నోటితో రతి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నోటితో రతి
Cunni.png

అంగ చూషణం లేదా నోటితో చేసే లైంగిక కార్యం సంభోగంలో ఒక భాగం మాత్రమే. స్త్రీ, పురుషుని అంగాన్ని తన నోటిలో చొప్పించుకుని అతన్ని ప్రేరింప చేయడం, లేదా పురుషుడు స్త్రీ యోనిలోకి నోటితో స్త్రీని ప్రేరేపించడం అన్నమాట. ఆంగ్లంలో,నోటిసంభోగానికి (స్తీ నోట్లో అంగాన్ని పెట్టుకుని సుఖించే దాన్ని) ఫెలేషియో, (పురుషుడు నాలుకతో చేసే యోని సంభోగం) కన్నీలింగస్ అని పేర్లు. జననేంద్రియాల్ని కాకుండా ఇతర శరీర భాగాల్ని ప్రేరేపించడాన్ని నోటితో ముద్దులు పెట్టడం లాంటివి చేసినా అవి నోటి సంభోగంగా పరిగణింపబడదు. మామూలుగా, నోటితో చేసే సంభోగం అసలు క్రియకు సహాయకారిగా ఉపయోగ పడుతుంది. దీన్నే ఫోర్ ప్లే అంటారు. ఇందుకు సాధారణమైన రతి భంగిమలు సరిపోతాయి. స్త్రీలు జరిపే ఫెలేషియోలో ఒక్కొక్కప్పుడు పురుషుడి వీర్యాన్ని స్త్రీ, మింగడం జరుగుతుంది. దీని వలన ఆమెకు గర్భం ధరించడానికి తద్వారా పిల్లలు కలగడానికి అవకాశం లేనే లేదు. వీర్యం ఆమె జీర్ణాశయంలో విచ్ఛిన్నం అయిపోతుంది. జీర్ణవ్యవస్థకు జననేంద్రియ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదు. అయితే, కొన్ని సుఖ వ్యాధులు, మానవ పాపిల్లోమా వైరస్ మరియు ఎయిడ్స్ వ్యాపిస్తాయి. నోటిలో ఏవైనా పుండ్లు లేదా గాయాలు ఉంటే వీటి వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన జననేంద్రియాల పరిశుభ్రత అంగచూషణకు పాల్పడే జంటకు చాలా అవసరం.


"http://te.wikipedia.org/w/index.php?title=నోటితో_రతి&oldid=1466281" నుండి వెలికితీశారు