బీరం హర్షవర్దన్ రెడ్డి
బీరం హర్షవర్దన్ రెడ్డి | |||
| |||
పదవీ కాలం 2018 - ప్రస్తుతం | |||
ముందు | జూపల్లి కృష్ణారావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 31 ఆగస్టు, 1978[1] సింగోటం, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | బీరం లక్ష్మారెడ్డి - బుచ్చమ్మ | ||
నివాసం | హైదరాబాద్ |
బీరం హర్షవర్దన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]
జననం, విద్య
[మార్చు]హర్షవర్ధన్ రెడ్డి 1978, ఆగస్టు 31న లక్ష్మారెడ్డి - బిచ్చమ్మ[3] తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ సమీపంలోని సింగోటం గ్రామంలో జన్మించాడు. తండ్రి లక్ష్మారెడ్డి సింగోటం గ్రామ సర్పంచ్ గా, జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2001లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పిఆర్ఆర్ లా కళాశాల నుండి ఎల్.ఎల్.బి. పూర్తిచేసిన హర్షవర్ధన్ రెడ్డి, తరువాత 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]హర్షవర్ధన్ రెడ్డికి విజయతో వివాహం జరిగింది.
రాజకీయ విశేషాలు
[మార్చు]తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హర్షవర్ధన్ రెడ్డి, కొన్నిరోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు చేతిలో 10,498 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై 12,543 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6] 2018 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[7] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.[8][9]
ఇతర వివరాలు
[మార్చు]మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు
[మార్చు]- ↑ The Hans India (31 August 2019). "MLA Beeram Harsha Vardhan celebrates birthday in Kollapur". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
- ↑ "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-05.
- ↑ Andhrajyothy (23 June 2021). "కొల్లాపూర్ ఎమ్మెల్యేకు భారీ నజరానా!". andhrajyothy. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
- ↑ "Harshavardhan Reddy Beeram(Indian National Congress(INC)):Constituency- KOLLAPUR(MAHBUBNAGAR) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-05.
- ↑ "Beeram Harshavardhan Reddy(Indian National Congress(INC)):Constituency- KOLLAPUR(NAGARKURNOOL) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-05.
- ↑ Eenadu (13 November 2023). "తొలి ప్రయత్నం.. వరించిన విజయం". EENADU. Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
- ↑ "Another Telangana Cong MLA to join ruling TRS". Business Standard (in ఇంగ్లీష్). Retrieved 2021-09-05.
- ↑ Namasthe Telangana (22 August 2023). "సమరానికి సై". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
- ↑ Eenadu (14 November 2023). "ఎన్నికల బరిలో కోటీశ్వరులు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.