పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎వనరులు: {{commons category|Potti Sreeramulu Telugu University}}
పంక్తి 91: పంక్తి 91:
==వనరులు==
==వనరులు==
<references/>
<references/>

{{commons category|Potti Sreeramulu Telugu University}}


{{ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు}}

18:58, 11 జనవరి 2018 నాటి కూర్పు

తెలుగు విశ్వవిద్యాలయము
రకంప్రభుత్వ
స్థాపితం1985
ఛాన్సలర్ఈ.ఎస్.ఎల్.నరసింహన్
వైస్ ఛాన్సలర్ఎస్వీ సత్యనారాయణ
స్థానంహైదరాబాదు, భారతదేశం
కాంపస్పట్టణ ప్రాంత
అనుబంధాలువిశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం
జాలగూడుwww.teluguuniversity.ac.in

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము [1] భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య మరియు లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ మరియు తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది.

తెలుగు విశ్వవిద్యాలయ సభాంగణంలో ఒక కార్యక్రమం
Telugu Mahasabhalu, world telugu conference 2017

విభాగాలు, కోర్సులు

లలితకళా ప్రాంగణం, హైదరాబాదు

సామాజిక మరియు ఇతర విజ్ఞానాల పీఠం
  • ప్రసార మరియు పాత్రికేయ శాఖ
  • జ్యోతిష మరియు వాస్తు శాఖ
తులనాత్మక అధ్యయన పీఠం
  • తులనాత్మక అధ్యయన శాఖ
  • అనువాదాల శాఖ
సాహిత్య పీఠం
  • తెలుగు సాహిత్య అధ్యయన శాఖ
లలిత కళల పీఠం
  • సంగీత శాఖ
  • నాట్య శాఖ
  • జానపద కళల శాఖ
  • రంగస్థల కళల శాఖ
  • శిల్ప మరియు చిత్ర కళల శాఖ
  • సంస్కృతి మరియ పర్యటన శాఖ

నన్నయ ప్రాంగణం, రాజమండ్రి

భాషాభివృద్ధి పీఠం
  • భాష అధ్యయన శాఖ
  • నిఘంటు తయారీ శాఖ

పోతన ప్రాంగణం, వరంగల్

జానపద మరియు తెగల సాహిత్య పీఠం
  • జానపద అధ్యయన శాఖ
  • తెగల అధ్యయన శాఖ

పాల్కురికి సోమనాథ ప్రాంగణం, శ్రీశైలం

చరిత్ర, సంస్కృతి మరియు పురాతత్వ పీఠం
  • తెలుగు మాట్లాడు ప్రజల చరిత్ర మరియు సంస్కృతి శాఖ
  • ప్రాచీన శాసన మరియు లిఖిత ఆధారాల శాఖ
  • పురాతత్వ శాఖ

శ్రీ సిద్ధేంద్రయోగి ప్రాంగణం, కూచిపూడి

సిద్ధేంద్ర యోగి కళా పీఠం

కేంద్రాలు

కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రము

విజ్ఞాన సర్వస్వం- సంపుటి 4 దర్శనములు-మతములు, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడింది.

తెలుగు భాషా సమితి విషయాల క్రమంలో విజ్ఞాన సర్వస్వం ముద్రించింది. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయములో విజ్ఞానసర్వస్వ కేంద్రము వాటిని పరిష్కరించి మరల కొత్త వాటిని ముద్రించింది. 1986 అక్టోబరు 15న తెలుగు భాషా సమితి విలీనంతో విజ్ఞాన సర్వస్వ కేంద్రము ప్రారంభించబడింది. దీనిని తరువాత కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రముగా పేరు మార్చారు. వివిధ విషయాలలో 38 పైగా సంపుటాలను విడుదలచేయలనే ప్రణాళికలున్నాయి.తెలుగుభాషా సమితి 14 సంపుటాలను ప్రచురించింది. వీటిని ఆధునీకరించేపనిని కొత్త వి తయారుచేసే పనిని ఈ కేంద్రం చేపట్టింది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, భారత భారతి, దర్శనములు-మతములు[2], విశ్వసాహితి[3], భారతభారతి, జ్యోతిర్విజ్ఞానము, ఆయుర్విజ్ఞానము, తెలుగు సంస్కృతి, నాటక విజ్ఞాన సర్వస్వం (2008) ప్రచురించబడినవి. ఇంగ్లిషులో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రాస్ అన్న సంపుటము ముద్రించబడింది. 11వ పంచవర్షప్రణాళికలో భాగంగా పని జరుగుతున్న సంపుటాలు.

  • దేశము-చరిత్ర
  • సిరిసంపదలు
  • తెలుగు జానపద విజ్ఞాన సర్వస్వము
  • సాహిత్య దర్శనము

అంతర్జాతీయ తెలుగు కేంద్రము

ఇతర రాష్ట్రాలు, లేక దేశాలలోని తెలుగువారికోసం ఈ కేంద్రం పనిచేస్తుంది.తెలుగు పాఠ్యపుస్తకాలు, పాఠశాలలకు సహాయం, ఉపాధ్యాయ శిక్షణ మరియు ఆధునిక తెలుగు, కూచిపూడి నాట్యం మొదలైన వాటిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

దూర విద్యాకేంద్రము

వివిధ అంశాలలో (తెలుగు, సంస్కృతంభాషలు, జ్యోతిషం, వార్తలు, సంగీతం, సినిమా సంభాషణ...) సర్టిఫికేట్, బిఎ, పిజిడిప్లొమా, ఎమ్ఎ, సర్టిఫికేట్ కోర్సులు

ప్రచురణలు

చూడండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ప్రచురణలు

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

2016, జూలై 26 న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పదో ఉపకులపతిగా ఆచార్య ఎస్వీ సత్యనారాయణ గారు బాధ్యతలు స్వీకరించారు.[4]

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

వనరులు

  1. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వెబ్సైట్
  2. విజ్ఞాన సర్వస్వము సంపుటి 4 దర్శనములు-మతములు
  3. విజ్ఞాన సర్వస్వము సంపుటి 5విశ్వసాహితి
  4. నమస్తే తెలంగాణ, తెలుగుయూనివర్సిటీ. "తెలుగువర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ". Retrieved 27 July 2016.