Jump to content

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)

వికీపీడియా నుండి
అడ్డదారి:
WP:VPP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

కొత్త విధానం/మార్గదర్శకత్వం కోసం గానీ, పాత విధానం/మార్గదర్శకత్వంలో మార్పుచేర్పుల కోసం గానీ చర్చ కోసం ప్రతిపాదనను ప్రవేశపెట్టేందుకు ఈ పేజీ ఒక ద్వారం లాంటిది. అయితే ప్రతిపాదనను నేరుగా ఈ పేజీలో రాయకూడదు. విధానాన్ని ప్రతిపాదించేందుకు, ఈ పేజీకి ఒక ఉపపేజీని సృష్టించి అక్కడ ప్రతిపాదించాలి. చర్చ జరిగిన తరువాత నిర్ణయం వెలువడ్డాక, ఆ నిర్ణయాన్ననుసరించి విధానం పేజీని తయారుచేసుకోవచ్చు, లేదా ఉన్న విధానాన్ని సవరించుకోవచ్చు. విధానాలు మార్గదర్శకాల కోసమే కాక, తెవికీలో పద్ధతులు, అంశాలు, విశేషాలలో మార్పుచేర్పుల కోసం కూడా ఈ ప్రతిపాదల పేజీని సృష్టించవచ్చు.

  • కొత్త విధాన ప్రతిపాదనను/పాత విధానంలో మార్పు ప్రతిపాదనను నేరుగా ఈ పేజీలో రాయకూడదు. ఇక్కడ నేరుగా రాసే ప్రతిపాదనలను వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) పేజీ లోకి తరలిస్తారు.
  • కొత్త విధానాన్ని/మార్గదర్శకాన్ని "వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/కొత్త విధానం" అనే పద్ధతిలో కొత్త పేజీని సృష్టించి ప్రతిపాదించాలి.
  • నేరుగా కొత్త విధానాన్ని ప్రతిపాదించకుండా దాని గురించి ముందు వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) పేజీలో చర్చకు పెట్టి, వాడుకరుల నాడిని గ్రహించాక, ఇక్కడ ప్రతిపాదించవచ్చు. దీనివలన విధానాన్ని మరింత మెరుగైన రీతిలో ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఈ రెండు పద్ధతుల్లో దేనినైనా అనుసరించవచ్చు.
  • కొత్త ప్రతిపాదన పేజీని వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు - చర్చలో ఉన్న ప్రతిపాదనలు‎ అనే వర్గంలో చేర్చాలి.
  • ఆ పేజీ లింకును ఇక్కడ, "ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదనలు" అనే విభాగంలో చేర్చాలి.
  • ప్రధాన రచ్చబండలో కూడా ఆ కొత్త పేజీ లింకును ఇవ్వవచ్చు

కొత్త విధానాన్ని ప్రతిపాదించే ముందు

[మార్చు]
  • విధానం పట్ల మీ ఆలోచనపై స్పష్టత తెచ్చుకోండి. అది అవసరమేనని, దానికి ప్రత్యామ్నాయాలేమీ లేవనీ తోస్తే ముందుకు నడవండి
  • ఈపాటికే దానికి సంబంధించిన ఇతర విధానాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించండి. వాటిని అధ్యయనం చెయ్యండి.
  • అవసరమని భావిస్తే మీ విధాన ప్రతిపాదనను వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) పేజీలో రాసి వాడుకరుల అభిప్రాయాలను పరిశీలించండి. అయితే, ఇది ఆవశ్యకమేమీ కాదు. అక్కడ వాడుకరుల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ మీరు విధానాన్ని ప్రతిపాదించవచ్చు.

విధాన ప్రతిపాదన పేజీ మార్గదర్శకాలు

[మార్చు]
  • పేజీలో పైన {{Proposal}} అనే మూసను ఉంచండి.
  • ప్రవేశిక: ఇందులో ప్రతిపాదిస్తున్న విధానాన్ని సూటిగా క్లుప్తంగా వివరించండి
  • నేపథ్యం (విభాగం): విధానం ఎందుకు అవసరమైంది? అది ఉంటే ఎటువంటి మెరుగుదల వస్తుంది? అనేది వివరించాలి.
  • ప్రతిపాదన వివరాలు (విభాగం): సంపూర్ణంగా, అవసరమైన చోట్ల ఒక్కో పాయింటు రూపంలో వీలైనంత వివరంగా సందిగ్ధత లేకుండా రాయాలి. ఒకవేళ ప్రతిపాదనలో ఎంచుకోవాల్సిన వికల్పాలుంటే ఆ వికల్పాలకు 1,2,3 అనో క,గ,చ అనో పేర్లు ఇవ్వండి. తద్వారా చర్చలో వాటిని ఉదహరించడం వీలుగా ఉంటుంది. బులెట్ లిస్టుగానో, నంబర్ల లిస్టుగానీ ఇవ్వరాదు.

ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదనలు

[మార్చు]

ఫలవంతమైన ప్రతిపాదనలు

[మార్చు]

ఫలించని లేక విరమించిన ప్రతిపాదనలు

[మార్చు]

చర్చ జరగని ప్రతిపాదనలు

[మార్చు]

సముదాయంలో కొద్దిమంది మైనారిటీ తప్పించి ఇతరులు చర్చించనందునో, ఆమోదం కాని విఫలం కానీ చేయడానికి తగినంత స్పందనలు లభించనందునో నిర్ణయించడానికి వీలులేక పక్కనపెట్టిన ప్రతిపాదనలు:

వ్యాసం పేరు మారుతుంది. విలీనం లేదా ప్రత్యేక వ్యాసం.

[మార్చు]

గమనిక: తెలుగు వికీ నియమాలు నాకు పూర్తిగా తెలియవు. నేను రచ్చబండ (పాలసీలు) యొక్క అన్నింటిని తనిఖీ చేశాను.

  • ఎందుకు: ఒకే రాజకీయ పార్టీ గురించి 2 వేర్వేరు వ్యాసాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి. పాఠకులకు గందరగోళం సృష్టించవచ్చు. సమాచారం ఒకే చోట ఉండదు.
  • ఎవరు: ఈ పాలసీ వ్యక్తులు, కంపెనీలు, సాఫ్ట్వేర్ లేదా పేరు మార్చే దేనికైనా వర్తించాలి.

రుద్రుడు (చర్చ) 09:40, 29 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]