మిర్యాలగూడ రెవెన్యూ డివిజను
మిర్యాలగూడ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మిర్యాలగూడ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. నల్గొండ జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం మిర్యాలగూడ పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఈ రెవెన్యూ డివిజను నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.
పరిపాలన
[మార్చు]మిర్యాలగూడ డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | మిర్యాలగూడ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | దామెరచర్ల మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
2 | అడవిదేవులపల్లి మండలం | 6 రెవెన్యూ గ్రామాలు |
3 | మిర్యాలగూడ మండలం | 24 రెవెన్యూ గ్రామాలు |
4 | వేములపల్లి మండలం | 13 రెవెన్యూ గ్రామాలు |
5 | అనుముల మండలం | 19 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
6 | నిడమనూరు మండలం | 15 రెవెన్యూ గ్రామాలు |
7 | పెద్దవూర మండలం | 21 రెవెన్యూ గ్రామాలు |
8 | త్రిపురారం మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
9 | మాడుగుల పల్లె మండలం | 21 రెవెన్యూ గ్రామాలు |
10 | తిరుమలగిరి సాగర్ మండలం | 14 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Yadadri district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 2017-02-15. Retrieved 2022-08-21.
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-08-21.
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-21.