడు. 1979 సం.లో దీనిని ప్రారంభించారు.[1]
విస్తరణ
[మార్చు]కొత్త సిసి టివిలు, గోడలకు పెయింటింగ్ క్లిష్టమైన లోపల చేపట్టబడిన కొన్ని పనులు, స్తంభాల పైకప్పులు అధునాతనమైన నూతన రూపాన్ని అందిస్తాయి. 33 ఆధునిక కుర్చీలతో పాటు, ఎసి లాంజ్లో సీనియర్ పౌరులు, అనారోగ్య వ్యక్తుల సౌలభ్యం కోసం రెండు సౌకర్యవంతమైన పడకలు ఉన్నాయి, వారు తమ బస్సు రాక కోసం ఎదురుచూస్తూ ఒక కునుకు (చిన్నపాటి విశ్రాంతి) తీసుకోవాలని కోరుకుంటారు.[1]
సిటీ బస్సులు
[మార్చు]విశాఖపట్నం నగరం యొక్క ప్రతి సిటీ భాగానికి బస్ స్టేషన్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ నుండి అనేక సిటీ బస్సులు నడుస్తాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 B. Madhu Gopal. "Dwaraka Bus Station complex gets a new look". The Hindu.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-16. Retrieved 2017-05-16.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)