అక్షాంశ రేఖాంశాలు: 17°06′N 82°12′E / 17.1°N 82.2°E / 17.1; 82.2

సామర్లకోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 17°06′N 82°12′E / 17.1°N 82.2°E / 17.1; 82.2
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండలంసామర్లకోట మండలం
విస్తీర్ణం
 • మొత్తం14.88 కి.మీ2 (5.75 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం56,864
 • జనసాంద్రత3,800/కి.మీ2 (9,900/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1023
ప్రాంతపు కోడ్+91 ( 8852 Edit this on Wikidata )
పిన్(PIN)533440 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

సామర్లకోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా, సామర్లకోట మండలానికి చెందిన పట్టణం, మండలకేంద్రం. ఇది ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఇక్కడ గల పంచారామాలలో ఒకటైన కుమారభీమారామం ప్రముఖ పర్యాటక ఆకర్షణ.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

ఈ వూరి అసలు పేరు శ్యామలదేవికోట. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేదట. పెద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో రాయబడిన కైఫియత్తు బట్టి అప్పట్లో చామర్లకోటా అని పిలవబడేది అని తెలుస్తుంది.[2]

చరిత్ర

[మార్చు]

ఇక్కడ గల కుమారభీమారామాన్ని కుమార భీముడనే చాళుక్య రాజు నిర్మించాడు. ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర.

భౌగోళికం

[మార్చు]

సామర్లకోట 17°03′00″N 82°11′00″E / 17.0500°N 82.1833°E / 17.0500; 82.1833.[3] సముద్రమట్టం నుండి సగటు ఎత్తు 9 మీటర్లు (32 అడుగులు). జిల్లాకేంద్రమైన కాకినాడ నుండి వాయవ్యంగా 14 కి.మీ దూరంలో వుంది.

జనగణన వివరాలు

[మార్చు]

2011) భారత జనగణన ప్రకారం పట్టణ - మొత్తం 1,37,979 - పురుషులు 68,663 - స్త్రీలు 69,316

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం ప్రకారం సామర్లకోట పట్టణం జనాభా 53,402. ఇందులో మగవారు 50%, ఆడవారు 50%. ఇక్కడి సగటు అక్షరాస్యత 60%. అందులో మగవారి అక్షరాస్యత 65%, ఆడువారి అక్షరాస్యత 56%. మొత్తం జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు.

పరిపాలన

[మార్చు]

సామర్లకోట పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]
సామర్లకోట రైల్వేస్టేషన్

కాకినాడ నుండి జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజానగరం, రాజమహేంద్రవరం లకు ముఖ్య రహదారి కూడలి. రాష్ట్ర ముఖ్య రహదారి (సంఖ్య 54) సామర్లకోట మీదుగా పోవుచున్నది. హౌరా -చెన్నై రైలు మార్గంలో సామర్లకోట ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఇక్కడినుండి కాకినాడ రైలు మార్గం చీలుతుంది.

దర్శనీయ స్థలాలు

[మార్చు]

కుమారారామ మందిరం

[మార్చు]
కుమారభీమారామం దేవాలయ ప్రధానద్వారము
కుమారభీమారామం దేవాలయ ఆవరణ లోపలిభాగం

పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామం క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.

సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ద్రాక్షారామ దేవాలయాన్నీ ఆయనే నిర్మించాడు. కనుక ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.

ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది.ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడి తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇంకా ఇక్కడి అమ్మవారు బాలా త్రిపుర సుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి.

ఇతరాలు

[మార్చు]

పరిశ్రమలు

[మార్చు]
  • రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ వారి 2220 మెగావాట్ల విద్యుత్ కేంద్రము
  • రాక్ సిరామిక్స్
  • నవభారత్ వెంచర్స్ వారి దక్కన్ షుగర్స్
  • శ్రీ వెంకటరామ ఆయిల్ ఇండస్ట్రీస్ - రైస్ బ్రాన్ నూనె తయారీ
  • అంబటి సుబ్బన్న అండ్ కో - నువ్వుల నూనె తయారీ
  • పి.ఎస్. తార్పాలిన్స్
  • విమల్ డ్రింక్స్

ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Sources of the History of India". Nisith Ranjan Ray. Institute of Historical Studies. 1978. p. 159.
  3. Falling Rain Genomics.Samalkot

వెలుపలి లంకెలు

[మార్చు]