మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | |
---|---|
నాయకుడు | పృథ్వీరాజ్ చవాన్ |
Chairperson | బాలాసాహెబ్ తోరట్ (Leader of Congress Legislature Party Maharashtra Legislature) |
ప్రధాన కార్యాలయం | ముంబై |
విద్యార్థి విభాగం | మహారాష్ట్ర NSUI |
యువత విభాగం | మహారాష్ట్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | మహారాష్ట్ర ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ |
రాజకీయ విధానం | |
కూటమి | మహా వికాస్ అగాడి |
లోక్‌సభలో సీట్లు | 1 / 48
|
రాజ్యసభలో సీట్లు | 3 / 19
|
శాసనసభలో సీట్లు | 45 / 288
|
Election symbol | |
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, భారత జాతీయ కాంగ్రెస్ వారి మహారాష్ట్ర శాఖ. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం, సమన్వయం చేయడం, అలాగే మహారాష్ట్రలో స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం దీని బాధ్యత. సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలోని దాదర్‌లో ఉంది. అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ముంబైలోని కొలాబా కాజ్‌వేలో ఉంది.
చరిత్ర
[మార్చు]మహారాష్ట్ర రాష్ట్రం 1960 మే 1 న ఏర్పడింది. రాష్ట్రంలో కాంగ్రెసుకు చాలా కాలం పాటు ఎదురు లేదు. రాష్ట్రంలోని చక్కెర సహకార సంఘాలు, రాష్ట్రంలోని గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో పాలుపంచుకున్న పాడి, కూరగాయల ఉత్పత్తుల మార్కెటింగ్, రుణ సంఘాలు మొదలైన వేలాది ఇతర సహకార సంస్థల నుండి దానికి అధిక ఉడ్ంఏది. కేశరావ్ జేఢే కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత, బొంబాయి రాష్ట్రం లోను, దాని తరువాత మహారాష్ట్రలోనూ రాజకీయాల్లో ప్రధానంగా గ్రామీణ మరాఠా - కుంబీ కులాల ఆధిపత్యం ఏర్పడింది.[1] ఈ సమూహం సహకార సంస్థలపై ఆధిపత్యం చెలాయించేది. ఫలితంగా వచ్చే ఆర్థిక శక్తితో, గ్రామ స్థాయి నుండి శాసనసభ, లోక్‌సభ స్థానాల వరకు రాజకీయాలను నియంత్రించింది. 1980ల నుండి, ఈ బృందం ప్రైవేట్ విద్యాసంస్థలను స్థాపించడంలో కూడా చురుకుగా ఉంది.[2] మహారాష్ట్రకు చెందిన కేశవరావు జేఢే, యశ్వంతరావు చవాన్, వినాయకరావు పాటిల్, వసంతదాదా పాటిల్, శంకర్రావు చవాన్ కేశవరావు సోనావానే, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన రాజకీయ ప్రముఖులు ఈ గుంపు నుండే వచ్చారు. మహారాష్ట్ర లోను, జాతీయ రాజకీయాల్లోనూ మహోన్నత వ్యక్తిగా నిలిచిన శరద్ పవార్ ఈ వర్గానికే చెందినవాడు.
శరద్ పవార్, తనకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకీ మధ్య వివాదాల నేపథ్యంలో కాంగ్రెసు నుండి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ రాజకీయ స్థితి క్షీణించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరాఠాల మద్దతు చీలిపోయింది. అయితే, గత ముప్పై ఏళ్లలో, శివసేన, బీజేపీ మహారాష్ట్ర రాష్ట్రంలో ముఖ్యంగా ముంబై వంటి పట్టణ ప్రాంతాల్లో పట్టు సాధించడం ప్రారంభించాయి. 1995లో శివసేన, బీజేపీ అధికారంలోకి రావడం కాంగ్రెసుకు పెద్ద దెబ్బ. అయితే ఒక టర్మ్ తర్వాత, కాంగ్రెస్-ఎన్‌సిపి కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. 2014 వరకు అధికారంలో ఉంది. 2014 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు, ఎన్సీపీతో పొత్తు లేకుండా పోటీ చేసి భాజపా చేతిలో ఓడిపోయింది.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు
[మార్చు]సంవత్సరం. | పార్టీ నేత | సీట్ల మార్పు | సీటు గెలుచుకుంది. | ఫలితం. | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
బొంబాయి ప్రెసిడెన్సీ | ||||||||||
1937 | బి. జి. ఖేర్ | 86 | 86 / 175 (49%)
|
అధికారం | ||||||
1946 | 39 | 125 / 175 (71%)
|
అధికారం | |||||||
బొంబాయి రాష్ట్రం | ||||||||||
1952 | మొరార్జీ దేశాయ్ | 94 | 269 / 315 (85%)
|
అధికారం | ||||||
1957 | యశ్వంత్రావు బల్వంతరావు చవాన్ | 35 | 234 / 396 (59%)
|
అధికారం | ||||||
మహారాష్ట్ర రాష్ట్రం | ||||||||||
1962 | మరోట్రావ్ కన్నంవర్ | 215 | 215 / 264 (81%)
|
అధికారం | ||||||
1967 | వసంత్ రావు నాయక్ | 12 | 203 / 270 (75%)
|
అధికారం | ||||||
1972 | 19 | 222 / 270 (82%)
|
అధికారం | |||||||
1978 | వసంతదాదా పాటిల్ | 153 | 69 / 288 (24%)
|
ప్రతిపక్షం | ||||||
1980 | ఎ. ఆర్. అంతులే | 117 | 186 / 288 (65%)
|
అధికారం | ||||||
1985 | శివాజీరావ్ పాటిల్ నిలంగేకర్ | 25 | 161 / 288 (56%)
|
అధికారం | ||||||
1990 | శరద్ పవార్ | 20 | 141 / 288 (49%)
|
అధికారం | ||||||
1995 | 61 | 80 / 288 (28%)
|
ప్రతిపక్షం | |||||||
1999 | విలాస్రావ్ దేశ్ముఖ్ | 5 | 75 / 288 (26%)
|
అధికారం | ||||||
2004 | 6 | 69 / 288 (24%)
|
అధికారం | |||||||
2009 | అశోక్ చవాన్ | 13 | 82 / 288 (28%)
|
అధికారం | ||||||
2014 | పృథ్వీరాజ్ చవాన్ | 40 | 42 / 288 (15%)
|
ప్రతిపక్షం | ||||||
2019 | బాలాసాహెబ్ థోరట్ | 2 | 44 / 288 (15%)
|
ప్రతిపక్షం |
మహారాష్ట్ర నుండి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన సీట్లు
[మార్చు]లోక్ సభ ఎన్నికలు | సీట్లు గెలుచుకున్నారు | సీటు మార్పు | కూర్పు |
---|---|---|---|
1951 లోక్సభ ఎన్నికలు | 41 | 41 | 41 / 45 (91%)
|
1957 లోక్సభ ఎన్నికలు | 20 | 21 | 20 / 45 (44%)
|
1962 లోక్సభ ఎన్నికలు | 39 | 19 | 39 / 45 (87%)
|
1967 లోక్సభ ఎన్నికలు | 36 | 3 | 36 / 45 (80%)
|
1971 లోక్సభ ఎన్నికలు | 39 | 3 | 39 / 45 (87%)
|
1977 లోక్సభ ఎన్నికలు | 13 | 26 | 13 / 48 (27%)
|
1980 లోక్సభ ఎన్నికలు | 42 | 4 | 42 / 48 (88%)
|
1984 లోక్సభ ఎన్నికలు | 43 | 1 | 43 / 48 (90%)
|
1989 లోక్సభ ఎన్నికలు | 12 | 3 | 12 / 48 (25%)
|
1991 లోక్సభ ఎన్నికలు | 19 | 7 | 19 / 48 (40%)
|
1996 లోక్సభ ఎన్నికలు | 13 | 6 | 13 / 48 (27%)
|
1998 లోక్సభ ఎన్నికలు | 29 | 16 | 29 / 48 (60%)
|
1999 లోక్సభ ఎన్నికలు | 10 | 19 | 10 / 48 (21%)
|
2004 భారత సాధారణ ఎన్నికలు మహారాష్ట్రలో | 13 | 3 | 13 / 48 (27%)
|
2009 భారత సాధారణ ఎన్నికలు మహారాష్ట్రలో | 17 | 4 | 17 / 48 (35%)
|
2014 భారత సాధారణ ఎన్నికలు మహారాష్ట్రలో | 2 | 15 | 2 / 48 (4%)
|
మహారాష్ట్రలో 2019 భారత సాధారణ ఎన్నికలు | 1 | 1 | 1 / 48 (2%)
|
అధ్యక్షుల జాబితా
[మార్చు]ఎస్. నో | రాష్ట్రపతి | చిత్తరువు | కాలపరిమితి. | |
---|---|---|---|---|
1. | అబాసాహెబ్ ఖేడ్కర్ | 1960 | 1963 | |
2. | వినాయకరావు పాటిల్ | 1963 | 1967 | |
3. | వసంతదాదా పాటిల్ | 1967 | 1972 | |
4. | పి. కె. సావంత్ | 1972 | 1978 | |
5. | నరేంద్ర టిడ్కే | 1978 | 1978 | |
6. | నాసిక్రావ్ తిర్పుడే | 1978 | 1979 | |
7. | రామ్రావ్ ఆదిక్ | 1979 | 1980 | |
8. | ప్రేమలా చవాన్ | 1980 | 1981 | |
9. | గులాబ్ రావు పాటిల్ | 1981 | 1982 | |
10. | ఎస్ ఎమ్ ఐ అసిర్ | 1983 | 1983 | |
11. | ఎన్. ఎం. కాంబ్లే | 1983 | 1985 | |
12. | ప్రభా రౌ | 1985 | 1988 | |
13. | ప్రతిభా పాటిల్ | 1988 | 1989 | |
(11). | ఎన్. ఎం. కాంబ్లే | 1989 | 1990 | |
14. | సుశీల్ కుమార్ షిండే | 1990 | 1991 | |
15. | శివాజీరావ్ పాటిల్ నిలంగేకర్ | 1991 | 1992 | |
16. | శివాజీరావ్ దేశ్ముఖ్ | 1992 | 1993 | |
(14). | సుశీల్ కుమార్ షిండే | 1993 | 1997 | |
17. | రంజిత్ దేశ్ముఖ్ | 1997 | 1998 | |
18. | ప్రతాప్ రావు బాబూరావు భోసలే | 1998 | 2000 | |
19. | గోవిందరావు ఆదిక్ | 2000 | 2003 | |
(17). | రంజిత్ దేశ్ముఖ్ | 2003 | 2004 | |
(12). | ప్రభా రౌ | 2004 | 2008 | |
20. | పటంగ్రావ్ కదమ్ | 2008 | 2008 | |
21. | మాణిక్రావ్ ఠాక్రే | 2008 | 2015 | |
22. | అశోక్ చవాన్ | 2015 | 2019 | |
23. | బాలాసాహెబ్ థోరట్ | 2019 | 2021 | |
24. | నానా పటోలే | 2021 | - |
కాంగ్రెస్ పార్టీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా
[మార్చు]# | పేరు. | కార్యాలయం తీసుకున్నాడు. | ఎడమ కార్యాలయం |
---|---|---|---|
1 | యశ్వంత్రావు చవాన్ | 1956 నవంబరు 1 | 1962 నవంబరు 19 |
3వ అసెంబ్లీ ఎన్నికలు (1962) | |||
2 | మరోట్రావ్ కన్నంవర్ | 1962 నవంబరు 20 | 1963 నవంబరు 24 |
3 | వసంత్ రావు నాయక్ | 1963 డిసెంబరు 5 | 1975 ఫిబ్రవరి 20 |
4 | శంకర్రావ్ చవాన్ | 1975 ఫిబ్రవరి 21 | 1977 మే 17 |
5 | వసంతదాదా పాటిల్ | 17 మే. 1977 | 1978 మార్చి 7 |
7వ అసెంబ్లీ ఎన్నికలు (1980) | |||
7 | అబ్దుల్ రెహమాన్ అంతులే | 1980 జూన్ 9 | 1982 జనవరి 12 |
8 | బాబాసాహెబ్ భోసలే | 1982 జనవరి 21 | 1983 ఫిబ్రవరి 1 |
9 | వసంతదాదా పాటిల్ (3వ పదవీకాలం) | 1983 ఫిబ్రవరి 2 | 1985 జూన్ 1 |
8వ అసెంబ్లీ ఎన్నికలు (1985) | |||
10 | శివాజీరావు నిలంగేకర్ పాటిల్ | 1985 జూన్ 3 | 1986 మార్చి 6 |
11 | శంకర్రావ్ చవాన్ | 1986 మార్చి 12 | 1988 జూన్ 26 |
12 | శరద్ పవార్ (2వ పదవీకాలం) | 1988 జూన్ 26 | 1991 జూన్ 25 |
9వ అసెంబ్లీ ఎన్నికలు (1991) | |||
13 | సుధాకర్ రావు నాయక్ | 1991 జూన్ 25 | 1993 ఫిబ్రవరి 22 |
14 | శరద్ పవార్ (3వ పదవీకాలం) | 1993 మార్చి 6 | 1995 మార్చి 14 |
11వ అసెంబ్లీ ఎన్నికలు (1999) | |||
15 | విలాస్రావ్ దేశ్ముఖ్ (1వ పదవీకాలం) | 1999 అక్టోబరు 18 | 2003 జనవరి 16 |
16 | సుశీల్ కుమార్ షిండే | 2003 జనవరి 18 | 2004 అక్టోబరు 30 |
12వ శాసనసభ ఎన్నికలు (2004) | |||
19 | విలాస్రావ్ దేశ్ముఖ్ (2వ పదవీకాలం) | 2004 నవంబరు 1 | 2008 డిసెంబరు 4 |
20 | అశోక్ చవాన్ | 2008 డిసెంబరు 8 | 2010 నవంబరు 5 |
21 | పృథ్వీరాజ్ చవాన్ | 2010 నవంబరు 6 | 2014 సెప్టెంబరు 25 |
రాష్ట్ర ఎన్నికలలో పనితీరు
[మార్చు]సంవత్సరం. | సార్వత్రిక ఎన్నికలు | పోలైన ఓట్లు (%) | గెలుచుకున్న సీట్లు |
---|---|---|---|
1962 | 3 వ అసెంబ్లీ | 56,17,347 | 215 |
1962 | 3వ లోక్సభ | 58,95,958 | 41 |
1967 | 4వ అసెంబ్లీ | 62,88,564 | 203 |
1967 | 4వ లోక్సభ | 66,18,181 | 37 |
1971 | 5వ లోక్సభ | 87,90,135 | 42 |
1972 | 5వ అసెంబ్లీ | 85,35,832 | 222 |
1977 | 6వ లోక్సభ | 79,42,267 | 20 |
1978 | 6వ అసెంబ్లీ | 51,59,828 | 69 |
1980 | 7వ అసెంబ్లీ | 78,09,533 | 186 |
1980 | 7వ లోక్సభ | 98,55,580 | 39 |
1984 | 8వ లోక్సభ | 1,11,83,424 | 43 |
1985 | 8వ అసెంబ్లీ | 95,22,556 | 161 |
1989 | 9వ లోక్సభ | 1,24,96,088 (45.36%) | 28 |
1990 | 9వ అసెంబ్లీ | 1,13,34,773 (38.17%) | 141 |
1991 | 10వ లోక్సభ | 1,12,80,003 (48.4%) | 38 |
1995 | 10వ అసెంబ్లీ | 1,19,41,832 (31%) | 80 |
1996 | 11వ లోక్సభ | 98,64,853 (34.78%) | 15 |
1998 | 12వ లోక్సభ | 1,37,44,283 (43.64%) | 33 |
1999 | 13వ లోక్సభ | 98,12,144 (29.71%) | 10 |
1999 | 11వ అసెంబ్లీ | 89,37,043 (27.20%) | 75 |
2004 | 14వ లోక్సభ | 81,43,246 (23.77%) | 13 |
2004 | 12వ అసెంబ్లీ | 88,10,363 (21.06%) | 69 |
2009 | 15వ లోక్సభ | 72,53,634 (19.61%) | 17 |
2009 | 13వ అసెంబ్లీ | 95,21,703 (21.01%) | 82 |
2014 | 16వ లోక్సభ | 88,30,190 (18.29%) | 2 |
2014 | 14వ అసెంబ్లీ | 94,96,095 (17.95%) | 42 |
2019 | 17వ లోక్సభ | 87,92,237 (16.41%) | 1 |
2019 | 15వ అసెంబ్లీ | 87,52,199 (15.87%) | 44 |
ఇది కూడా చూడండి
[మార్చు]- ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
- భారత జాతీయ కాంగ్రెస్
- మహారాష్ట్ర రాజకీయాలు
- ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ