మొదటి పేజీ

వికీపీడియా నుండి

వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 40,101 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

స్వాగతం
ఈ వారపు బొమ్మ
మహబూబ్‌నగర్ బస్‌స్టేషన్‌లోని దృశ్యం.

మహబూబ్ నగర్ బస్‌స్టేషన్‌లోని దృశ్యం.
(ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని గురించీ ఒకో వ్యాసాన్ని, కొన్ని బొమ్మలను తెలుగు వికీలో కూర్చే ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి సహకరించండి.)

ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భాష మరియు సంస్కృతి
తెలుగు సినిమా
భారత దేశము మరియు ప్రపంచము
విజ్ఞానము మరియు సాంకేతికం
విశేష వ్యాసాలు
సహకారము
ఈ వారపు వ్యాసము


శ్రీశైలము ప్రసిద్ధ శైవ క్షేత్రము. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. ఎందరో రాజులు, పురాణ పురుషులు సేవలు చేసిన మహాక్షేత్రం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.


శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు కలవు. క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యముగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి శ్రీశైల దేవాలయ ప్రాంతము, సున్నిపెంట ప్రాంతము, మండపాలు, పంచమఠాల ప్రాంతము, అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు. శ్రీమల్లికార్జునుని దేవాలయము అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. మనోహర గుండము తప్పకుండా చూడవలసిన వాటిలో ఒకటి. చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది.


శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి. సాక్షి గణపతి ఆలయము ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని. అందుకే ఇతనిని సాక్షి గణపతి అంటారు. శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉన్నది. ....పూర్తివ్యాసం: పాతవి

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి

అశోకచక్రం
  • భారత జాతీయపతాకంలో ఉండే అశోకచక్రంలో 24 ఆకులు (చక్ర మధ్య భాగం నుంచి వలయానికి తాకే గీతలు) ఉంటాయి అనీ! (అశోకచక్రం వ్యాసం) (బొమ్మ ఉన్నది)
  • బెరిబెరి వ్యాధి విటమిన్ బి1 (థయామిన్) లోపం వల్ల వస్తుంది అనీ! (నీటిలో కరిగే విటమినులు వ్యాసం)
  • మొదటి లేజరు కాంతి పరికరాన్ని ప్రదర్శించినది థియోడర్ మేమన్‌ అనీ! (లేజర్ వ్యాసం)
  • మధ్యయుగ భారతదేశ్ చరిత్రలో ప్రసిద్ధి చెందిన తైమూర్‌లంగ్ అసలు పేరు అమీర్ తెమూర్ అనీ! (తైమూర్ లంగ్ వ్యాసం)
  • ఒకే టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సెంచరీ మరియు బౌలింగ్‌లో 10 వికెట్లు సాధించిన తొలి ఆల్‌రౌండర్ ఇయాన్ బోథం అనీ! (ఇయాన్ బోథం వ్యాసం)
  • 1974లో మరియు 1998లో భారతదేశం అణుపరీక్షలు జరిపిన ప్రాంతం రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో ఎడారి ప్రాంతమైన పోఖరాన్ అనీ! (పోఖ్రాన్ వ్యాసం)
  • కర్బన రసాయనశాస్త్రం (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పేరును తొలిసారిగా వాడినది స్వీడన్ దేశపు శాస్త్రవేత్త జాన్ జాకబ్ బెర్జీలియస్ అనీ! (ఆంగిక రసాయనం వ్యాసం)
  • విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్, టెలిగ్రాఫిక్ లాంటి ఉపకరణాలను తయారుచేసిన శాస్త్రవేత్త అమెరికాకు చెందిన థామస్ ఆల్వా ఎడిసన్ అనీ! (థామస్ అల్వా ఎడిసన్ వ్యాసం)
చరిత్రలో ఈ రోజు

మే 21



భారతీయ భాషలలో వికీపీడియా

సోదర ప్రాజెక్టులు:
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి సహాయము చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు ఉపయోగిస్తారు.
పేజీకి సంభందించిన లింకులు