కాకరపర్రు

వికీపీడియా నుండి

కాకరపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామము. పాలకొల్లు మరియు నిడదవోలు ప్రధాన దహరారిపై పెరవలికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామం. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం కలదు. ఈ గ్రామం ఒకప్పుడు అగ్రహారం. రాణి రుద్రమదేవి ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామమును ఏర్పాటు చేసెను. గోదావరి తీరప్రాంత గ్రామము అయినందున వరి పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా పసుపు, కంద పండిస్తారు. ఇవేకాక పూలతోటలు, కూరగాయల తోటలు కూడా కలవు.

విద్యాసౌకర్యాలు

ఊరిలో ఒక ఉన్నత పాఠశాల, రెండు మాద్యమిక పాఠశాలలు కలవు. ప్రక్కన కల అజ్జరం, మరియు తీపర్రు ల నుండి కూడా ఉన్నత పాఠశాలా విద్యకొరకు ఇక్కడికే వస్తారు.

రవాణా

ప్రధాన రహదారిలో ఉండుట వలన ఈ గ్రామము మీదుగా పలు బస్సులు ప్రయాణించును.

నీటి వనరులు

విజ్జేశ్వరం నుండి పెద్దకాలువ వస్తుంది. రెండు మంచినీటి చెరువులు, ఒక ఊర చెరువు కలవు.

ప్రముఖులు


"http://te.wikipedia.org/w/index.php?title=కాకరపర్రు&oldid=586182" నుండి వెలికితీశారు