తమిళ భాష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: oc:Tamil
చి యంత్రము మార్పులు చేస్తున్నది: oc:Tamol
పంక్తి 136: పంక్తి 136:
[[nn:Tamil]]
[[nn:Tamil]]
[[no:Tamilsk]]
[[no:Tamilsk]]
[[oc:Tamil]]
[[oc:Tamol]]
[[pl:Język tamilski]]
[[pl:Język tamilski]]
[[pnb:تامل]]
[[pnb:تامل]]

22:36, 23 మార్చి 2011 నాటి కూర్పు

ழ் గా రాయబడే హల్లు తమిళం, మళయాలం, మాన్డరిన్ మొదలైన మన్గోలియా భాషల్లో , మాత్రమే కనిపిస్తుందని నమ్మకం.

తమిళం(తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతన మైన భాష. దక్షిణ భారతదేశం, శ్రీలంక, సింగపూర్లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిద దేశాల్లో ఈ భాషని మాతృభాష కలిగిన తమిళురు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం 26వ స్థానంలో ఉంది.

చరిత్ర

ద్రవిడ కుటుంబానికి చెందిన మిగిలిన భాషలతో పోలికలున్నప్పటికీ, తమిళం భారతదేశంలో ఉన్న చాలా భాషలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మౌలికంగా సంస్కృతంతో ప్రమేయం లేకుండా ఈ భాష ఆవిర్భవించిదన్న భావన ఉంది. ద్రవిడ భాషల్లోకెల్ల సుధీర్ఘ (రెండు వేల సంవత్సరాలకు మించిన) సాహిత్య-చరిత్ర గల భాషగా తెలుగు, కన్నడ భాషలక0టే ము0దే తమిళం గుర్తించబడింది.

తమిళ భాషకి అత్యంత దగ్గర పోలికలు గల భాష మలయాళం అని చెప్పవచ్చును. తొమ్మిదవ శతాబ్దము వరకు తమిళ మలయాళం భాషలు వేరువేరుగా గాక 'తమిళం' అనే ఒక భాషకు ఉపభాషల వలే ఉండేవి. పదమూడు-పద్నాలుగు శతాబ్దాల కాలంలో ఈ రెండు భాషలు వేరు పడి ఉండవచ్ఛని భావన.

ఇరుళా, కైకడి, పేట్టాకుఱుంబా, షొలగ మరియు యెరుకుల మొదలైనవి తమిళభాష కి ఉప భాషలు గా వాడుకలో ఉన్నవి.

మొట్టమొదటి తమిళ గ్రంథం క్రీ.పూ.3వ శతాబ్ధంలో జరిగెనని అధారాలు కలవు. 'సంగ కాలం'గా పిలువబడే క్రీ.పూ.300 - క్రీ.శ.300 మధ్య కాలంలో తమీళ భాషలో సుమారు 30,000 శిలా-లేఖలు వ్రాయబడ్డాయి. దక్షిణ ఆసియాలో ఇన్ని శిలా-లేఖనాలు వేరే ఏ భాషలోనూ లెకపోవటం విశేషం. సంగకాలానికి చెందిన తమిళ సాహిత్యం తాళపత్రాల ద్వారా, మౌఖిక పునరావృత్తి ద్వారా శతాబ్ధాల కాలం రక్షించబడుతూ ఇప్పటికి లభ్యంలో ఉన్నా గ్రంథాలు అనేకం ఉన్నాయి.

తమిళ భాష సాహిత్యాన్నీ, వ్యాకరణ పరిణామ క్రమాన్నీ బట్టి కాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించారు:

  • సంగకాలం (క్రీ.పూ.300 - క్రీ.శ. 300)
  • సంగ తరువాతి కాలం/సంగం మరువిన కాలం (క్రీ.శ.300 - క్రీ.శ.700)
  • భక్తి సాహిత్య కాలం ( క్రీ.శ.700 - క్రీ.శ.1200)
  • మధ్య కాలం ( క్రీ.శ.1200 - క్రీ.శ.1800)
  • ప్రస్తుత కాలం ( క్రీ.శ.1800 - ఇప్పటి వరకు).


భక్తి సాహిత్య కాలంలో మరియు మధ్య సాహిత్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది భాషల పలు పదాలు తమిళంలో కలిసినవి. తరువాతి కాలంలో 'పరిదిమార్ కళైఞర్' (1870 - 1903) , 'మరైమలై అడిగళ్' (1876-1950) మొదలైన సంస్కర్తలు ఈ పదాలను తమిళ భాషనుంచి తొలగించే ప్రయత్నం చేసారు. "స్వచ్ఛమైన తమిళ్" అనే నినాదం ఈ కాలంలో వెలువడింది.

తమిళం గురించి

కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ ప్రాచీన తమిళ మహానాడు ఆమోదించిన తీర్మానాలపై ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్ననిర్ణయాలు ఇవి :

  • తమిళానికి కేంద్రంలో అధికార భాషా హోదా కల్పించాలి.ఈ అంశంపై పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించి దానిపై చర్చించాలి.
  • మద్రాసు హైకోర్టులో తమిళంలో వాదనలకు అనుమతించాలి.దీనిపై ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్ర ప్రభుత్వానికి 2006లోనే లేఖ రాశారు.
  • తమిళ భాషాభివృద్ధికి పరిశోధనలకు అవసరమైన రాయితీ నిధులను కేంద్రం ఇవ్వాలి.రాష్ట్రం లో శాసన అధ్యయనా కేంద్రం నెలకొల్పాలి.
  • తమిళంలో చదువుకున్న అభ్యర్ధులకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, ప్రాధాన్యత ఇవ్వాలి.
  • పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో తమిళ ప్రాచీన భాషా శీర్షికను చేర్చాలి.
  • తమిళ భాషాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఏర్పరచాలి.
  • తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.
  • కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి,కరుణానిధి కుమారుడు అళగిరికి ఇంగ్లీషులో మాట్లాడటం రాదని అందువలన తమిళంలో మాట్లాడనివ్వాలి.అతని ప్రసంగాన్ని హిందీ,ఇంగ్లీషుల్లోకి తర్జుమా చేసేందుకు అనువాదకుడిని నియమించాలి.---జయలలిత.
  • “Tamil is much older than Sanskrit.Tamil is as old as 2600-1700 BCE Even the Rig Veda found in the Indus Valley about 1,000 BCE had some Dravidian words”.--- Asko Parpola, Professor Emeritus of Indology, Institute of World Cultures, Helsinki, Finland.( తమిళము సంస్కృతం కన్నా చాలా పురాదానమైనది. తమిళ భాష 2600-1700 క్రి.పూ. నుండే పౌరానం. 1000 క్రి.పూ. ముందు సింధు లోయలో కనబడిన ఋగ్ వేదములో కూడ ద్రావిడ తమిళ పదాలు ఉంది-- అస్కొ పర్పొల,ఇండాలజి ప్రొఫెసెర్,లోక సంస్కృతి సంస్థానం, హెల్సింకి, ఫింలాండ్)
  • “The language of Indus Valley was Tamil” --- Dr. Ambedkar( సింధు లోయ నగరికత భాష తమిళము--డా||అంబేద్కర్)

తమిళ దినపత్రికలు

తరచూ వాడే కొన్ని వాక్యాలు

   *నమస్కారము: వణక్కం
   * బాగున్నారా? : నల్లా ఇరుకీంగళా/సౌక్యమా ఇరుకీంగళా.?
   * మీ పేరు ఏంటి? : ఉంగ పేరు ఎన్న?
   * నా పేరు లాక్షీ: ఎం పేరు లట్చ్మి
   * దయచేసి: దయవసెయిదు 
   * ధన్యవాదము: నన్రి(నండ్రి)
   * నాకు తమిళం తెలియదు: ఎనక్కు తమిళ్ తెరియాదు
   * క్షమించండి: మన్నిక్కవుం/మన్నిచిరుంగ
   * అది: అదు
   * ఇది: ఇదు
   * రండి,కూర్చన్ది :వాంగ, ఉట్కారుంగ
   * ఎంత?: ఎవ్వళవు
   * ఎక్కడ: ఎంగ
   * అవును: ఆమాం
   * లేదు: ఇల్లై
   * నాకు అర్ధం కాలేదు: ఎనక్కు పురియవిల్లై
   * మరుగు దొడ్డి ఇక్కడ?: కళివరై ఎంగ ఇరుక్కు
   * మీకు ఆంగ్లము తెలుసా?: ఉంగళుక్కు ఆంగిలం తెరియుమా?
   * టైమ్ ఎమి- నేరం ఎన్న ఆచ్చు

మూస:Link FA మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=తమిళ_భాష&oldid=592655" నుండి వెలికితీశారు