శ్రీధర్ (చిత్రకారుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీధర్, చిత్రకారుడు

శ్రీధర్ ప్రఖ్యాత తెలుగు కార్టూనిస్టు. ఈనాడు దినపత్రిక బహుళ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో సహాయపడ్డాయి. ఆయన కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి. ఆయన కార్టూన్ లలో ఎంత వ్యంగ్యం ఉంటుందో అంతే విషయం కూడా ఉంటుంది. [1] ఈనాటి సామాజిక స్థితిగతులని బొమ్మలతో తెలివిగా చెప్పే ప్రయత్నం చేసాడు. కార్టూనిస్ట్ శ్రీధర్ తన కార్టూన్ల ద్వారా తెలుగువారి హృదయాలలో నిలిచిపోయాడు. అతను దాదాపు 40 సంవత్సరాలుగా ఈ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. పాఠకులు ఈనాడు పేపర్ లో వచ్చే వార్తల కోసం కోసం ఎంత అతృతగా ఎదురుచుస్తుంటారో ప్రతిరోజు చోటుచేసుకునే పరిస్థితులపై “ఇదీ సంగతీ” లో వచ్చే శ్రీధర్ కార్టూన్ల కోసం అంతే ఆతృతగా ఎదురుచుస్తుంటారు. నిజానికి ఎంతోమంది నాయకులపై విమర్శనాత్మకంగా ఎన్ని కార్టూన్స్ వేసినా దాదాపు ప్రతి నాయకుడు కూడా పాజిటీవ్ గానే తీసుకునేవారట. తన 18వ సంవత్సరంలోనే కార్టూనిస్ట్ గా మొదలైన జీవితంలో కేవలం ఈనాడు వరకే పరిమితం అవ్వలేదు దేశ, అంతర్జాతీయ వేదికలపై కూడా తనదైన శైలిలో గళమెత్తాడు. [2]

అతని బొమ్మలో వ్యంగ్యం వుంటుంది, రక్తి కట్టించే క్యాప్షన్ వుంటుంది వెరసి అతని కార్టూన్ల వెనక ఎంతో విషయ పరిజ్ఞానం కనపడుతుంది. ఇలా శ్రీధర్ ఈనాడులో 1982 నుండి 1999 వరకూ వేసిన రాజకీయ కార్టూన్లు ఒక సంకలనంగా తెచ్చారు ఉషోదయా పబ్లికేషన్స్. ఇందులో అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విషయాలపై శ్రీధర్ వేసిన వ్యంగ్యాస్త్రాలు వున్నాయి. అయితే ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలపైన గీసిన కార్టూన్లే కనిపిస్తాయి. శ్రీధర్ కార్టూన్ల లో బొమ్మలు నవ్విస్తాయని అందరికీ తెలుసు. అయితే బొమ్మ చూడగానే ఇది ఫలానా వ్యక్తిదని వెంటనే తెలిసిపోయేంతలా బొమ్మలు గీయడం అతని ప్రతిభ. ఆ పుస్తకం ముందుమాటలో రామోజీరావు “కాలంతో పోటిపడి ఈ లైనూ బెసగకుండా పర్ఫెక్ట్ రాజకియ వ్యంగ్య చిత్రాన్ని రక్తికట్టే క్యాప్షన్తో అత్యంత వేగంగా అందించగలిగే నేర్పు మాత్రం శ్రీధర్‌దేనని చెప్పగలను” అని రాసాడు. [3]

ఈనాడులో శ్రీధర్ తొలి కార్టూన్ 22 ఆగస్టు 1981 నాడు ముద్రించగా, 30 ఆగస్టు 2021 న ఈనాడునుంచి వైదొలిగాడు.[4]చివరి కార్టూన్ 13 ఆగస్టు 2021 నాడు ముద్రితమైంది. [5]

అతని సోదరుడు అచ్యుత‌రావు తెలంగాణ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యునిగా పనిచేసాడు.[6]

మూలాలు

  1. Uday, Samosa. "ఈనాటి సామాజిక స్థితిగతులని బొమ్మలతో తెలివిగా చెప్పే ఈనాడు శ్రీధర్ గారి 'ఇది సంగతి!'". Chai Bisket (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-15. Retrieved 2020-07-15.
  2. Kashetti, Srikanth. "These Sarcastic Cartoons Will Prove Why Sridhar Is The Legendary Cartoonist We Will Ever See!". Chai Bisket (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-15. Retrieved 2020-07-15.
  3. ""ఈనాడు కార్టూన్లు" – మన శ్రీధర్ కార్టూన్లు". పుస్తకం (in అమెరికన్ ఇంగ్లీష్). 2009-11-10. Retrieved 2020-07-15.
  4. "'ఈనాడు'కు కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా". ఆంధ్రప్రభ. 2021-08-31.
  5. "ఇదీసంగతి". ఈనాడు. 2021-08-13. Archived from the original on 2021-09-06.
  6. "బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కన్నుమూత". newssting. Retrieved 2020-07-24.

బయటి లింకులు