స్వలింగ సంపర్కం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఇప్పటివరకు భారత శిక్షాస్మృతి (ఐపిసీ 377 సెక్షన్) ప్రకారం స్వలింగ సంపర్కం' (Homosexual sex) నేరం. డిల్లీ హైకోర్టు 2.7.2009 న ఇచ్చిన తీర్పు ప్రకారం స్వలింగ సంపర్కం నేరం కాదు.ఇది చట్టం ఐతే దీనిని నేరంగా పరిగణించని దేశాలలో మనది 127 వ దేశం అవుతుంది.స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందనను తెలియజేయాలని ఆదేశిస్తూ 9.7.2009న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. స్వలింగ సంపర్క చట్టానికి 149 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలకుడు లార్డ్ మెకాలే 1860వ సంవత్సరంలో స్వలింగసంపర్కానికి సం బంధించిన 377 సెక్షన్‌ను భారత శిక్ష్మా స్మృతిలో ప్రవేశపెట్టారు. అప్పుడు ఈ సెక్షన్ ప్రకారం ‘ఎవరై నా ప్రకృతి ఆదేశాలకు విరుద్ధంగా స్వచ్ఛందంగా ఒక పురుషుడితో కాని, మహిళ లేదా జంతువులతో కానీ భౌతికంగా సంభోగిస్తే జీవిత కాల శిక్షార్హులు. ఈ శిక్షను మరో పదేళ్లపాటు పొడిగించే అవకాశం తో పాటు జరిమానా విధించవచ్చు’ అని అందులో పొందుపరిచారు. అప్పుడు ‘పురుష మైథున వ్యతిరేక చట్టం’గా వ్యవహరించబడుతున్న ఈ 377 సెక్షన్ ను 1935లో సవరించారు. దాని పరిధిని విస్తరిం చారు. ఓరల్ సెక్స్ ను కూడా 377 సెక్షన్‌లో చేర్చా రు. అయితే కాలక్రమంలో తీర్పుల్లో వస్తున్న మార్పులకనుగుణంగా 377వ సెక్షన్‌లో లైంగిక సంపర్కాన్ని కూడా చేర్చారు. తాజాగా స్వలింగసం పర్కంపై ఢిల్లీ హై కోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. దానిని క్రిమినల్ నేరంతో సమానంగా చూడడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడ మేనని తీర్పు వెలువరించింది. అయితే బలవంతపు హోమోసెక్సువాలిటిని క్రిమినల్ నేరంగా పరిగణిం చవచ్చునని పేర్కొంది.1989లో స్వలింగసంపర్కానికి చట్టబద్ధత కల్పించిన మొదటి దేశంగా డెన్మార్క్ (నెదర్లాండ్) అవతరించింది. ఆ తరువాత నార్వే, స్వీడన్, ఐలాం డ్ దేశాలు డెన్మార్క్‌ను అనుసరించాయి. ఆఫ్రికాలో అత్యధిక దేశాల్లో స్వలింగ సంపర్కం చట్ట వ్యతి రేకం. దక్షిణాఫ్రికాలో స్వలింగ సంపర్కులకు రాజ్యాంగంలో స్థానం కల్పించారు. అంతేకాకుం డా 2007 సంవత్సరంలో నేపాల్ సుప్రీంకోర్టు లెస్బియన్లు, స్వలింగ సంపర్కులు, లింగమార్పిడిదారు ల చట్టాలను రద్దు చేయాలని వారిని మూడో లింగం గా గుర్తించి వారికి పౌర హక్కు లను కల్పించాల్సిందిగా కోరింది.
విషయ సూచిక |
[మార్చు] స్వలింగసపర్క వ్యతిరేక వాదనలు
1. స్వలింగ సంపర్క అనుకూల చట్టాలు సహజ విరుద్ధమైనవి. వాటిని అనుమతించకూడదు.అది లైంగికపరమైన అవినీతికి దారితీస్తుంది. 2. ప్రకృతి విరుద్ధమైన చర్యలవల్ల కలిగే దుష్ఫలితాలు ఊహించలేనివి. జంతువులలో కూడా ఇటువంటి ప్రకృతి విరుద్ధ కార్యకలాపాలుండవు. 3. స్వలింగసంపర్కంద్వారా ఎయిడ్స్ త్వరితగతిన వ్యాపిస్తుంది.హైకోర్టు తీర్పు తర్వాత ఏడు స్వలింగ సంపర్క వివాహాలు జరిగాయి. అసలు వివాహ వ్యవస్థే ప్రశ్నార్థకంగా మారుతోంది. 4.అన్ని మతాల పవిత్రగ్రంధాలు కూడా అటువంటి చర్యలను వ్యతిరేకిస్తున్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకోవాలి.కోట్లాదిమంది మతవిశ్వాసాలను దెబ్బతీసే ఈ అంశంపై బహుళ ప్రయోజనాలను ఆశించి నిర్ణయం తీసుకోవాలి. మతవిశ్వాసాలను గౌరవించాల్సి ఉంది.మన పూర్వ సంప్రదాయాలను గౌరవిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ చట్టాన్ని తెచ్చింది.భారత విలువలను కాలరాసేందుకు కొంతమంది ప్రణాళిక ప్రకారం చేస్తున్న నేరపూరిత కుట్ర ఇది.మన సంప్రదాయాలను మంటగలిపే ప్రయత్నం ఇది. 5.ఇటువంటి ప్రకృతి విరుద్ధ చర్యలకు అనుమతిస్తే భవిష్యత్తులో జంతువులతో సంభోగానికీ అనుమతివ్వాలని కోరే ప్రమాదముంది. 6.స్వలింగ సంపర్కంపై మోజు ఉన్నవారు తప్పితే దీనికోసంఎవరూ పోరాడటంలేదు.
[మార్చు] స్వలింగసంపర్క అనుకూల వాదనలు
- హైకోర్టులో పిటిషన్ వేసి విజయం సాధించిన నాజ్ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనరుకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది.
1.ప్రాచీన చట్టాలను మారుతున్న కాలానికనుగుణంగా మార్చుకోవలసిన అవసరం ఉంది. కాలంతో పాటు చట్టాలను మార్చకపోవడంతో చాలా ప్రాచీన చట్టాలు అలాగే ఉండిపోయాయి.వాటిని సవరించాలి. 2.మనుషులందరూ ఒకటేనని హైకోర్టు తేల్చి చెప్పింది.స్వలింగ సంపర్కుల నుంచి బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిల్ చేస్తున్న పోలీసులకు కోర్టు బుద్డిచెప్పింది.స్వలింగసంపర్కులకు సమాజంలో హోదా స్థాయి పెరిగింది.
[మార్చు] స్వలింగ సంపర్కుల న్యాయపోరాట చరిత్ర
-2001లో స్వలింగసంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఎన్‌ఏజడ్(నాజ్) ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
-2004 సెప్టెంబర్ 2న ఢిల్లీ హై కోర్టు పిల్‌ను డిస్మిస్ చేసింది.
-2004 సెప్టెంబర్‌లోనే స్వలింగసంపర్కులు తిరిగి రివ్యూ పిటిషన్ దాఖలు
-2004 నవంబర్ 3న రివ్యూ పిటిషన్ కూడా హై కోర్టు తోసిపుచ్చింది.
-2004 డిసెంబర్‌లో స్వలింగసంపర్కులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
-2006 ఏప్రిల్ 3న కేసును తిరిగి పరిశీలించాల్సిందిగా ఢిల్లీ కోర్టుకు అత్యున్నత స్థానం సూచించింది.
-2008 సెప్టెంబర్ 18న కేంద్ర ఆరోగ్య శాఖ, హోంశాఖలు స్వలింగ సంపర్కం చట్టబద్ధతపై భిన్న స్వరాలు వినిపించాయి.
-2008 సెప్టెంబర్ 25న కేంద్ర ప్రభుత్వాన్ని స్వలింగసంపర్కులు సంప్రదించి తమ హక్కులకు భంగం వాటిల్లజేయవద్దని కోరారు.
-2008 సెప్టెంబర్ 26న స్వలింగసంపర్కం అనైతికమని, దాన్ని నేరంగా పరిగణించకపోతే సమాజంలో విపరీత ధోరణులకు దారితీస్తుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
-2008 అక్టోబర్ 15న స్వలింగసంపర్కాన్ని నిషేధించడంపై శాస్ర్తీయపరమై న ఆధారాలతో రావాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
-2008 నవంబర్ 7న స్వలింగసంపర్కం నేరం కాదంటూ సంబంధిత కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్‌పై హై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
-2009 జూలై 2న స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది. .
[మార్చు] ఢిల్లీ హైకోర్టు తీర్పులో ముఖ్యాంశాలు
-స్వలింగ సంపర్కం మానసిక రుగ్మత కాదు.మనిషి లైంగిక ప్రక్రియలో అది మరో కోణం.పరస్పరం అంగీకారంతో వయోజనులు పాల్గొనే స్వలింగ సంపర్కం చట్టబద్ధమే -పరస్పరాంగీకారంతో వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం పీనల్ కోడ్ పరిధిలోకి రాదు.స్వలింగ సంపర్క చర్యల్ని నేరపూరితమైనవిగా పేర్కొనరాదు.స్వలింగ సంపర్కులైన పురుషులు వివక్షకు గురవుతున్నారు. వారిని కళంకితులుగా, నేరం చేసిన వారిగా చూస్తూ వివక్షకు గురి చేస్తున్నారు. ఇలా చూడడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవిని నివారించి, చికిత్స చేసేందుకు అవరోధం కలుగుతోంది - పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య సాగే స్వలింగ సంపర్కాన్ని నేరమని భారతీయ శిక్షా స్మృతిలోని (ఐపిసి) 377వ సెక్షన్ పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. - మైనర్లతో వారికిష్టం లేకుండా స్వలింగ సంపర్కానికి పాల్పడడంపై పీనల్ కోడ్ నిషేధం కొనసాగుతుంది. - పరిపూర్ణ వ్యక్తిగా స్వలింగ సంపర్కునికి ఉన్న హక్కును సెక్షన్ 377 నిరాకరిస్తోంది. - 18 ఏళ్లు, ఆపై వయస్కులెవరైనా వయోజనుల కిందికే వస్తారు. - ఒకరికొకరు ఇష్టపడితే వారి మధ్య స్వలింగ సంపర్కం నేరం కాదు. - లైంగికపరంగా వివక్ష చూపడం వ్యక్తిగత గౌరవానికి, మనుషులంతా సమానమే అన్న భావనకు వ్యతిరేకం. - స్వలింగ సంపర్కం నైతిక విరుద్ధమని పేర్కొంటూ సమాజంలో ఒక వర్గాన్ని చట్టంలోని ఒక సెక్షన్ నేరస్థులుగా చిత్రీకరించడం రాజ్యాంగం కల్పించిన సమాన హక్కుకు విరుద్ధం. - ఐపిసిలోని సెక్షన్ 377 రాజ్యాంగ విలువలకు, మనిషి గౌరవమర్యాదలకు విరుద్ధంగా ఉంది.
[మార్చు] హిందూ మతంలో
వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో ఉన్నట్టు రూఢి అయిన ఈ స్వలింగ సంపర్కం, దేవాలయాల గోడల మీద సైతం కనిపించే పురుష సంభోగ శిల్పాలు... నేరంగా పరిగణించబడుతున్నాయి. హరి హరులిద్దరూ కలిసి అయ్యప్పను పుట్టిస్తారు.
[మార్చు] క్రైస్తవంలో
ఇంచుమించు స్వలింగ సంపర్క స్థాయిలోకి వెళ్ళినట్లు మూడు జంటలను ఉదారవాద క్రైస్తవ పండితులు అనుమానిస్తారు:
- 1.రూతు నయోమి "Ruth clave onto her." Ruth 1:14
- 2.దావీదు యోనాతాను
the soul of Jonathan was knit with the soul of David, and Jonathan loved him as his own soul 1 Samuel 18:1 they kissed one another and wept with one another, until David exceeded 1 Samuel 20:41
- 3.దానియేలు అష్పెనాజు
God had brought Daniel into favor and tender love with Ashpenaz the prince of the eunuchs Daniel 1:9
[మార్చు] ఇస్లాంలో
- మీరెంత అశ్లీలానికి పాల్పడుతున్నారు?స్త్రీలనువదిలి పురుషులవెంట పడతారే?సిగ్గువిడిచి పాడుపని చేస్తారే?(ఖురాన్ 29:28)
- మీ ప్రభువు మీకోసం సృష్టించిన మీ భార్యలను వదిలి సిగ్గుమాలి పురుషులదగ్గరకు వెళ్ళటం హద్దుమీరటమె (ఖురాన్ 26:166)
[మార్చు] శాస్త్రవేత్తలు
యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో అధ్యాపకుడిగా పనిచేసిన బ్రూస్ బాగ్‌మిల్ బయోలాజికల్ ఎగ్జూబరెన్స్: యానిమల్ హోమోసెక్సువాలిటీ అండ్ నేచురల్ డైవర్సిటీ అనే పుస్తకంలో 450 రకాల పాలిచ్చే జీవులపైన, పక్షులపైన, కీటకాలపైన, జంతువులపైన శాస్త్రీయంగా పరిశోధనచేసి వాటిలోని స్వలింగ సంపర్క ధోరణులను, పుంసక మార్పిడి ధోరణులను (ట్రాన్స్‌జెండర్ బిహేవియర్) సవివరంగా చర్చించారు.పురుష స్వలింగ సంపర్కులందర్నీ కలిపి గతంలో 'గేస్' (Gays) అనే పదం వాడేవారు కాని ఇప్పుడు మాత్రం వారిని ఎం.ఎస్.ఎం.లు అంటున్నారు. ఎంఎస్ఎం అంటే మాన్ టు మాన్ సెక్స్ అని.
[మార్చు] రకాలు
ఇందులో ఆరు రకాల తేడాలున్నాయి.
1. కోతి : స్త్రీ తత్వాన్ని కలిగి ఉండే పురుషులకు స్వలింగ సంపర్కుల భాషలో కోతి అంటారు. వీరు సంపర్కం సమయంలో చాలావరకూ స్త్రీ పాత్రనే పోషిస్తారు. బయటకు వచ్చినపుడు పురుష వేషధారణను కలిగి ఉన్నప్పటికీ అంతరంగంలో స్త్రీ వేషధారణను కలిగి ఉండాలన్న తీవ్ర వాంఛను కలిగి ఉంటారు. దీనితో వారు ఆ వేషధారణలో మాత్రమే మానసికంగా ఎటువంటి ఘర్షణ లేకుండా హాయిగా ఉండగలుగుతారు.
2. పంతి : పురుష స్వభావాన్ని కలిగి ఉండి, పురుషుడిలానే ఉంటూ కూడా మరో పురుషుడితో సంపర్కాన్ని కోరుకునే స్వభావాన్ని కలిగి ఉండే వ్యక్తులను ఎంఎస్ఎంల పరిభాషలో పంతి అంటారు. వీరు మరో పురుషుడితో సంపర్కం జరిపేటప్పుడు పురుషుడి స్థానాన్ని ఆక్రమిస్తారు.
3. డబుల్ డెక్కర్ : సమయానుకూలంగా, అవసరానికి అనుగుణంగా సంపర్కం సమయంలో స్త్రీలానూ, పురుషుడిలానూ వ్యవహరించగలిగే స్వభావం కలిగిన వ్యక్తులను డబుల్ డెక్కర్స్ (డీడీ) అంటారు.
4. ట్రాన్స్‌జెండర్ (నిర్వాణ్): పూర్తిగా స్త్రీ వేషధారణతో ఉంటూ, ఆ స్వభావాన్ని సంతరించుకుని ఇచ్ఛాపూర్వకంగా తమ జననాంగాన్ని తీసివేయించుకున్న వ్యక్తులను ట్రాన్స్‌జెండర్ (నిర్వాణ్ - టీజీ) అంటారు. (ముర్గీమాత బాక్స్ చూడండి)
5. ట్రాన్స్‌జెండర్ (ఆక్వా): ఈ వ్యక్తులు వేషధారణలో, సంయోగ సమయంలోనూ స్త్రీలను పోలి ఉంటారు. అయితే వీరు తమ జననాంగాలను ఉంచుకుంటారు.
6. శివశక్తి/శివపార్వతి/జోగప్ప: వీరు తమను తాము దేవుళ్ళుగా భావించుకుంటారు. శివ, పార్వతి స్వభావాలను కలిగి ఉంటారు. అదే స్వభావం కలిగిన వారితో సంపర్కం పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలలో వీరు చాలా ఎక్కువమంది ఉన్నారని అంచనా.
ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక లెక్కప్రకారం వీరి సంఖ్య 75 వేలకు పైగా ఉంది. ఇది ఇక ప్రవర్తనా తీరు అనుకుంటే వీరి సంఖ్య సుమారు ఐదులక్షల వరకూ ఉండవచ్చని అనధికార అంచనా. నిన్నటివరకూ దీనిని ఒక మానసికమైన జబ్బుగా భావించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు కాదని తేల్చిచెప్పింది. ఎంఎస్ఎం అనేది కొత్తగా వచ్చింది కాదు... మన సమాజాలంత పాతది అని దీనిపై జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి.
అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఈ వివక్ష స్థాయి కొద్దిగా తక్కువగా ఉంది. అయితే అక్కడ కూడా వర్కింగ్‌ప్లేస్‌లలో, వైద్యసేవలను అందుకునే దగ్గర తీవ్రమైన వివక్షనే ఎదుర్కొంటున్నారు. ఇరాక్, నైజీరియా, మాస్కో, కామెరూన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక దేశాలలో స్వలింగ సంపర్క స్వభావాన్ని కల్గిన వ్యక్తులు ఇవాళ్టికీ జైళ్ళకు నెట్టబడుతున్నారు. కొన్ని సందర్భాలలో శిరచ్ఛేదనకు కూడా గురవుతున్నారు. అనేక దేశాలలో స్వలింగ సంపర్కం అన్న పదమే నిషిద్ధం (చట్టపరంగా), అయితే స్వలింగ సంపర్కం వంటి విషయాలపట్ల సహనం చూపే ఎంతో సహజ ధోరణులను ప్రదర్శించే ఇంగ్లండ్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలలోనూ, కఠినంగా వ్యవహరించే పోలండ్, ఇరాన్, నేపాల్ వంటి దేశాలలోనూ కూడా ఎం ఎస్ ఎంలు గుర్తింపుకోసం ప్రదర్శనలు, వివిధ పోరాట రూపాలను చేపడుతూనే ఉన్నారు.
- ముర్గీమాత... హిజ్రాల దేవత
ముర్గీమాత ఆలయం గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని బెచర్జీ పట్టణంలో ఉంది. అహ్మదాబాదుకు 110కి.మీ. దూరంలో ఉన్న ఈ గుడి 1857లో నిర్మితమయింది. చక్కటి రాతిచెక్కడాలతో అలంకృతమయిన ఈ గుడిని ప్రతి ఏడాది సుమారుగా 15 లక్షల మంది యాత్రికులు దర్శిస్తారు. హిజ్రాలకు ఈమె ఆరాధ్యదైవం. స్త్రీత్వం కారణంగా, పురుషాంగాన్ని కలిగి ఉండటాన్ని భరించలేని వ్యక్తులు తమ జననాంగాన్ని తీసివేసుకునే చోటు ఇది. ఇప్పుడు వైద్యులే శస్త్రచికిత్స చేస్తున్నారు.
[మార్చు] మూలాలు
- సతీష్‌బాబు చిగురుపాటి ఆంధ్రజ్యోతిలో( 7.12.2008)రాసిన వ్యాససారం:
- http://www.sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=31156&subcatid=18&categoryid=1
- http://www.suryaa.com/showNational.asp?ContentId=5369