అక్షాంశ రేఖాంశాలు: 51°31′46″N 0°10′22″W / 51.5294°N 0.1727°W / 51.5294; -0.1727

లార్డ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లార్డ్స్ క్రికెట్ మైదానం
క్రికెట్‌కు నిలయం
లార్డ్స్ లోగో
ది పెవిలియన్
మైదాన సమాచారం
ప్రదేశంసెంట్ జాన్‌స్ వుడ్, లండన్
భౌగోళికాంశాలు51°31′46″N 0°10′22″W / 51.5294°N 0.1727°W / 51.5294; -0.1727
స్థాపితం1814; 210 సంవత్సరాల క్రితం (1814)
సామర్థ్యం (కెపాసిటీ)31,100[1]
యజమానిమార్లెబోన్ క్రికెట్ క్లబ్
వాడుతున్నవారుఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ క్లబ్
ఎండ్‌ల పేర్లు
నర్సరీ ఎండ్
పెవిలియన్ ఎండ్
అంతర్జాతీయ సమాచారం
మొదటి టెస్టు1884 జూలై 21–23:
 ఇంగ్లాండు v  ఆస్ట్రేలియా
చివరి టెస్టు2023 జూన్ 28 – జూలై 2:
 ఇంగ్లాండు v  ఆస్ట్రేలియా
మొదటి ODI1972 ఆగస్టు 26:
 ఇంగ్లాండు v  ఆస్ట్రేలియా
చివరి ODI2022జూలై 14:
 ఇంగ్లాండు v  India
మొదటి T20I2009 జూన్ 5:
 ఇంగ్లాండు v  నెదర్లాండ్స్
చివరి T20I2018 జూలై 29:
 నేపాల్ v  నెదర్లాండ్స్
మొదటి WODI1976 ఆగస్టు 4:
 ఇంగ్లాండు v  ఆస్ట్రేలియా
చివరి WODI2022 సెప్టెంబరు 24:
 ఇంగ్లాండు v  India
మొదటి WT20I2009 జూన్ 21:
 ఇంగ్లాండు v  న్యూజీలాండ్
చివరి WT20I2023 జూలై 8:
 ఇంగ్లాండు v  ఆస్ట్రేలియా
జట్టు సమాచారం
మార్లెబోన్ క్రికెట్ క్లబ్ (1814 – present)
మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ (1877 – ఇప్పటివరకు)
2023 జూలై 8 నాటికి
Source: ESPNcricinfo

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ సెయింట్ జాన్స్ వుడ్‌లోని క్రికెట్ మైదానం. దీన్ని సాధారణంగా లార్డ్స్ అని పిలుస్తారు. దాని వ్యవస్థాపకుడు, థామస్ లార్డ్ పేరు దీనికి పెట్టారు. ఇది మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సిసి) యాజమాన్యంలో ఉంది. మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB), యూరోపియన్ క్రికెట్ కౌన్సిల్ (ECC), 2005 ఆగస్టు వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) లకు ఇది నిలయం. లార్డ్స్‌ను క్రికెట్‌కు నిలయంగా పిలుస్తారు.[2] ఇక్కడ, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన క్రీడా మ్యూజియం ఉంది.[3]

ఈరోజున లార్డ్స్, దాని ఒరిజినల్ స్థలంలో లేదు; 1787, 1814 లమధ్య థామస్ లార్డ్ స్థాపించిన మూడు మైదానాలలో ఇది మూడవది. ఇప్పుడు లార్డ్స్ ఓల్డ్ గ్రౌండ్ అని పిలవబడే మొదటి మైదానం ఇప్పుడు డోర్సెట్ స్క్వేర్‌లో ఉంది. రెండవ మైదానం, లార్డ్స్ మిడిల్ గ్రౌండ్, 1811 నుండి 1813 వరకు వాడారు. దాని అవుట్‌ఫీల్డ్ గుండా రీజెంట్స్ కెనాల్ నిర్మాణం జరగడంతో దాన్ని వదిలేసారు. ప్రస్తుత లార్డ్స్ మైదానం, మిడిల్ గ్రౌండ్ స్థలానికి వాయవ్యంగా దాదాపు 230 మీటర్ల దూరంలో ఉంది. మైదానంలో 31,100 మంది ప్రేక్షకులు పట్టే సామర్థ్యం ఉంది. ఎమ్‌సిసి చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలలో భాగంగా 2017, 2022 మధ్య దీని సామర్థ్యం పెరిగింది.

చరిత్ర

[మార్చు]

నేపథ్యం

[మార్చు]

 

లార్డ్స్ పాత మైదానం (ఎడమ) మిడిల్ గ్రౌండ్ (కుడి) లకు గుర్తుగా తయారుచేసిన చేసిన ప్లేక్‌లు

వైట్ కాండ్యూట్ క్లబ్ సభ్యుల తరపున వ్యవహరిస్తూ థామస్ లార్డ్ 1787 మేలో ప్రస్తుతం డోర్సెట్ స్క్వేర్ ఉన్న స్థలంలో, పోర్ట్‌మన్ ఎస్టేట్ నుండి లీజుకు తీసుకున్న భూమిలో మొదటి మైదానాన్ని ప్రారంభించాడు. దీనిలో ఏమైనా నష్టాలు వస్తే భరించేందుకు 9వ ఎర్ల్ ఆఫ్ వించిల్సియా ఐన జార్జ్ ఫించ్, కల్నల్ చార్లెస్ లెనాక్స్ లు హామీ ఇచ్చారు.[4] వైట్ కాండ్యూట్‌ను ఇస్లింగ్టన్ నుండి అక్కడికి తరలించారు. వైట్ కండ్యూట్ ఫీల్డ్స్‌లోని మైదానం ప్రమాణాలపై అసంతృప్తి చెందింది. ఆ తర్వాత వెంటనే అది మారిలేబోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సిసి)గా పునర్నిర్మించబడింది. వైట్ కాండ్యూట్ ఫీల్డ్స్ ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్, వెస్ట్ ఎండ్ నుండి చాలా దూరంగా ఉండడంతో, కొత్త మైదానాన్ని ఏర్పాటు చేసుకుంటే దాని సభ్యులకు మరింత ప్రత్యేకత ఉంటుందని భావించారు.[5] కొత్త మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్‌, ఎసెక్స్‌తో తలపడింది.[6] [7] 1811లో, అద్దె పెరగడం వల్ల వేరే చోటికి వెళ్లాలని భావించి, లార్డ్ అక్కడి టర్ఫును తీసివేసి రెండవ మైదానంలో పరిచాడు. కానీ ఇది స్వల్పకాలికమే అయింది. ఎందుకంటే ఇది రీజెంట్స్ కెనాల్ కోసం పార్లమెంటు నిర్ణయించిన మార్గంలో ఉంది. పైగా దీని పట్ల మైదాన పోషకులకు ఆదరణ లేదు. [7] [6]

"మిడిల్ గ్రౌండ్" ఐర్ కుటుంబానికి చెందిన ఎస్టేట్‌లో ఉంది. వారు సమీపంలోని మరొక స్థలాన్ని లార్డ్‌కు ఇచ్చారు. అతను మళ్ళీ తన టర్ఫును అక్కడికి మార్చాడు. కొత్త మైదానాన్ని 1814 సీజన్‌లో ప్రారంభించారు. 1814 జూన్ 22 న ఈ గ్రౌండ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఎమ్‌సిసి, హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌తో ఆడింది [8] [6]

ప్రారంభ చరిత్ర

[మార్చు]
మైదానం మారిన స్థలాలు

1813-14లో లార్డ్స్‌లో ఒక చావడి నిర్మించారు.[9][10] ఆ తరువాత ఒక చెక్క మంటపాన్ని (పెవిలియన్) నిర్మించారు. ప్రస్తుత మైదానంలో మొట్టమొదటి ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్ 1814 జూలైలో ఎమ్‌సిసి, సెయింట్ జాన్స్ వుడ్ క్రికెట్ క్లబ్‌తో ఆడింది.[11] ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో గ్రౌండ్‌లో నమోదైన మొదటి సెంచరీని ఫ్రెడరిక్ వుడ్‌బ్రిడ్జ్ (107) మిడిల్‌సెక్స్‌కు వ్యతిరేకంగా ఎప్సోమ్ తరపున చేశాడు. అదే మ్యాచ్‌లో, ఎప్సమ్‌కు చెందిన ఫెలిక్స్ లాడ్‌బ్రోక్ (116) రెండో సెంచరీని నమోదు చేశాడు.[5] 1805లో ఓల్డ్ గ్రౌండ్‌లో మొదలైన వార్షిక ఈటన్ v హారో మ్యాచ్ 1818 జూలై 29 న ప్రస్తుత మైదానంలో మళ్ళీ ఆడారు. 1822 నుండి, లార్డ్స్‌లో ఈ మ్యాచ్ జరగడం, ఏటా జరిగే ఆనవాయితీగా మారింది. [12]

1820 లో లార్డ్శ్‌లో ఎమ్‌సిసి తరపున నార్‌ఫోక్‌తో ఆడుతూ, విలియం వార్డ్ 278 పరుగులు చేసినపుడు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ నమోదైంది.[5] 1823 జూలై 23 న ఆ మధ్యనే కొత్తగా నిర్మించిన ఒరిజినల్‌ పెవిలియన్ తగలబడి పోయినపుడు, ఎమ్‌సిసి రికార్డులన్నీ కాలిపోయాయి.[5][13] లార్డ్ ఆ పెవిలియన్ను మళ్ళీ నిర్మించాడు. 1825 లో లార్డ్ ఈ మైదాన ప్రదేశంలో ఇళ్ళు నిర్మించడానికి ప్రయత్నించడంతో మైదానం భవిష్యత్తు ప్రమాదంలో పడింది. విలియం వార్డ్ దాన్ని అడ్డుకుని,[6] ఆ మైదానాన్ని £5,000 కు లార్డ్ నుండి కొనేసాడు.

మొదటి యూనివర్శిటీ క్రికెట్ మ్యాచ్ 1827లో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ ల మధ్య లార్డ్స్‌లో, చార్లెస్ వర్డ్స్‌వర్త్ ప్రోద్బలంతో జరిగింది.[14] 2020 వరకు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ అది. 1835 వరకు ఈ మైదానం వార్డ్ యాజమాన్యంలో ఉంది, ఆ తర్వాత జేమ్స్ డార్క్‌ అధీనం లోకి వెళ్ళింది. 1838లో పెవిలియన్‌కు మరమ్మత్తులు చేసి, గ్యాస్ లైటింగు ఏర్పాటు చేసారు.[15] లార్డ్స్‌ను అప్పటికీ ఒక గ్రామీణ మైదానంగానే పరిగణించేవారు. మైదానానికి ఉత్తర పశ్చిమాల్లో బహిరంగ గ్రామీణ ప్రాంతాలుండేవి.[16] 1845లో లార్డ్ కాటెస్‌లో, లార్డ్స్‌ను ఒక మోటు వేదిక అని వర్ణించాడు. మైదానం చుట్టూ కురచపాటి బెంచీలతో వృత్తాకారంలో ప్రేక్షకులకు సీటింగును ఏర్పాటు చేసారు.[17] 1846లో టెలిగ్రాఫ్ స్కోర్‌బోర్డును ప్రవేశపెట్టడంతో క్రమంగా మైదానంలో మెరుగుదల కార్యక్రమాలు మొదలయ్యాయి. నిపుణుల కోసం 1848లో పెవిలియన్‌కు ఉత్తరం వైపున ఒక చిన్న గది నిర్మించారు. వారు మైదానం లోకి వెళ్ళేందుకు ప్రత్యేకంగా ద్వారం నిర్మించారు. అదే సంవత్సరంలో స్కోర్‌కార్డులను ప్రవేశపెట్టారు. 1849-50లో డ్రైనేజీ వ్యవస్థను స్థాపించారు.[17]

ఆస్ట్రేలియన్ అబోరిజినల్ క్రికెట్ జట్టు 1868లో ఇంగ్లాండ్‌లో పర్యటించింది. వారితో జరిగిన మ్యాచ్‌లలో ఒకదానిని లార్డ్స్‌లో జరిపారు. ది టైమ్స్ పత్రిక పర్యాటక ఆటగాళ్లతో జరిగిన మ్యాచ్ గురించి, ఆ ఆటగాళ్ల గురించీ రాస్తూ, "లార్డ్స్‌లో క్రికెట్‌ ఆటను చేసిన ఎగతాళి" అనీ, "ఖైదీల వలస రాజ్యంలో, లొంగదీయబడ్డ స్థానికులు" అనీ అభివర్ణించింది. 1863లో డార్క్, మైదానంలో తన వాటాను అమ్మేస్తానని ప్రతిపాదించాడు. మిగిలిన 29 ½ సంవత్సరాలు లీజును £15,000 రుసుముకు అమ్ముతానని చెప్పాడు. 1864లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న డార్క్‌, లార్డ్స్‌లో తన వాటాను £11,000కి విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.[6][14][18] 1865లో మైదానం భూస్వామి ఐజాక్ మోసెస్, దాన్నంతటినీ £21,000కి అమ్మజూపాడు. తరువాత దాన్ని £18,150కి తగ్గించాడు. ఆ సమయంలో ఎమ్‌సిసి కమిటీలో సభ్యుడిగా ఉన్న విలియం నికల్సన్, ఎమ్‌సిసి ఆ మైదానాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తే తాను తనఖాపై డబ్బును అప్పుగా ఇస్తానని ప్రతిపాదించగా దాన్ని, 1866 మే 2 న జరిగిన ప్రత్యేక సాధారణ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు.[14] కొనుగోలు అనంతరం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్రీడాకారులు ప్రాక్టీస్ చేయడానికి క్రికెట్ నెట్‌లను జోడించడం, ఆర్కిటెక్ట్ ఆర్థర్ అల్లోమ్ రూపొందించిన గ్రాండ్‌స్టాండ్‌ను 1867-68 శీతాకాలంలో నిర్మించడం, ప్రెస్‌కు వసతిని కూడా అందించడం వీటిలో ఉన్నాయి.[19][20][21] దీనికి ఎమ్‌సిసి సభ్యుల ప్రైవేట్ సిండికేట్ నిధులు సమకూర్చింది, వీరి నుండి ఎమ్‌సిసి స్టాండ్‌ను 1869లో కొనుగోలు చేసింది.[22] 1860లలో లార్డ్స్‌లోని వికెట్ దుస్థితి పట్ల తీవ్ర విమర్శలకు గురైంది. ఫ్రెడరిక్ గేల్ లండన్‌ చుట్టుపక్కల 20 మైళ్ల దూరంలో ఉన్న క్రికెట్ మైదానాల్లో పదిలో తొమ్మిదింటిలో మెరుగైన వికెట్‌ ఉంటుందని విమర్శించాడు;[9][19] వికెట్ ఎంత దుస్థితిలో ఉందంటే, 1864 లో ససెక్స్ అక్కడ ఆడేందుకు నిరాకరించింది.

కొనసాగిన అభివృద్ధి

[మార్చు]

1860లు 1870ల నాటికి, ఈటన్, హారోల మధ్య ప్రభుత్వ పాఠశాలల మ్యాచ్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ల మధ్య జరిగిన యూనివర్శిటీ మ్యాచ్, జెంటిల్‌మెన్ v ప్లేయర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఆ కాలంలో జరిగిన గొప్ప సామాజిక సంఘటనలు. ఈ మూడు మ్యాచ్‌లు పెద్దసంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించాయి. 1866లో జనం చాలా పెద్ద సంఖ్యలో ఆడుకునే ప్రదేశాన్ని ఆక్రమించడంత్ఫో బౌండరీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడింది.[23] 1871లో టర్న్‌స్టైల్స్‌ను ప్రవేశపెట్టి, ప్రేక్షకులను నియంత్రించే చర్యలు మొదలుపెట్టారు.[24] పెవిలియన్ను 1860ల మధ్యలో విస్తరించారు. కొంతకాలం తర్వాత, 1867 డిసెంబరులో ఒరిజినల్ పెవిలియన్ స్థానంలో కొత్త పెవిలియన్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు.[9] ఈ సమయంలో ఒక కొత్త కౌంటీ గేమ్ రూపుదిద్దుకోవడం మొదలైంది.[25] లార్డ్స్ మరిన్ని కౌంటీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడంతో, అంపైర్లు బాధ్యత తీసుకుని పిచ్‌లను మెరుగుపరచారు.[26]

ఆర్కిటెక్ట్ థామస్ వెరిటీ రూపొందించిన పెవిలియన్. దీన్ని 1889-90లో నిర్మించారు.

డేవ్ గ్రెగొరీ నేతృత్వంలోని మొదటి ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు 1878 మే 27 న లార్డ్స్‌లో ఆడింది. ఆతిథ్య జట్టు ఎమ్‌సిసిని 9 వికెట్ల తేడాతో ఓడించింది.[27] ఇది దిగ్భ్రాంతి కలిగించింది. ఆస్ట్రేలియన్ జట్టుకు కీర్తి సాధించి పెట్టడమే కాకుండా ఇది, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య పోటీని కూడా స్థాపించింది.[28] 1884 యాషెస్ సమయంలో లార్డ్స్ లో మొదటి టెస్ట్ మ్యాచ్‌ జరిగింది. ది ఓవల్, ఓల్డ్ ట్రాఫోర్డ్ తర్వాత ఇంగ్లాండ్‌లో టెస్ట్ క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చే మూడవ వేదికగా లార్డ్స్ అవతరించింది.[29] లార్డ్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన AG స్టీల్ మొదటి టెస్టు శతకాన్ని చేయగా, ఎడ్మండ్ పీట్ తొలి ఐదు వికెట్ల సాధనను నమోదు చేసాడు. ఈ మ్యాచ్‌ను ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 5 పరుగుల తేడాతో గెలుచుకుంది.[30]

1887లో క్వీన్ విక్టోరియా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా, బెల్జియం, డెన్మార్క్, సాక్సోనీ, పోర్చుగల్ రాజులు లార్డ్స్‌లో పోటీ పడ్డాయి. వారిలో ఎవరికీ క్రికెట్‌పై పట్టు లేదని గుర్తించారు. అదే సంవత్సరంలో ఎమ్‌సిసి వందవ వార్షికోత్సవ వేడుకలను లార్డ్స్ నిర్వహించింది. ఎమ్‌సిసి ఇంగ్లాండ్‌తో ఒక వేడుక మ్యాచ్ ఆడింది.[31] పెరుగుతున్న సభ్యత్వ సంఖ్య, ప్రేక్షకుల సంఖ్య కారణాంగా, కేవలం రెండు-అంతస్తుల కప్పుతో కూడిన గ్రాండ్‌స్టాండ్ సరిపోదని భావించి £21,000 ఖర్చుతో కొత్త పెవిలియన్‌ను నిర్మించాలని నిర్ణయించారు.[21] థామస్ వెరిటీ రూపొందించిన ఈ పెవిలియన్ నిర్మాణం 1889-90లో జరిగింది.[32] పాత పెవిలియన్‌ని సస్సెక్స్‌లోని ఒక ఎస్టేట్‌లోకి తరలించి, చాలా శ్రమతో పునర్నిర్మించారు. అక్కడ అది ఒక తోటలో షెడ్డుగా జీవించింది.[33] దీని తరువాత ఎమ్‌సిసి, తూర్పున ఉన్న భూమిని కొనుగోలు చేసింది. దీనినే నేడు నర్సరీ గ్రౌండ్ అని పిలుస్తారు; ఇది ఇంతకుముందు హెండర్సన్స్ నర్సరీగా పిలువబడే మార్కెట్ గార్డెన్. ఇక్కడ అనాస, తులిప్‌లను సాగు చేసేవారు.[21][32][34] మాంచెస్టర్, షెఫీల్డ్ అండ్ లింకన్‌షైర్ రైల్వే తమ రైలుమార్గం కోసం మేరీల్‌బోన్ స్టేషన్‌లో కొంత ప్రాంతాన్ని కొనుగోలు చేసేందుకు చేసిన ప్రయత్నాలతో మైదానం ప్రమాదంలో పడింది.[35] కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఎమ్‌సిసి, వెల్లింగ్‌టన్ రోడ్‌కు సరిహద్దులో ఉన్న ఒక భూమిని వదులుకుని, దానికి బదులుగా క్లెర్జీ ఆర్ఫన్ స్కూలును పొందింది.[32] మేరిల్‌బోన్ స్టేషన్‌లోకి రైలుమార్గాన్ని నిర్మించడానికి, 1894, 1898 మధ్య కట్-అండ్-కవర్ పద్ధతిని ఉపయోగించి సొరంగాలను నిర్మించడానికి నర్సరీ గ్రౌండ్‌ను తవ్వాల్సి వచ్చింది. పూర్తయిన తర్వాత రైల్వే కంపెనీ కొత్త పిచ్‌ను వేసింది.[36]

1899లో లార్డ్స్‌లో జరుగుతున్న మ్యాచ్.

దక్షిణాఫ్రికా మిలియనీర్ సర్ అబే బెయిలీ నిర్వహించిన 1912 ముక్కోణపు టోర్నమెంట్‌లో తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లలో మూడింటికి లార్డ్స్ ఆతిథ్యం ఇచ్చింది.[37] 1914 జూన్‌లో ఎమ్‌సిసి మధ్య జరిగిన మ్యాచ్‌తో మైదానపు శతవార్షికోత్సవం జరుపుకున్నారు. మూడు రోజుల ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో విజయం సాధించింది.[38] మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో లార్డ్స్‌ను సైన్యం స్వాధీనం చేసుకుని, అక్కడ టెరిటోరియల్ ఆర్మీ, రాయల్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ (RAMC) రాయల్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ లను విడిది చేయించింది. మైదానంలో సైనిక సిబ్బందికి వంట, వైర్‌లెస్ బోధనా తరగతులు రెండూ జరిపారు. RAMC వెళ్ళిపోయిన తర్వాత, వార్ ఆఫీస్ వారు నర్సరీ మైదానాన్ని, ఇతర భవనాలనూ రాయల్ ఆర్టిలరీ క్యాడెట్‌లకు శిక్షణా కేంద్రంగా ఉపయోగించింది. యుద్ధ కాలమంతా, పెవిలియన్ను, దాని పొడవైన గదినీ వెస్ట్రన్ ఫ్రంట్‌లో గుర్రాల గడ్డిమోపుల కోసం వాడే వలల తయారీకి ఉపయోగించారు.[39] సైన్యం అధీనంలో ఉన్నప్పటికీ, లార్డ్స్‌లో యుద్ధ సమయంలో కూడా అనేక ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించారు. ఇందులో బ్రిటీష్ సామ్రాజ్యంలోని వివిధ భూభాగాల నుండి వచ్చిన సైనిక బృందాలు ఆడాయి.[40] ఈ మ్యాచ్‌లకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 1918లో ఇంగ్లండు, డొమినియన్‌ల మధ్య జరిగిన ఒక మ్యాచ్‌కు జార్జ్ V, డ్యూక్ ఆఫ్ కన్నాట్ హాజరయ్యారు.[41]

యుద్ధానంతరం

[మార్చు]

యుద్ధం ముగిసిన తర్వాత క్రికెట్ మ్యాచ్‌లకు హాజరయ్యే వారి సంఖ్య పెరిగింది. 1948 యాషెస్ సిరీస్‌లో రెండవ టెస్టు చూసేందుకు 1,32,000 ప్రజల స్థూల హాజరు, సమకూరిన £43,000 ఆదాయం, ఆ సమయంలో ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లలో రికార్డు.[42] ఈ డిమాండ్ కారణంగా 1958లో వార్నర్ స్టాండ్ నిర్మాణంతో మైదానాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో స్నాక్ బార్‌లు, ప్రెస్ బాక్స్ కూడా ఉన్నాయి.[21][43] వార్నర్ స్టాండ్ నిర్మాణానికి ముందు, గ్రౌండ్‌లోని అన్ని స్టాండ్‌లను వర్ణమాల అక్షరాలతో గుర్తించేవారు.[44]

1950ల చివరి నాటికి టెస్ట్, కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లకు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య క్షీణించడం ప్రారంభమైంది. 1947లో 22 లక్షల ఆదాయం రాగా, 1963లో అది 7,19,661కి పడిపోయింది. ఈ క్షీణతను అరికట్టడానికి, 1963లో లిస్ట్ A వన్డే క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. 1963 జిల్లెట్ కప్‌లో మిడిల్‌సెక్స్, నార్తాంప్టన్‌షైర్‌ల మధ్య మొదటి లిస్ట్ A మ్యాచ్‌ను లార్డ్స్‌లో నిర్వహించారు. తర్వాత సస్సెక్స్, వోర్సెస్టర్‌షైర్ మధ్య పోటీలో ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చింది. దానికి 24,000 మంది హాజరయ్యారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి ఫైనల్‌ జరగడం ఇదే తొలిసారి.[45] 1968లో టావెర్న్ దాని ప్రక్కన ఉన్న భవనాలను కూల్చివేసారు. ఇది టావెర్న్ స్టాండ్ నిర్మాణానికి దారితీసింది.[21] 1972లో లార్డ్స్‌లో మొదటి వన్డే ఇంటర్నేషనల్ (ODI) జరిగింది.[46] అందులో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.[47] మూడు సంవత్సరాల తర్వాత లార్డ్స్ వేదికగా పురుషుల ప్రపంచ కప్ ఫైనల్‌ జరిగింది. అందులో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం సాధించింది.[48] నాలుగు సంవత్సరాల తర్వాత, లార్డ్స్‌లో 1979 ప్రపంచ కప్‌లో ఫైనల్‌ను నిర్వహించారు. మళ్ళీ వెస్టిండీస్‌, ఈసారి ఇంగ్లండ్‌పై, విజయం సాధించింది.[49]

లార్డ్స్‌లో మొదటి మహిళల క్రికెట్ మ్యాచ్ 1976 ఆగస్టులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 60 ఓవర్ల ODI గా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. లార్డ్స్‌లో మహిళల మ్యాచ్ ఆడే అవకాశం రాచెల్ హేహో ఫ్లింట్ చేసిన ప్రచారం ఫలితంగా వచ్చింది. 1973 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఆమెకు మరింత ప్రోత్సాహం లభించింది. లార్డ్స్‌లో రెండో మ్యాచ్ మరో 11 ఏళ్ల తర్వాత గానీ జరగలేదు.[50] ఈ మైదానం 1993 లో జరిగిన ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఆట కోసం మైదానాన్ని పూర్తిగా తెరవనందున కేవలం 5,000 మంది ప్రేక్షకులు మాత్రమే హాజరు కాగలిగారు.[51]

గ్రాండ్ స్టాండ్ (చిత్రం)ను 1998లో నవీకరించారు

సర్ జాక్ హేవార్డ్ సమకూర్చిన £75,000 నిధులు, లార్డ్స్ టవర్నర్స్, ది స్పోర్ట్స్ కౌన్సిల్ ల నుండి ద్వారా సేకరించబడిన అదనపు నిధులతో 1973లో నర్సరీ ఎండ్‌లో ఒక కొత్త ఇండోర్ క్రికెట్ స్కూల్ నిర్మాణం పూర్తయింది.[52] 1983లో వెస్టిండీస్ వరుసగా మూడో ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిండి. అయితే భారత్ చేతిలో 43 పరుగుల తేడాతో ఓడిపోయింది.[53] 1987లో ఎమ్‌సిసి ద్విశతాబ్ది సందర్భంగా ప్రారంభించబడిన మైఖేల్ హాప్‌కిన్స్ అండ్ పార్ట్‌నర్స్ రూపొందించిన కొత్త స్టాండ్‌ను రూపొందించడానికి 1985లో మౌండ్ స్టాండ్‌ను కూల్చివేసారు.[54] 1987 ఆగస్టులో ఎమ్‌సిసి, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ టీమ్‌ల మధ్య ఐదు రోజుల మ్యాచ్‌తో ఆ ద్విశతాబ్దిని జరుపుకున్నారు, ఆఖరి రోజు వర్షం పడడంతో అది డ్రాగా ముగిసింది.[55]

1990లో గ్రాహం గూచ్, భారత్‌పై 333 పరుగులతో లార్డ్స్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్‌ ట్రిపుల్ సెంచరీ చేశాడు.[56] 20వ-శతాబ్దపు చివరి దశాబ్దంలో లార్డ్స్ వేగంగా అభివృద్ధి చెందింది. కాంప్టన్, ఎడ్రిచ్ స్టాండ్‌లు 1991లో పూర్తయ్యాయి.[21] 1995లో ప్రారంభమైన కొత్త అత్యాధునిక ఇండోర్ క్రికెట్ సెంటర్ నిర్మాణం కారణంగా [52]లో ఇండోర్ పాఠశాలను మూసివేసారు. పాత గ్రాండ్‌స్టాండ్‌ను 1996లో కూల్చివేసి, దాని స్థానంలో నికోలస్ గ్రిమ్‌షా & పార్ట్‌నర్స్ రూపొందించిన ప్రత్యామ్నాయాన్ని 1998లో పూర్తి చేసారు. 1997 నుండి లార్డ్స్, యూరోపియన్ క్రికెట్ కౌన్సిల్ (ECC)కి నిలయంగా ఉంది.[57] లార్డ్స్ 1999 ప్రపంచ కప్‌లో ఫైనల్‌తో సహా మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఎమ్‌సిసి, నర్సరీ ఎండ్‌లో కాంప్టన్, ఎడ్రిచ్ స్టాండ్‌ల మధ్య మీడియా సెంటర్‌ను నిర్మించి, బౌలర్ల చేతుల మీదుగా పెవిలియన్ వైపు చక్కటి వీక్షణలను అందించడం ద్వారా ప్రెస్ సౌకర్యాలను మెరుగుపరచింది. మీడియా సెంటర్‌ను 1999 ఏప్రిల్‌లో అప్పటి ఎమ్‌సిసి ప్రెసిడెంట్ టోనీ లూయిస్ ప్రారంభించాడు.[58]

21వ శతాబ్దపు పరిణామాలు

[మార్చు]

2000 జూన్‌లో లార్డ్స్‌లో వందో టెస్ట్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది; 1888 తరువాత లార్డ్స్‌లో [59] ఒకే రోజులో అత్యధికంగా 21 వికెట్ల పతనం, ఆ మ్యాచ్ రెండో రోజున జరగడంతో ఈ మ్యాచ్‌కు ఆ విధంగా కూడా గుర్తింపు లభించింది. 2000లో చివరిసారిగా ఇక్కడ మూడు రోజుల యూనివర్శిటీ మ్యాచ్‌ జరిగింది. ఆ తర్వాత ఈ మ్యాచ్, కేంబ్రిడ్జ్‌లోని ఫెన్నర్స్, ఆక్స్‌ఫర్డ్‌లోని యూనివర్శిటీ పార్క్స్ లలో జరగడం మొదలైంది.[60] 2001 నుండి ఈ మ్యాచ్ లార్డ్స్‌లో వన్డే పరిమిత ఓవర్ల మ్యాచ్‌గా కొనసాగుతోంది.[61] 21వ శతాబ్దం ప్రారంభంలో డ్రాప్-ఇన్ పిచ్‌ల ఆగమనంతో, పెవిలియన్, నర్సరీ ఎండ్‌ల నుండి సీమ్ బౌలర్లు, స్వింగ్ బౌలర్లు ఇద్దరికీ ప్రయోజనాన్ని అందించేలా రూపొందించిన లార్డ్స్ వాలు సమతలంగా అయ్యే ముప్పు ఏర్పడింది.[62] అయితే ఎమ్‌సిసి, పిచ్‌ను సమతలం చేయాలంటే లార్డ్స్‌ను పునర్నిర్మించవలసి ఉంటుంది, అందుకు ఐదేళ్లపాటు అక్కడ టెస్ట్ క్రికెట్ ఆడడం సాధ్యం కాదు కాబట్టి ఈ ప్రతిపాదనలను ప్రతిఘటించింది. బంకమట్టి నేల కారణంగా అవుట్‌ఫీల్డ్ నీటితో నిండి, ఫలితంగా మ్యాచ్ సమయం గణనీయంగా కోల్పోయి, మైదానం అపఖ్యాతి పాలైంది. 2002 శీతాకాలంలో బంకమట్టిని తీసివేసి, దాని స్థానంలో ఇసుక నింపారు. అవుట్‌ఫీల్డ్ మెరుగుపడింది.[63][64]లో జరిగిన ట్వంటీ20 కప్ రెండో ఎడిషన్‌లో లార్డ్స్‌లో మొదటి ట్వంటీ20 మ్యాచ్‌ జరిగింది. 1909లో స్థాపించబడినప్పటి నుండి లార్డ్స్‌లో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (గతంలో ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్) ప్రధాన కార్యాలయాన్ని 2005లో [65] మూసివేసి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ స్పోర్ట్స్ సిటీకి తరలించారు.[66]

2009లో మిడిల్‌సెక్స్, కెంట్‌ల మధ్య లార్డ్స్‌లో ఫ్లడ్‌లైట్ల మధ్య జరిగిన ట్వంటీ20 మ్యాచ్.

2007లో గ్రౌండ్‌లో తాత్కాలిక ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేసారు. అయితే స్థానికుల నుండి కాంతి కాలుష్యం గురించి ఫిర్యాదులు రావడంతో 2008లో వాటిని తొలగించారు. 2009 జనవరిలో, సమీపంలోని ఇళ్లలోకి కాంతి చిందటాన్ని తగ్గించేందుకు రూపొందించిన కొత్త 48 మీటర్ల ఎత్తున, ముడుచుకునే ఫ్లడ్‌లైట్ల వినియోగాన్ని వెస్ట్‌మిన్‌స్టర్ సిటీ కౌన్సిల్ ఆమోదించింది. ఆమోదం షరతుల్లో ఐదు సంవత్సరాల ట్రయల్ వ్యవధి ఉంది. ఈ సమయంలో ఏప్రిల్ నుండి సెప్టెంబరు వరకు లైట్ల కింద 12 మ్యాచ్‌లు, 4 ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడవచ్చు. రాత్రి 9.50 తరువాత లైట్ల కాంతిని సగం వరకు తగ్గించాలి, 11 కల్లా స్విచ్ ఆఫ్ చేయాలి. 2009 మే 27న మిడిల్‌సెక్స్, కెంట్‌ల మధ్య జరిగిన ట్వంటీ20 కప్ మ్యాచ్‌లో ఫ్లడ్‌లైట్‌లను మొదటిసారిగా విజయవంతంగా ఉపయోగించారు.[67] మొదటి ఫ్లడ్‌లైట్‌లను ఉపయోగించిన రెండు వారాల తర్వాత, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన వరల్డ్ ట్వంటీ 20 లార్డ్స్‌లో జరిగిన మొదటి ట్వంటీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచి. దీనిలో అసోసియేట్ దేశానికి ఆఖరి బంతికి దిగ్భ్రాంతికరమైన విజయం లభించింది.[68] లార్డ్స్ వేదికగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.[69]

2014లో లార్డ్స్, దాని ప్రస్తుత మైదానపు రెండు వందల వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భానికి గుర్తుగా, సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఎమ్‌సిసి XI, 50 ఓవర్ల మ్యాచ్‌లో షేన్ వార్న్ నేతృత్వంలోని రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ XIతో ఆడింది.[70]

2019 జూలైలో ఈ మైదానంలో రెండు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో మొదటిది ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన 2019 ప్రపంచ కప్ ఫైనల్. ఇరు జట్లూ తమ 50 ఓవర్లలో 241 పరుగులు చేయడంతో ఇది టైగా ముగిసింది. విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడగా అది కూడా టైగా ముగిసింది. దాంతో, గేం లోను, సూపర్ ఓవర్‌లోనూ సాధించిన బౌండరీల సంఖ్యపై విజేతను నిర్ణయించారు. ఇంగ్లండ్‌కు ఇదే తొలి ప్రపంచకప్‌ విజయం.[71] నాలుగు రోజుల తర్వాత ఐర్లాండ్ తమ మొదటి టెస్ట్ మ్యాచ్ లార్డ్స్‌లో ఆడినప్పుడు పైన పేర్కొన్న రెండవ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో టిమ్ ముర్తాగ్ 13 పరుగులకు 5 వికెట్లు తీయడంతో మ్యాచ్ మొదటి రోజు ఉదయం ఐర్లండు ఇంగ్లండ్‌ను 85 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, వారి రెండవ ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 38 పరుగులకే ఆలౌట్ అయి, 143 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఇది లార్డ్స్‌లో అత్యల్ప టెస్ట్ స్కోరు.[72]

2022 ఆగస్టులో రేచెల్ హేహో ఫ్లింట్ గౌరవార్థం మైదానం లోని తూర్పు గేట్ పేరు హేహో ఫ్లింట్ గేట్‌గా మార్చారు.[73]

మైదానం లోని విశేషాలు, సౌకర్యాలు

[మార్చు]

స్టాండ్‌లు

[మార్చు]

2023 నాటికి, లార్డ్స్‌లోని స్టాండ్‌లు (పెవిలియన్ నుండి సవ్యదిశలో):[74]

పెవిలియన్

[మార్చు]
విక్టోరియన్ కాలం నాటి పెవిలియన్ (ఎడమ) పెవిలియన్ లోపల చారిత్రిక లాంగ్ రూమ్ (కుడి).

లార్డ్స్‌లోని ప్రస్తుత పెవిలియన్ విక్టోరియన్ శకం నుండి ఈ మైదానంలో నిర్మించిన మూడవ పెవిలియన్. దీన్ని 1889-90లో నిర్మించారు. 1982 సెప్టెంబరులో గ్రేడ్ II* జాబితాలో చేర్చారు. ఇది పొడవైన, రెండు అంతస్తుల భవనం. ఇరువైపులా రెండు టవర్ల మధ్య ఈ భవనం ఉంది.[75] రెండవ అంతస్తు వెనుక భాగం పొడవునా పెవిలియన్ పైకప్పుపైనున్న టెర్రేస్ నుడ్ంఇ మొత్తం మైదానమంతా కనిపిస్తుంది.[76] 2004-05లో £8 లక్షలతో దీన్ని నవీకరించారు. పెవిలియన్ ప్రధానంగా ఎమ్‌సిసి సభ్యుల కోసం, క్రికెట్ వీక్షించడానికి సీట్లు, లాంగ్ రూమ్, బార్, బౌలర్స్ బార్, సభ్యుల దుకాణం వంటి సౌకర్యాలు ఉన్నాయి. మిడిల్‌సెక్స్ మ్యాచ్‌లలో మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ సభ్యులకు పెవిలియన్ ఇస్తారు. పెవిలియన్‌లో ఆటగాళ్ళ డ్రెస్సింగ్ రూమ్‌లు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఆటగాళ్ళు మైదానంలో ఆట చూసేందుకు చిన్న బాల్కనీలు ఉన్నాయి.

మీడియా సెంటర్

[మార్చు]
అధునాతన మీడియా కేంద్రం

1995లో జరిగిన ఎమ్‌సిసి కమిటీ సమావేశంలో మీడియా సెంటర్‌ను నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు.[77] 90 మంది జర్నలిస్టులు, వ్యాఖ్యాతలూ పట్టగలిగే వార్నర్ స్టాండ్‌లో ఉన్న మీడియా సౌకర్యాలు సరిపోక,[78] దాని స్థానంలో కొత్త కేంద్రాన్ని నిర్మించాలని ఈ ప్రణాళిక ఉద్దేశం. 1996 డిసెంబరులో జరిగిన ప్రత్యేక సాధారణ సమావేశంలో ఎమ్‌సిసి సభ్యులు దీనిని ఆమోదించారు.[77] కాంప్టన్, ఎడ్రిచ్ స్టాండ్‌ల మధ్య ఉన్న ఖాళీని ఎంపిక చేసారు. ఈ స్థలం పరిమితంగా ఉండడం వలన మీడియా కేంద్రం 15 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి వచ్చింది. ఈ డిజైను వలన ప్రధాన మైదానం, నర్సరీ మైదానాల మధ్య అంతరాయం లేకుండా మీడియా కేంద్రం లోకి వెళ్ళడానికి వీలైంది. అదే సమయంలో గ్రౌండ్ స్టాఫ్, వారి పరికరాల కదలికలకు ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది.[77]

దీన్ని చెక్ ఆర్కిటెక్ట్ జాన్ కప్లికీ నేతృత్వంలోని ఫ్యూచర్ సిస్టమ్స్ ఆర్కిటెక్చరల్ ప్రాక్టీస్ రూపొందించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-అల్యూమినియం, సెమీ- మోనోకోక్ భవనం ఇది. దీని ధర సుమారు £50 లక్షలు. నిర్మాణం 1997 జనవరిలో ప్రారంభమై, 1999 ప్రపంచ కప్ సమయానికి పూర్తయింది. కేంద్రం యొక్క దిగువ అంతస్తులో 118 మంది జర్నలిస్టులు కూచోవచ్చు. ఇరువైపులా రెండు హాస్పిటాలిటీ బాక్స్‌లు ఉన్నాయి, వీటిలో ఒక్కొక్క దానిలో 18 మంది ఉండవచ్చు. పై అంతస్తులో రేడియో, టెలివిజన్ వ్యాఖ్యాతల పెట్టెలు ఉన్నాయి. ఇందులో రెండు టెలివిజన్ స్టూడియోలు, రెండు పెద్ద వ్యాఖ్యాన, రేడియో వ్యాఖ్యాన పెట్టెలు ఉన్నాయి. ఒక్కొక్కదానిలో ఆరుగురు వ్యక్తులు ఉండవచ్చు.[78] ఈ భవనానికి 1999లో ఆర్కిటెక్చర్ కోసం RIBA స్టిర్లింగ్ ప్రైజ్‌తో సహా ఎనిమిది ఆర్కిటెక్చరల్ అవార్డులు వచ్చాయి. మీడియా సెంటర్‌ను మొదట్లో నాట్‌వెస్ట్ స్పాన్సర్ చేసింది. 2007లో స్పాన్సర్‌షిప్‌ను ఇన్వెస్టెక్ చేపట్టింది.2011 మే 31 నుండి, JP మోర్గాన్ మీడియా సెంటర్‌ను స్పాన్సర్ చేస్తోంది.[79]

నర్సరీ గ్రౌండ్

[మార్చు]
నర్సరీ గ్రౌండ్ (చిత్రం).

1838, 1887లో ఎమ్‌సిసి ద్వారా రెండు విడతలుగా కొనుగోలు చేసిన ఈ మైదానం, ప్రధానంగా ప్రాక్టీసు మైదానంగా ఉపయోగిస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ పచ్చిక నెట్లు ఇక్కడ ఉన్నాయి.[80] 1895లో మిడిల్‌సెక్స్ వాలంటీర్లు నర్సరీ గ్రౌండ్‌ను డ్రిల్ గ్రౌండ్‌గా ఉపయోగించుకుంటామని అభ్యర్థించగా, ఎమ్‌సిసి తిరస్కరించింది.[81] 1999లో నిర్మించిన నర్సరీ పెవిలియన్ నుండి నర్సరీ గ్రౌండ్‌లోని ప్లే ఏరియా కనిపిస్తూ ఉంటుంది. ఇది లండన్‌లోని అతిపెద్ద వేదికలలో ఒకటి.[82] 1903లో ఎమ్‌సిసి యార్క్‌షైర్‌తో ఆడినప్పుడు ఈ మైదానంలో ఒక ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ నిర్వహించారు;[83] ఆ మ్యాచ్ వాస్తవానికి ప్రధాన లార్డ్స్ మైదానంలో జరగాల్సి ఉంది, కానీ భారీ వర్షం కురియడంతో, మూడు రోజుల మ్యాచ్‌లో మొదటి రెండు రోజులు ఆటగాళ్లు పెవిలియన్‌లో కూర్చున్నారు. అయితే, నర్సరీ గ్రౌండ్‌లోని మైదానం మూడవ రోజు ఆట ఆడేందుకు అనువుగా ఉందని భావించి అక్కడ ఆడారు.[84] ఇరు జట్లూ ఒక్కో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ చేసారు. యార్క్‌షైర్‌కు చెందిన విల్‌ఫ్రెడ్ రోడ్స్ అజేయంగా 98 పరుగులు చేశాడు.[85]

2001 నుండి నర్సరీ గ్రౌండ్‌లో మహిళల యూనివర్శిటీ మ్యాచ్‌లు ఆడుతున్నారు.[86] అయితే లింగ సమానత్వం సాధించే క్రమంలో, 2022 నుండి పురుషుల మ్యాచ్‌లతో పాటు మహిళల 20-ఓవర్ల మ్యాచ్ కూడా ప్రధాన లార్డ్స్ మైదానంలో ఆడుతున్నారు.[87] పెద్ద మ్యాచ్‌ల రోజుల్లో ప్రేక్షకులను అవుట్‌ఫీల్డ్‌లోకి అనుమతిస్తారు. క్రికెట్ సీజన్ ముగిసే సమయంలో జరిగే క్రాస్ యారోస్ క్రికెట్ క్లబ్ వారి హోమ్ మ్యాచ్‌లు నర్సరీ గ్రౌండ్‌లో ఆడతారు.[80] 2019 ఆగస్టులో నిర్మాణం మొదలైన కొత్త కాంప్టన్, ఎడ్రిచ్ స్టాండ్‌లు నర్సరీ గ్రౌండ్ ప్లేయింగ్ ఏరియాను ఆక్రమించాయి. స్టాండ్‌ల కోసం కోల్పోయిన ఆట స్థలాన్ని తిరిగి పొందేందుకు, 2025–26లో తాత్కాలిక నర్సరీ పెవిలియన్ను కూల్చివేసి, ఆట స్థలాన్ని వెల్లింగ్‌టన్ రోడ్డు వెంబడి ప్రహరీ గోడ వరకు విస్తరిస్తారు.[88]

MCC మ్యూజియం, లైబ్రరీ

[మార్చు]
లార్డ్స్ మ్యూజియంలో యాషెస్ కలశం

లార్డ్స్ లో MCC మ్యూజియం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన క్రీడా మ్యూజియం. యాషెస్ అర్న్‌తో (చితాభస్మ పేటిక) సహా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెట్ జ్ఞాపకాల సేకరణను కలిగి ఉంది.[89] MCC 1864 నుండి స్మృతి చిహ్నాలను సేకరిస్తోంది. ఈ సేకరణను సర్ స్పెన్సర్ పోన్సన్‌బై-ఫేన్ రూపొందించాడు. ఆ తర్వాత అతను క్లబ్‌కు కోశాధికారి అయ్యాడు.[90] ఈ వస్తువులు తొలుత పెవిలియన్‌లో ప్రదర్శించేవారు. వస్తువులను చూడడం MCC సభ్యులకు మాత్రమే పరిమితం చేసారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సేకరణ పెరిగి పెవిలియన్‌ పట్టలేదు. దాంతో వస్తువులను తరలించి ప్రజలందరూ చూసేలా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యూజియాన్ని 1953లో డ్యూక్ ఆఫ్ ఎడింబరో ఇంపీరియల్ మెమోరియల్ కలెక్షన్‌గా ప్రజలకు అధికారికంగా తెరిచాడు. సంవత్సరానికి 50,000 మంది ఈ మ్యూజియాన్ని సందర్శిస్తారు.[91]

అంతర్జాతీయ రికార్డులు

[మార్చు]
  • అత్యధిక జట్టు స్కోరు: 729/6 డిక్లేర్డ్ ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, 1930 [92]
  • అత్యల్ప జట్టు స్కోరు: ఐర్లాండ్ v ఇంగ్లాండ్, 2019లో 38 ఆలౌట్ [93]
  • అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్: 1990లో ఇంగ్లండ్ v భారత్ తరఫున గ్రాహం గూచ్ 333 [94]
  • ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్: ఇయాన్ బోథమ్ ద్వారా 8/34 ఇంగ్లాండ్ v పాకిస్తాన్, 1978 [95]
  • ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్: బాబ్ మాస్సీ ద్వారా 16/137 ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, 1972 [96]

వన్ డే ఇంటర్నేషనల్

[మార్చు]
  • అత్యధిక జట్టు స్కోరు: 334/4 (60 ఓవర్లు) ఇంగ్లాండ్ v భారత్, 1975 [97]
  • అత్యల్ప జట్టు స్కోరు: 107 ఆలౌట్ (32.1 ఓవర్లు) దక్షిణాఫ్రికా v ఇంగ్లాండ్, 2003 [98]
  • అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్: వెస్టిండీస్ v ఇంగ్లాండ్, 1979 వివ్ రిచర్డ్స్ 138 * [99]
  • ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్: పాకిస్థాన్ v బంగ్లాదేశ్, 2019 షాహీన్ షా ఆఫ్రిది 6/35 [100]

ట్వంటీ20 ఇంటర్నేషనల్

[మార్చు]
  • అత్యధిక జట్టు స్కోరు: 199/4 (20 ఓవర్లు) వెస్టిండీస్ v ICC వరల్డ్ XI, 2018 [101]
  • అత్యల్ప జట్టు స్కోరు: 93 ఆలౌట్ (17.3 ఓవర్లు) నెదర్లాండ్స్ v పాకిస్థాన్, 2009 [102]
  • అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్: శ్రీలంక v ఐర్లాండ్ తరపున మహేల జయవర్ధనే 78, 2009 [103]
  • ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్: 2009లో పాకిస్థాన్ v నెదర్లాండ్స్ తరపున షాహిద్ అఫ్రిది 4/11 [104]

దేశీయ రికార్డులు

[మార్చు]

ఫస్ట్ క్లాస్

[మార్చు]
  • అత్యధిక జట్టు స్కోరు: 645/6 డిక్లేర్డ్ డర్హామ్ v మిడిల్‌సెక్స్, 2002 [105]
  • అత్యల్ప జట్టు స్కోరు: 15 ఎమ్‌సిసి v సర్రే, 1839 [106]
  • అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్: జాక్ హాబ్స్ 316* సర్రే v మిడిల్‌సెక్స్, 1926 [107]
  • కచ్చితమైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేయలేదు గానీ, ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లు ముగ్గురు. అయితే వాళ్ళు ఇచ్చిన పరుగులు 20 లోపే అని మాత్రం తెలుసు. వారు విలియం లిల్లీవైట్, ఎడ్మండ్ హింక్లీ, జాన్ విస్డెన్. స్కోర్లు పూర్తిగా రికార్డైన ఇన్నింగ్సులకు సంబంధించినంత వరకు, 1871లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ v కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ తరపున శామ్యూల్ బట్లర్ 38 పరుగులకు 10 వికెట్లు తీయడం అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు [108]
  • విలియం లిల్లీవైట్ ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీశాడు, 1837 జెంటిల్‌మెన్ v ప్లేయర్స్ మ్యాచ్‌లో ప్లేయర్స్ తరపున 18 వికెట్లు తీసుకున్నాడు. అయితే అతని కచ్చితమైన బౌలింగ్ గణాంకాలు నమోదు కాలేదు.[109]
  • అత్యధిక జట్టు స్కోరు: 223/7 (20 ఓవర్లు) సర్రే v మిడిల్‌సెక్స్, 2021 [110]
  • అత్యల్ప జట్టు స్కోరు: 90 (14.4 ఓవర్లు) కెంట్ v మిడిల్‌సెక్స్, 2015 [111]
  • అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్: మిడిల్‌సెక్స్ v ఎసెక్స్, 2021 కొరకు స్టీఫెన్ ఎస్కినాజీ చేసిన 102 నాటౌట్ [112]
  • ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్: సర్రే v మిడిల్‌సెక్స్, 2005 కొరకు టిమ్ ముర్తాగ్ - 6/24 [113]

ట్వంటీ20

[మార్చు]
  • అత్యధిక జట్టు స్కోరు: 223/7 (20 ఓవర్లు) సర్రే v మిడిల్‌సెక్స్, 2021 [110]
  • అత్యల్ప జట్టు స్కోరు: 90 (14.4 ఓవర్లు) కెంట్ v మిడిల్‌సెక్స్, 2015 [111]
  • అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్: మిడిల్‌సెక్స్ v ఎసెక్స్, 2021 స్టీఫెన్ ఎస్కినాజీ 102 నాటౌట్ [112]
  • ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్: సర్రే v మిడిల్‌సెక్స్, 2005 లో టిమ్ ముర్తాగ్ 6/24 [113]

మూలాలు

[మార్చు]
  1. "Lord's cleared to have full capacity for England-Pakistan ODI". The Cricket Paper. 2 July 2021. Archived from the original on 24 మే 2024. Retrieved 16 April 2022.
  2. "Lord's". Cricinfo. Archived from the original on 11 September 2010. Retrieved 22 August 2009.
  3. see MCC museum Archived 12 ఫిబ్రవరి 2007 at the Wayback Machine webpage
  4. Warner 1946, p. 17–18.
  5. 5.0 5.1 5.2 5.3 Barker, Philip (2014). Lord's Firsts. Stroud: Amberley Publishing. ISBN 9781445633299.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 Powell, William (1989). The Wisden Guides To Cricket Grounds. London: Stanley Paul & Co. Ltd. pp. 14–7. ISBN 009173830X.
  7. 7.0 7.1 Warner 1946, p. 18.
  8. Warner 1946, p. 19.
  9. 9.0 9.1 9.2 Green 2010, p. 46
  10. Warner, Pelham (1987) [First published 1946]. Lord's 1787–1945. London: Pavllion Books. p. 28. ISBN 1851451129.
  11. "First-Class Matches played on Lord's Cricket Ground, St John's Wood". CricketArchive. Archived from the original on 24 June 2021. Retrieved 24 June 2021.
  12. Altham 1962, p. 67.
  13. Green, Benny (1987). The Lord's Companion. London: Pavilion Books. p. 7. ISBN 1851451323.
  14. 14.0 14.1 14.2 Green 2010, p. 7
  15. Green 2010, p. 35
  16. Green 2010, p. 37
  17. 17.0 17.1 Green 2010, p. 41
  18. Green 2010, p. 44
  19. 19.0 19.1 Green 2010, p. 45
  20. Green 2010, p. 51
  21. 21.0 21.1 21.2 21.3 21.4 21.5 "Lord's – A brief timeline". ESPNcricinfo. 3 May 2005. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  22. "The New Grand Stand is completed". www.lords.org. Archived from the original on 9 July 2021. Retrieved 5 July 2021.
  23. Green 2010, pp. 57–8
  24. Green 2010, p. 59
  25. Green 2010, p. 52
  26. Green 2010, p. 60
  27. "Marylebone Cricket Club v Australians, 1878". CricketArchive. Archived from the original on 27 May 2007. Retrieved 27 June 2021.
  28. Green 2010, pp. 81–4
  29. Powell 1989, pp. 14–5
  30. "England v Australia, 1884". CricketArchive. Archived from the original on 28 June 2021. Retrieved 28 June 2021.
  31. Green 2010, pp. 94–5
  32. 32.0 32.1 32.2 Powell 1989, p. 15
  33. "Thomas Verity's new Pavilion is completed". www.lords.org. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  34. Baker 2014, p. 129
  35. Green 2010, p. 132
  36. Wilson, Bill (8 August 2018). "Battle over rail tunnels at Lord's cricket ground rumbles on". BBC News. Archived from the original on 9 July 2021. Retrieved 28 June 2021.
  37. Green 2010, p. 190
  38. Warner 1987, pp. 169–170
  39. Green 2010, p. 193-4
  40. Green 2010, p. 193-206
  41. Warner 1987, p. 171
  42. Hayter, R. J. (1949). "Second Test Match England v Australia". Wisden Cricketers' Almanack. Wisden. Archived from the original on 10 August 2010. Retrieved 30 June 2021.
  43. Powell 1989, p. 16
  44. "The New Warner Stand is opened". www.lords.org. Archived from the original on 9 July 2021. Retrieved 6 July 2021.
  45. Williamson, Martin (20 April 2013). "Opening Pandora's one-day box". ESPNcricinfo. Archived from the original on 21 February 2023. Retrieved 1 July 2021.
  46. "ODI Matches played on Lord's Cricket Ground, St John's Wood". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
  47. "England v Australia, Prudential Trophy 1972 (2nd ODI)". CricketArchive. Archived from the original on 31 January 2018. Retrieved 2 July 2021.
  48. Cozier, Tony. "West Indies victory heralds a new era". ESPNcricinfo. Archived from the original on 10 January 2023. Retrieved 2 July 2021.
  49. Cozier, Tony. "England v West Indies". ESPNcricinfo. Archived from the original on 11 November 2018. Retrieved 2 July 2021.
  50. Thompson, Jenny (14 July 2005). "Storming cricket's bastion". Espncricinfo. Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
  51. Williamson, Martin (20 March 2009). "When women took over Lord's". Espncricinfo. Archived from the original on 23 July 2021. Retrieved 23 July 2021.
  52. 52.0 52.1 "First Indoor School at Lord's opened". www.lords.org. Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
  53. "India defy the odds". ESPNcricinfo. 2 June 2008. Archived from the original on 10 May 2021. Retrieved 5 July 2021.
  54. Green 2010, p. 448
  55. "MCC v Rest of the World, Lord's, August 20–25 1987". ESPNcricinfo. 7 July 2005. Archived from the original on 9 July 2021. Retrieved 6 July 2021.
  56. "Graham Gooch scores 333". www.lords.org. Archived from the original on 9 July 2021. Retrieved 7 July 2021.
  57. "From Iceland to Azerbaijan". BBC Sport. 1 February 2002. Archived from the original on 16 February 2004. Retrieved 6 July 2021.
  58. "The 20th anniversary of the Media Centre". www.lords.org. 27 April 2019. Archived from the original on 9 July 2021. Retrieved 6 July 2021.
  59. "England beat West Indies in 100th Lord's Test". www.lords.org. Archived from the original on 9 July 2021. Retrieved 6 July 2021.
  60. "Cricket: Varsity game may switch from Lord's". Oxford Mail. 7 July 2000. Archived from the original on 9 July 2021. Retrieved 4 July 2021.
  61. "Cricket: Lord's Varsity to be one-day". Oxford Mail. 24 July 2000. Archived from the original on 9 July 2021. Retrieved 7 July 2021.
  62. Briggs, Simon (19 May 2001). "Slope's future in balance". The Daily Telegraph. Archived from the original on 11 January 2022. Retrieved 1 January 2015.
  63. Saltman, David (27 November 2003). "Mallinsons win BALI Principal Award". www.pitchcare.com. Archived from the original on 9 July 2021. Retrieved 7 July 2021.
  64. "Lord's admits Twenty20 Cup". BBC Sport. 2 December 2003. Archived from the original on 9 May 2004. Retrieved 5 July 2021.
  65. "ICC ponders Lord's move". BBC Sport. 4 March 2004. Archived from the original on 3 June 2004. Retrieved 5 July 2021.
  66. "Cricket chiefs move base to Dubai". BBC Sport. 7 March 2005. Archived from the original on 18 February 2007. Retrieved 5 July 2021.
  67. "Lord's floodlights just 'isn't cricket'". Get West London. 2 June 2009. Archived from the original on 1 August 2018. Retrieved 6 July 2021.
  68. McGlashan, Andrew (5 June 2009). "de Grooth leads Netherlands to famous win". ESPNcricinfo. Archived from the original on 28 December 2021. Retrieved 6 July 2021.
  69. Smyth, Rob (21 June 2009). "Pakistan v Sri Lanka – as it happened". The Guardian. Archived from the original on 9 July 2021. Retrieved 7 July 2021.
  70. "Sachin Tendulkar and Rahul Dravid re-unite; to face off against Shane Warne again". Yahoo! Cricket. 6 February 2014. Archived from the original on 2 March 2014.
  71. Gardner, Alan. "Epic final tied, Super Over tied, England win World Cup on boundary count". ESPNcricinfo. Archived from the original on 12 July 2021. Retrieved 23 July 2021.
  72. "Chris Woakes and Stuart Broad wreck Ireland dream in a session". ESPNcricinfo. 26 July 2019. Archived from the original on 26 July 2019. Retrieved 26 July 2019.
  73. "Lord's gate dedicated to cricket captain Rachael Heyhoe Flint unveiled". BBC News. 17 August 2022. Archived from the original on 21 August 2022. Retrieved 22 August 2022.
  74. "Lord's Ground" (PDF). Archived from the original (PDF) on 27 February 2017. Retrieved 6 January 2015.
  75. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; NHLE అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  76. "Pavilion Roof Terrace". www.lords.org. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  77. 77.0 77.1 77.2 "The 20th anniversary of the Media Centre". www.lords.org. 29 April 2019. Archived from the original on 9 July 2021. Retrieved 14 July 2021.
  78. 78.0 78.1 Nicholson, Matthew (2007). Sport and the Media. Abingdon-on-Thames: Taylor & Francis. p. 115. ISBN 978-1136364976.
  79. "New Media Centre sponsor: JP Morgan". www.lords.org. 31 May 2011. Archived from the original on 12 March 2013. Retrieved 29 May 2015.
  80. 80.0 80.1 "Lord's Nursery Ground". ESPNcricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 7 July 2021.
  81. Green 2010, p. 36
  82. "Nursery Pavilion". www.lords.org. Archived from the original on 9 July 2021. Retrieved 8 July 2021.
  83. "First-Class Matches played on Lord's Nursery Ground, St John's Wood". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 6 July 2021.
  84. Barker 2014, p. 129
  85. "Marylebone Cricket Club v Yorkshire, 1903". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 7 July 2021.
  86. "Varsity cricket – a one-day wonder?". www.cam.ac.uk. 6 June 2001. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  87. Dobell, George (21 May 2021). "Women's Varsity match set for full Lord's debut after universities reach agreement". ESPNcricinfo. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  88. "The Future of Lord's". www.lords.org. Archived from the original on 20 June 2021. Retrieved 13 July 2021.
  89. "MCC Museum". www.lords.org. Archived from the original on 27 July 2021. Retrieved 12 July 2021.
  90. Barclay's World of Cricket – 2nd Edition, 1980, Collins Publishers, ISBN 0-00-216349-7, p47
  91. "HRH The Duke of Edinburgh opens the MCC Museum". www.lords.org. Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  92. "Lord's Cricket Ground, St John's Wood - Highest Team Totals in Test cricket". CricketArchive. Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
  93. "Lord's Cricket Ground, St John's Wood - Lowest Team Totals in Test cricket". CricketArchive. Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
  94. "Lord's Cricket Ground, St John's Wood - Centuries in Test cricket". CricketArchive. Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
  95. "Lord's Cricket Ground, St John's Wood - Five Wickets in an Innings in Test cricket". CricketArchive. Retrieved 25 July 2021.[permanent dead link]
  96. "Lord's Cricket Ground, St John's Wood - Most Wickets in a Match in Test cricket". CricketArchive. Retrieved 25 July 2021.[permanent dead link]
  97. "Lord's Cricket Ground, St John's Wood – Highest Team Totals in ODI cricket". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 8 July 2021.
  98. "Statistics / Statsguru / One-Day Internationals / Team records". ESPNcricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 8 July 2021.
  99. "Lord's Cricket Ground, St John's Wood – Centuries in ODI cricket". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 8 July 2021.
  100. "Lord's Cricket Ground, St John's Wood – Four Wickets in an Innings in ODI cricket". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 8 July 2021.
  101. "Lord's Cricket Ground, St John's Wood – Highest Team Totals in International Twenty20 matches". CricketArchive. Archived from the original on 4 April 2023. Retrieved 7 July 2021.
  102. "Lord's Cricket Ground, St John's Wood – Lowest Team Totals in International Twenty20 matches". CricketArchive. Archived from the original on 4 April 2023. Retrieved 7 July 2021.
  103. "Statistics / Statsguru / Twenty20 Internationals / Batting records". ESPNcricinfo. Archived from the original on 4 April 2023. Retrieved 7 July 2021.
  104. "Lord's Cricket Ground, St John's Wood – Four Wickets in an Innings in International Twenty20 matches". CricketArchive. Archived from the original on 4 April 2023. Retrieved 7 July 2021.
  105. "Lord's Cricket Ground, St John's Wood – Highest Team Totals in first-class cricket". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
  106. "Lord's Cricket Ground, St John's Wood – Lowest Team Totals in first-class cricket". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
  107. "Lord's Cricket Ground, St John's Wood – Double Centuries in first-class cricket". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
  108. "Lord's Cricket Ground, St John's Wood – Seven Wickets in an Innings in first-class cricket". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
  109. "Lord's Cricket Ground, St John's Wood – Most Wickets in a Match in first-class cricket". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
  110. 110.0 110.1 "Lord's Cricket Ground, St John's Wood – Highest Team Totals in Twenty20 matches". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
  111. 111.0 111.1 "Lord's Cricket Ground, St John's Wood – Lowest Team Totals in Twenty20 matches". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
  112. 112.0 112.1 "Lord's Cricket Ground, St John's Wood – Centuries in Twenty20 matches". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
  113. 113.0 113.1 "Lord's Cricket Ground, St John's Wood – Four Wickets in an Innings in Twenty20 matches". CricketArchive. Archived from the original on 9 July 2021. Retrieved 2 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=లార్డ్స్&oldid=4237088" నుండి వెలికితీశారు