Coordinates: 28°38′39″N 77°14′31″E / 28.6443°N 77.2420°E / 28.6443; 77.2420

దర్యాగంజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్యాగంజ్
దర్యాగంజ్
ఉప జిల్లా
ఆదివారం పుస్తక వ్యాపారం
ఆదివారం పుస్తక వ్యాపారం
షాజహానాబాద్ చారిత్రక పటం (ఇప్పుడు దీనిని పాత ఢిల్లీ అని పిలుస్తారు) 1863లో దర్యాగంజ్ స్థానం చూపుతుంది.
షాజహానాబాద్ చారిత్రక పటం (ఇప్పుడు దీనిని పాత ఢిల్లీ అని పిలుస్తారు) 1863లో దర్యాగంజ్ స్థానం చూపుతుంది.
దర్యాగంజ్ is located in ఢిల్లీ
దర్యాగంజ్
దర్యాగంజ్
భారతదేశం పటంలో ఢిల్లీ
Coordinates: 28°38′39″N 77°14′31″E / 28.6443°N 77.2420°E / 28.6443; 77.2420
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లామధ్య ఢిల్లీ
Government
 • Bodyఢిల్లీ మహా నగరపాలక సంస్థ
Population
 • Total2,71,108
భాషలు
 • అధికారహిందీ, ఆంగ్లం, ఉర్దూ, పంజాబీ
Time zoneUTC+05:30
పిన్‌కోడ్
స్థానిక స్వపరిపాలననగరపాలక సంస్థ

దర్యాగంజ్, గోడల నగరంగా పేరొందిన ఢిల్లీ పొరుగుప్రాంతమైన షాజహానాబాద్ (పాత ఢిల్లీ) పరిసరాలలో ఉన్న ఒక పట్టణం. "దర్యా" అనే పదం "నది" గోడల నగరానికి వెలుపల ఉన్న యమునా నదిని సూచిస్తుంది. దర్యాగంజ్ మూడు ఉప విభాగాలలో ఒకటి.ఇది మధ్య ఢిల్లీ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం ముఖ్య పట్టణం.ఈ ప్రాంతం ఎర్రకోట వైపు వెళ్ళే నేతాజీ సుభాష్ రోడ్ అంచున ఉన్న ఢిల్లీ గేట్ వద్ద నుండి ప్రారంభమవుతుంది.

షాజహానాబాద్ ప్రాంతంలోని అన్సారీ రోడ్, దర్యాగంజ్ నగరం గోడ భాగం ఉన్న ప్రాంతం

1803 తరువాత దర్యాగంజ్ ప్రాంతంలో ఢిల్లీ కంటోన్మెంటుకు చెందిన ఢిల్లీ గార్సిన్ స్థానిక రెజిమెంట్ ఉంచబడింది.దీనిని ఆ తరువాత రిడ్జ్ ప్రాంతానికి మార్చారు.ఇప్పుడు దీనిని న్యూ దర్యాగంజ్ అని పిలుస్తారు. ఇది ఒకప్పుడు బ్రిటిష్ దర్యా గంజ్ కంటోన్మెంట్లో భాగంగా ఉంది.పాత ఢిల్లీలోని బ్రిటిష్ వారి తొలి స్థాపనలలో ఇది ఒకటి.ప్రస్తుత వ్యాపారులు ఈ ప్రాంతంలోకి మారినప్పుడు, కొత్త దర్యాగంజ్ లోని మార్కెట్ ప్రాంతాన్ని "ఫైజ్ బజార్ " అని పిలువబడేది.[1] దర్యాగంజ్ కు తూర్పున యమునా నదిపై గోడల నగరానికి చెందిన రాజ్ ఘాట్ గేట్ వద్ద ధర్యాగంజ్ ప్రారంభమైంది.దర్యాగంజ్ ఫూల్ మండి (ఫ్లవర్ మార్కెట్) 1869 లో స్థాపించబడింది.నేటికీ ఒక చిన్న భౌగోళిక ప్రాంతంలో సేవ చేస్తున్నప్పటికీ, ఆ ప్రాంతంలో జనాభా రద్దీ కారణంగా దీనికి చాలా ప్రాముఖ్యతను కలిగిఉంది.[2][3] 1911 తరువాత కొత్త రాజధాని న్యూ ఢిల్లీ నిర్మిస్తున్నప్పుడు, కొత్త నగరానికి మధ్య పహర్‌గంజ్‌తో పాటు, దర్యాగంజ్ ఈ రెండూ జనావాసం రద్దీలేని ప్రాంతాలుగా ఉండేవి.1931 నాటికి "గోడల నగరం" గా పిలవడం ప్రారంభించిన తరువాత పాత నగరం దిల్లీ గేట్ సమీపంలో గోడల నగరం అంచువరకు దర్యాగంజ్ బాగా విస్తరింపబడింది.[4]

అవలోకనం[మార్చు]

డాక్టర్. ష్రాఫ ఛారిటీ ఐ హాస్పిటల్, అంచనా. 1926, ఇక్కడ అనేక కంటి ఆసుపత్రులలో ఒకటి

ఆధునిక పాత ఢిల్లీ ప్రధాన వాణిజ్య కేంద్రంగా దర్యాగంజ్ కొనసాగుతోంది. ఢిల్లీ గేట్ నుండి ప్రారంభమై చారిత్రాత్మక ఎర్రకోట వైపు వెళ్ళే నేతాజీ సుభాష్ రోడ్, జామా మసీదు, చాందిని చౌక్, ఈ ప్రాంతాల మధ్యలో దర్యాగంజ్ విస్తరించి, కొద్ది దూరంలో ఉంది.

ఈ ప్రాంతంలో అనేక కంటి ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి, వీటిలో డాక్టర్ ష్రాఫ్స్ ఛారిటీ కంటి వైధ్యశాల కూడా ఉంది. ఇది 1917 లో ప్రారంభమైంది.ఈ ప్రాంతంలో సోమవారం నుండి శనివారం వరకు దుకాణదారులతో సందడిగా ఉంటుంది. ఆదివారం ఇక్కడ మ్యాగజైన్‌లు, సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు భారతదేశం స్థాయిలో అతిపెద్ద వాణిజ్యానికి వేదిక ప్రాంతంగా ఉంది

ప్రతి ఆదివారం వీధి నడకమార్గాలలో జరిగే ఆదివారపునాడు జరిగే పుస్తక వాణిజ్యం జరిగే కితాబ్ బజార్ (బుక్ మార్కెట్) వంటి ఆల్ టైమ్ ఫేవరెట్ మార్కెట్లకు దర్యాగంజ్ బాగా పేరు గడించింది.ఆదివారం ఇతర వ్యాపారాలక వారాంతపు సెలవుదినంగా పాటిస్తారు.ఈ మార్కెట్ 1964 లో స్థాపించబడింది.[5] నేడు దాదాపు 2 కి.మీ.వరకు ఈ వ్యాపారం విస్తరించి ఉంది.[6] వాస్తవంగా ఏదైనా అంశంపై పుస్తకంకావాలంటే ఇక్కడ కనుగొనవచ్చు.ఇక్కడ ధరలు [7] సండే బుక్ మార్కెట్లో అన్ని స్ట్రీమ్స్, జోనర్స్ పుస్తకాలుకు అందుబాటులో ఉన్నాయి.

ఇక్కడ జన్మించిన ప్రముఖులు[మార్చు]

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దర్యాగంజ్ లోని నేహర్ వలీ హవేలీలో జన్మించి, భారతదేశం నుండి పాకీస్థాన్ విభజన జరిగేంతవరకు ఇక్కడ నివసించాడు.[8][9]

సినిమా హాల్స్[మార్చు]

దర్యాగంజ్‌లో గోల్చా అనే ఒక పెద్ద సినిమా హాల్ ఉంది.ఇది 1954 లో ప్రారంభించబడింది. ఇది ఢిల్లీలోని ఉన్న పురాతన సినిమాహాళ్లలో ఇది ఒకటి.[10][11]

వంటకాలు[మార్చు]

కుందన్ లాల్ జగ్గి స్థాపించిన మోతీ మహల్ అనే ఏకైక రెస్టారెంట్ పాతఢిల్లీ ప్రాంతంలోని దర్యాగంజ్ లో ఉంది.బటర్ చికెన్, ఆధునిక పప్పు మఖానీ[12] తయారీకి ఠాకూర్ దాస్ మాగో, కుందన్ లాల్ గుజ్రాల్,[13] మంచి పేరు గడించారు.కాశ్మీరీ వంటకాలను.[14] అందించే చోర్ బిజార్అనే మరో ఆధునిక రెస్టారెంట్, డెలైట్ సినిమా హాలుకు సమీపంలో ఉంది

ప్రధాన రాజకీయ కార్యాలయాలు[మార్చు]

గ్రాండ్ ముఫ్తీ, ఇస్లామిక్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా కార్యాలయం ప్రధాన కార్యాలయాలు అన్సారీ రోడ్‌లో ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Darya Ganj has colonial facade". The Times of India. 14 April 2010. Archived from the original on 2013-05-11. Retrieved 2020-12-27.
  2. Ashok Kumar Jain (2009). Urban transport: planning and management. APH Publishing. p. 176. ISBN 978-81-313-0441-9.
  3. "Pin Code of Daryaganj Delhi". citypincode.in. Archived from the original on 2016-03-06. Retrieved 2014-03-09.
  4. "A tale of two cities". Hindustan Times. 1 September 2011. Archived from the original on 2015-07-02.
  5. "Daryaganj Book Bazaar vs Khan Market bookstores". Hindustan Times. 22 November 2010. Archived from the original on 2013-05-13.
  6. http://www.roaddistance.in/delhi/daryaganj-book-bazar-new-delhi-to-khan-market-distance/by-road/
  7. "Delhi- 100 years as the Capital". The Hindu. 1 Feb 2011. Archived from the original on 16 జూన్ 2011. Retrieved 27 డిసెంబరు 2020.
  8. The life and times of P.Jawahar Lal Nehru NDTV
  9. Haidar, Suhasini (24 August 2014). "Consistent inconsistencies". The Hindu. Retrieved 2014-08-24.
  10. Golcha Delhilog.
  11. [1] Golcha Cinema Website Archived 4 మార్చి 2016 at the Wayback Machine
  12. The modern dal makhani was invented by Moti Mahal Archived 1 మార్చి 2012 at the Wayback Machine Vir Sanghvi website.
  13. "100 years of Dilli Khana". Business Line. 2011.
  14. "Daryaganj Book Bazaar vs Khan Market bookstores". Hindustan Times. 22 November 2010. Archived from the original on 2013-05-13.

బాహ్య లింకులు[మార్చు]