వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్
రకం | ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ |
---|---|
స్థాపితం | 1927 |
స్థానం | సుబేదారి, హన్మకొండ, తెలంగాణ, భారతదేశం 17°59′35″N 79°32′46″E / 17.993°N 79.546°E |
కాంపస్ | పట్టణ |
అనుబంధాలు | కాకతీయ విశ్వవిద్యాలయం |
వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని సుబేదారి ప్రాంతంలో ఉన్న పురాతన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల.[1] ఈ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందించబడుతున్నాయి. దీనిని కాకతీయ విశ్వవిద్యాలయపు రెండవ ప్రాంగణం అని కూడా పిలుస్తారు.[2]
చరిత్ర
[మార్చు]కాలేజియేట్ ఉన్నత పాఠశాలగా ప్రారంభించబడిన ఈ కళాశాల, 1927వ సంవత్సరంలో అభివృద్ధి చేయబడింది. దీనిని 1954లో హన్మకొండ నుండి ప్రస్తుతమున్న స్థానానికి మార్చారు. 1959లో ఉస్మానియా విశ్వవిద్యాలయం కళాశాలగా అప్‌గ్రేడ్ చేయబడింది. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఫ్యాకల్టీలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. కాకతీయ విశ్వవిద్యాలయం స్థాపించబడిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1976, ఆగస్టు 19న కాకతీయ విశ్వవిద్యాలయానికి బదిలీ చేయబడింది. 1995లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా చేర్చబడ్డాయి.
ప్రాంగణం
[మార్చు]వరంగల్ లోని 163వ జాతీయ రహదారిలో ఈ కళాశాల ఉంది. ఇందులో ఆంగ్ల భాషా ప్రయోగశాల, లైబ్రరీ రీడింగ్ హాల్‌లు, ఇంటర్నెట్ సదుపాయం, ఎయిర్ కండిషన్డ్ సెమినార్ హాల్, కంప్యూటర్ ల్యాబ్‌లు, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ లాబొరేటరీలతోపాటు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి ల్యాబ్‌లు కూడా ఉన్నాయి. 70 సంవత్సరాల పూర్వం నిర్మించిన ఆడిటోరియం, యాంఫిథియేటర్, హెల్త్ సెంటర్, మల్టీ-జిమ్, ఆట స్థలం మొదలైన సదుపాయాలు ఇందులో ఉన్నాయి. కళాశాల ప్రాంగణం మొత్తంలో హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంది.
విద్యావేత్తలు
[మార్చు]ఈ కళాశాలలో బయోటెక్నాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, హిందీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, మైక్రోబయాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సోషల్ వర్క్, స్టాటిస్టిక్స్‌తోపాటు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వంటి 29 కోర్సులు, కోర్సు కాంబినేషన్లను ఉన్నాయి.
పూర్వ విద్యార్థులు
[మార్చు]ఈ కళాశాలతో చదువుకున్న వారిలో కొందరు ప్రతిష్ఠాత్మకమైన పదవుల్లో ఉన్నారు. భారత మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు, వైస్-ఛాన్సలర్లు, ఐఎఎస్/ఐపిఎస్ అధికారులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, వైద్యులు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు మొదలైనవారు ఉన్నారు.
పూర్వ విద్యార్థులు
[మార్చు]- పి.వి. నరసింహారావు, రాజకీయవేత్త, భారత మాజీ ప్రధాని.
- కాళోజీ నారాయణరావు, కవి, కార్యకర్త.
- కొత్తపల్లి జయశంకర్, విద్యావేత్త, కార్యకర్త, ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ-వైస్-ఛాన్సలర్, ఇఫ్లూ మాజీ రిజిస్ట్రార్
- దాశరథి కృష్ణమాచార్యులు, కవి, రచయిత.
- పాములపర్తి సదాశివరావు, తత్వవేత్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్.
- నూకల రామచంద్రారెడ్డి, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు.
- పసుల సాంబయ్య, తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్.[3]
- పేర్వారం జగన్నాథం, కవి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్.
- పేర్వారం రాములు, ఐపిఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి, రాజకీయవేత్త.
- నేరెళ్ళ వేణుమాధవ్, మిమిక్రీ ఆర్టిస్ట్.
- ప్రొ. తంగెడ నవనీతరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్.
- నంద్ కిశోర్, భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్.[4][5]
- ప్రొ. వి. గోపాల్ రెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్.[6]
- మిమిక్రీ శ్రీనివాస్, ఇంటర్నేషనల్ ఇంప్రెషనిస్ట్, వెంట్రిలాక్విస్ట్,
- డాక్టర్ పెరుగు శ్యామ్, శాస్త్రవేత్త, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ ప్రొఫెసర్.[7]
- డాక్టర్ రత్నప్రభ, శాస్త్రవేత్త, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రొఫెసర్, వరంగల్.[8]
- డా. అలు నాయక్ బోడ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్.[9]
- సురేష్ కె గొల్లె, ఫ్యాకల్టీ - మీడియా స్టడీస్, బిర్లా గ్లోబల్ యూనివర్సిటీ, భువనేశ్వర్, ఒడిషా[10]
- కె. రూబెన్ మార్క్, ప్రస్తుత కరీంనగర్ బిషప్ (2015 నుండి)
- ఇమామ్ బాబా షేక్, రెవెన్యూ అధికారి (తెలంగాణ ప్రభుత్వం)
- ధీకొండ సారంగపాణి, జానపద గాయకుడు, నేపథ్య గాయకుడు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
- జీవన్, సినిమా ఆర్టిస్ట్ - ఈటీవీ జబర్దస్త్ కమెడియన్.
మూలాలు
[మార్చు]- ↑ "PVNR centre a boost to Telangana studies: KU V-C". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-28. Retrieved 2021-08-25.
- ↑ "Kakatiya University, Warangal-506009, Telangana, India". kakatiya.ac.in. Retrieved 2021-08-25.
- ↑ "Former Telangana University V-C dies of cardiac arrest". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-12. Retrieved 2021-08-25.
- ↑ "Nand Kishore profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
- ↑ "Full Scorecard of Delhi vs Rajasthan Group A 2015/16 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
- ↑ "Kakatiya University, Warangal-506009, Telangana, India". kakatiya.ac.in. Retrieved 2021-08-25.
- ↑ "National Institute of Technology | Warangal". www.nitw.ac.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
- ↑ "National Institute of Technology | Warangal". www.nitw.ac.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
- ↑ "National Institute of Technology | Warangal". www.nitw.ac.in. Retrieved 2021-08-25.
- ↑ "Prof. Suresh K Golle". BGU Bhubaneswar |MBA |BBA |BCom |BBALLB |BAJMC |BA Eco|BSc Data Science (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-25.