సత్యరాజ్
సత్యరాజ్ | |
---|---|
జననం | రంగరాజ్ సుబ్బయ్య 1954 అక్టోబరు 3[1] |
ఇతర పేర్లు | రంగరాజ్ |
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1978–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మహేశ్వరి (m.1979–ప్రస్తుతం) |
పిల్లలు | దివ్య సత్యరాజ్ , సిబి సత్యరాజ్ |
తల్లిదండ్రులు |
|
సత్యరాజ్ (జననం 1954 అక్టోబరు 3) ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. ప్రధానంగా తమిళ సినిమాల్లో నటించాడు. ప్రతినాయక పాత్రలతో తన ప్రస్థానం ప్రారంభించి నాయకుడి పాత్రలు, సహాయకుడి పాత్రలు పోషించాడు. 200కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలున్నాయి. తెలుగులో బాహుబలి, మిర్చి, శంఖం లాంటి సినిమాల్లో నటించాడు. ఈయన నాస్తికుడైన పెరియార్ అనుచరుడు.
బాల్యం
[మార్చు]సత్యరాజ్ 1954 అక్టోబరు 3న సుబ్బయ్యన్, నాదాంబాళ్ కాళింగరాయర్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. ఆయన జన్మనామం రంగరాజ్. అమ్మ వాళ్ళది జమీందారీ కుటుంబం. తండ్రి వైద్యుడు. ఆయనకు కల్పన, రూప అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు.[2] చెల్లెళ్ళు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు విడిపోయారు. రంగరాజ్ అమ్మతో బాటు పిన్నమ్మ, పినతండ్రి దగ్గర పెరిగాడు. ఆరో తరగతి నుంచి ఆయనకు సినిమా పిచ్చి పట్టుకుంది.[3] చిన్నప్పటి నుంచి ఎంజీఆర్ కు వీరాభిమాని. [4] సత్యరాజ్ కోయంబత్తూరులోని సెయింట్ మేరీస్ కాన్వెంటు పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. తరువాత రామ్ నగర్ లోని సబర్బన్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీయెస్సీ బోటనీ చదివాడు. ఈయన నాస్తికుడైన పెరియార్ అనుచరుడు. [5][6][7]
సత్యరాజ్ కు సినిమాల మీద ఆసక్తి ఉన్నా అతని తల్లి ఆ రంగంలో ప్రవేశించడానికి అంగీకరించలేదు. అయినా సరే 1976లో సినీరంగంలో ప్రవేశించడం కోసం కోయంబత్తూరు వదిలి చెన్నైలోని కోడంబాక్కం చేరాడు.[8]
సినిమాలు
[మార్చు]సినిమా అవకాశాల కోసం చెన్నై చేరిన ఆయనకు పెదనాన్న కొడుకైన శివ సహాయం చేశాడు. అక్కడే ఒక గది అద్దెకు తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నించసాగాడు.[3]
అన్నకిలి అనే సినిమా చిత్రీకరిస్తుండగా ఆయనకు నటుడు శివకుమార్, నిర్మాత తిరుప్పూర్ మణియన్ లతో పరిచయం అయింది.[6] కోమల్ స్వామినాధన్ డ్రామా బృందంలో చేరాడు. నటుడిగా ఆయన మొట్టమొదటి సినిమా సట్టమ్ ఎన్ కైయిల్,[9] 1978 లో వచ్చిన ఈ సినిమాలో సత్యరాజ్ ప్రధాన ప్రతినాయకుడైన తెంగై శ్రీనివాసన్ కి అనుచరుడిగా నటించాడు. తరువాత కన్నన్ ఒరు కైక్కుళందై అనే సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు.[10][11] అందులోనే మరో చిన్న పాత్ర కూడా పోషించాడు. కథానాయకుడిగా ఆయన మొదటి సినిమా 1985 లో వచ్చిన సావి, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. అందులో సత్యరాజ్ ది నెగటివ్ పాత్ర. 1978 నుండి 1985 వరకు సుమారు 75 సినిమాల్లో నటించాడు. వీటిలో చాలా వరకు ప్రతినాయక పాత్రలే. [12][13]
తెలుగు సినిమాలు
[మార్చు]- పగలే వెన్నెల (1989)
- శాస్త్రి (1995)
- శంఖం
- మిర్చి
- ఢీ అంటే ఢీ (2015)
- బాహుబలి 1
- బాహుబలి 2
- తుగ్లక్ దర్బార్
- దొంగ (2019)
- 1945
- ఎతర్కుమ్ తునింధవం \ ఈటీ (తమిళ్ \ తెలుగు)
- చినబాబు (2018)
- ప్రతిరోజూ పండగే (2019)
- మీట్ క్యూట్ (2022)
- ప్రిన్స్ (2022)
- లవ్ టుడే (2022)
- వారసుడు (2023)
- తుఫాన్ (2024)
- జీబ్రా (2024)
తమిళ సినిమాలు
[మార్చు]- అన్నపూరణి (2023)
వెబ్ సిరీస్
[మార్చు]- మాన్షన్ 24 (2023)
- మై పర్ఫెక్ట్ హజ్బెండ్ (2023)
మూలాలు
[మార్చు]- ↑ Nandhu, Nandhu (3 October 2015). "HAPPY BIRTHDAY SATHYARAJ". Behindwoods.com. Retrieved 4 October 2015.
- ↑ "Actor Sathyaraj | నటుడు సత్యరాజ్ ఇంట్లో విషాదం-Namasthe Telangana". web.archive.org. 2023-08-12. Archived from the original on 2023-08-12. Retrieved 2023-08-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 3.0 3.1 Eenadu. "ఛాన్సులు రాక... ఐస్‌క్రీములమ్మాను! - Sunday Magazine - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2019-12-22. Retrieved 2019-12-22.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-01-28. Retrieved 2016-04-14.
- ↑ Subha J Rao (2013-05-04). "Many shades of grey". Chennai, India: The Hindu. Retrieved 2013-11-27.
- ↑ 6.0 6.1 75 படங்களில் வில்லனாக நடித்தபின் கதாநாயகனாக உயர்ந்த சத்யராஜ்: மாறுபட்ட வேடங்களில் நடித்து சாதனை | satyaraj villian 75 movies cinema history
- ↑ "dinakaran". Archived from the original on 2000-12-07. Retrieved 2016-04-15.
- ↑ "Sathyaraj: I'm like the kid in TZP - Times Of India". Articles.timesofindia.indiatimes.com. 2009-04-20. Archived from the original on 2013-12-03. Retrieved 2013-11-27.
- ↑ [http://cinema.maalaimalar.com/2013/07/22232237/kamal-movie-satyaraj-villan-ro.html కమల్ సినిమాలో సత్యరాజ్ విలన్ పాత్ర | kamal movie satyaraj villan role
- ↑ ప్రొడక్షన్ మేనేజర్ గా సత్యరాజ్| Sathyaraj cinema became production manager
- ↑ "dinakaran". Archived from the original on 2003-08-04. Retrieved 2016-04-15.
- ↑ "Serene ride to success". The Hindu. Chennai, India. 11 August 2000. Archived from the original on 13 ఫిబ్రవరి 2012. Retrieved 24 October 2011.
- ↑ సత్యరాజ్ కమల్ హాసన్ నటించిన సినిమాలు | actor sathyaraj and kamal hassan kakki chattai film