మెండా ప్రభాకర్‌రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెండా ప్రభాకర్‌ రావు
1985లో ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. చేతులమీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకుంటూ
జననంమెండా ప్రభాకర్‌రావు
(1935-06-21)1935 జూన్ 21
కామేపల్లివారిపాలెం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం2006 ఏప్రిల్ 2(2006-04-02) (వయసు 70)
హైదరాబాదు, తెలంగాణ
మరణ కారణంగుండెపోటు
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధికవి, రచయిత, నటుడు
మతంక్రిస్టియన్
తండ్రియల్లమందయ్య
తల్లిఐడమ్మ

మెండా ప్రభాకర్‌రావు (1935, జూన్ 212006, ఏప్రిల్ 2) కవి, రచయిత, నటుడు, ఉపాధ్యాయుడు. బాలసాహితీవేత్తగా ప్రసిద్ధి చెందాడు. నటుడిగా అనేక నాటకాలలో వివిధ పాత్రలలో నటించాడు.[1] 1985లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకున్నాడు.[2]

జననం, విద్య

[మార్చు]

ప్రభాకర్‌రావు 1935, జూన్ 21న యల్లమందయ్య - ఐడమ్మ దంపతులకు ఐదవ సంతానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కామేపల్లివారిపాలెం అనే గ్రామంలో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాపాన్ని సంతనూతలపాడు, పెదకొత్తపల్లి, ఒంగోలు తదితర ప్రాంతాలలో చదివాడు. అనంతరం కావలి పట్టణంలోని జవహర్ భారతి కళాశాలలో బిఏ డిగ్రీ, వరంగల్లులో బి.ఎడ్. పూర్తిచేశాడు.[3]

ఉద్యోగం

[మార్చు]

నిజామాబాదులోని నూతన వైశ్య ఉన్నత పాఠశాలలో మూడు దశాబ్దాలపాటు ఉపాధ్యాయునిగా పనిచేసి, 1992లో పదవి విరమణ చేసాడు.

సాహిత్యరంగం

[మార్చు]

1961లో గిడుగు వెంకట సీతాపతి పంతులు దగ్గర శిక్షణపొందిన ప్రభాకర్‌రావు, మొదటగా 'పాపాయి-తువ్వాయి' అనే బాల గేయ సంపుటిని రాశాడు. బాల సాహిత్యమే కాకుండా గేయాలు, సాంఘిక నాటకాలు, సంగీత నృత్య రూపకాలు, ఉగాది పాటలు, జానపద గీతాలు, వివాహ గీతాలు, వయోజన విద్య, దేశ భక్తి గీతాలు , క్రైస్తవ, బౌద్ధ, హైందవ పురాణాలను సంగీత నృత్య రూపకాలుగా రచించాడు.[1]

నాటకరంగం

[మార్చు]

అరవయ్యో దశకంలో  నిజామాబాదు జిల్లాలో కొందరు ఔత్సాహికులు, నాటక ప్రదర్శనలు చేసేవారు. ఆరవ తరగతి నుండే నాటకాలలో నటించిన ప్రభాకర్‌రావు అనేక బహుమతులను అందుకున్నాడు. 1962లో గౌతమ కళాసమితి అనే సంస్థను స్థాపించి, ఆ సంస్థ ద్వారా కె. కళాధర్, చంద్రప్రకాష్, కె. హనుమంతరావు, చావలి కృష్ణమూర్తితో కలిసి నాటికలను ప్రదర్శించాడు. జాతీయస్థాయి నాటిక పోటీలలో పాల్గొని నిజామాబాదు జిల్లాకి నాటకాలలో గుర్తింపును తీసుకొచ్చాడు.[3]

రచనలు

[మార్చు]
  • ముద్రితాలు
  1. 1957–59: "విశాలాంధ్ర" చిన్నారి లోకంలో గేయాలు
  2. 1961: పాపాయి - తువ్వాయి (రచనాలయా హైదరాబాద్ ప్రచురణ)
  3. 1973: పాపాయి-రూపాయి
  4. 1981: బాల సాహిత్యం - రచన, ఉడుత - బుడుత, సిధార్థ.
  5. 1993: ప్రభు పలుకులు, పది మంది కన్యకలు, మంచి సమరయుడు, తప్పిపోయిన కుమారుడు, సమరయ స్త్రీ, పాపపు స్త్రీ, లాజర్, పుట్టు గుడ్డివాడు
  • ఆముద్రితాలు: రక్షకుడు,[4] సృష్టి-సమదృష్టి, వరూధిని ప్రవరాఖ్య, శకుంతల ప్రణయం, భక్త ధ్రువ మార్కండేయ, నిప్పురాళ్లు, మోదుగ మొగ్గలు, రక్త పింజరులు, శిల్పి, సుజాతుడు, మోడీ (పాముల వాళ్ళ జీవితాలు)
  • సంగీత నృత్య రూపకాలు: రక్షకుడు, సిధార్థ, వరూధిని ప్రవరాఖ్య, శకుంతల ప్రణయం, మోడీ, ధ్రువ మార్కండేయ, ప్రభు పలుకులు, సుజాతుడు, కచ దేవయాని, అక్షర జ్యోతి.
  • ఆకాశవాణి/ దూరదర్శన్: మోడీ సంగీత రూపకం, పల్లె, శకుంతల ప్రణయం, సృష్టి - సమదృష్టి సంగీత రూపకం, క్రీస్తు జననం, దేశ భక్తి గీతాలు, వయోజన విద్య గీతాలు, కుటుంబ సంక్షేమ గీతాలు, ఉగాది పాటలు.[5]

అవార్డులు

[మార్చు]
  • 1985: అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయ (నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్) అవార్డు[6]
  • 1989: చిలకలూరిపేట కళానిలయం నుండి 'సృష్టి  సమదృష్టి' సంగీత నృత్య రూపకానికి జాతీయస్థాయి ఉత్తమ రచయిత అవార్డు
  • 1990: చిలకలూరిపేట కళానిలయం నుండి 'మోడీ' నాటికకు జాతీయస్థాయి ద్వితీయ ఉత్తమ రచయిత అవార్డు[7]

మరణం

[మార్చు]

ప్రభాకర్‌రావు 2006, ఏప్రిల్ 2న గుండెపోటుతో హైదరాబాదులో మరణించాడు.

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 బాలసాహితీ కృషీవలుడు 'మెండా', అతిథి, వార్త ఆదివారం సంచిక, 1998 ఏప్రిల్ 19, పుటలు 14,15.
  2. ఉత్తమ రచయత నటుడు మెండా ప్రభాకర్‌రావు, ఈనాడు, నిజామాబాదు, 1991 అక్టోబరు 22.
  3. 3.0 3.1 ఎం. ప్రభాకర్‌రావు, జిల్లా కళాకారులు, పొద్దు దినపత్రిక, నిజామాబాదు, 1986 డిసెంబరు 26.
  4. నిజామాబాదులో రక్షకుడు సంగీత రూపకం, ఆంధ్రభూమి, నిజామాబాదు ఎడిషన్, 1980 జనవరి 7.
  5. నృత్య నాటికల రచయత మెండా ప్రభాకర్‌రావు, ఈనాడు, నిజామాబాదు, 1990 జూలై 26.
  6. యన్టీ రామారావుతో ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కారం, పొద్దు దినపత్రిక, నిజామాబాదు, 1985 అక్టోబరు 12.
  7. చిలకలూరిపేట అఖిల భారత పోటీల్లో 'కళాభారతి'దే పైచేయి, పొద్దు దినపత్రిక, నిజామాబాదు, 1990 జూన్ 17.

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.