స్వలింగ సంపర్కం
ఈ వ్యాసంలోని సమాచారం సరైనదేనని రూఢీ చేసుకునేందుకు మరిన్ని మూలాలు కావాలి . (August 2022) |
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. ఇచ్చిన కారణం: ఈ వ్యాసంలో భారత సుప్రీం కోర్టు వారి 2018 సెక్షన్ 377 తీర్పు గురించి వెల్లడించలేదు. ఈ తీర్పు ప్రకారం స్వలింగ సంపర్కం భారతదేశంలో పరలింగ సంపర్కం వలె చట్టబద్ధమైనదిగా డిక్లేర్ చెయ్యబడింది.(August 2022) |
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
స్వలింగ సంపర్కం అనగా ఒకే లింగానికి చెందిన వారి మధ్య ఉండే లైంగిక సంబంధము. స్వలైంగికత ఒకే లింగానికి చెందిన వారి మధ్య రొమ్యాంటిక్, లైంగిక ఆకర్షణ, లేదా లైంగిక ప్రవర్తన.[1][2][3] ఈ లైంగిక సంబంధము సృష్టి విరుద్ధమని అందరూ భావిస్తారు. కానీ, ఇది సృష్టికి విరుద్ధమేమీ కాదని, ప్రాకృతికమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వైద్య శాస్తం ప్రకారం కూడా స్వలింగ సంపర్కము ఒక మానసిక వ్యాధియో, లేక జన్యుపరమైన లోపమో కాదని, లైంగికతలో ఒక భిన్నమైన కోణంగా దీనిని పరిగణించాలని American Psychological Association, American Psychiatric Association, American Academy of Pediatrics మొదలగు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు నిర్ధారించాయి. ఇటీవల దీనిని Indian Psychiatric Society కూడా ఆమోదించింది. స్వలింగసంపర్కం చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా డెన్మార్క్ (నెదర్లాండ్). ఆ తరువాత నార్వే, స్వీడన్, ఐలాండ్ దేశాలు డెన్మార్క్‌ను అనుసరించాయి. ఆఫ్రికాలో అత్యధిక దేశాల్లో స్వలింగ సంపర్కం చట్ట వ్యతిరేకం. దక్షిణాఫ్రికాలో స్వలింగ సంపర్కులకు రాజ్యాంగంలో స్థానం కల్పించారు. 2007వ, సంవత్సరంలో నేపాల్ సుప్రీంకోర్టు, లెస్బియన్లు, స్వలింగ సంపర్కులు, లింగమార్పిడిదారుల చట్టాలను రద్దు చేయాలని వారిని మూడో లింగంగా గుర్తించి వారికి పౌర హక్కులను కల్పించాల్సిందిగా కోరింది.
చరిత్ర
[మార్చు]సోక్రటీస్, లార్డ్ బైరన్, ఎడ్వర్డ్ II, హద్రియాన్[4] వంటి చాలా మంది చారిత్రక వ్యక్తులు స్వలింగ లేదా ద్విలింగ సంపర్కులుగా చెప్పబడ్డారు.[5][6][7][8][9][8]
ఐపిసీ 377 సెక్షన్ కి 149 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలకుడు లార్డ్ మెకాలే 1860వ సంవత్సరంలో స్వలింగసంపర్కానికి సంబంధించిన 377 సెక్షన్‌ను భారత శిక్ష్మా స్మృతిలో ప్రవేశపెట్టారు. 1861 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అప్పుడు ఈ సెక్షన్ ప్రకారం ‘ఎవరైనా ప్రకృతి ఆదేశాలకు విరుద్ధంగా స్వచ్ఛందంగా ఒక పురుషుడితో కాని, మహిళ లేదా జంతువులతో కానీ భౌతికంగా సంభోగిస్తే జీవిత కాల శిక్షార్హులు. ఈ శిక్షను మరో పదేళ్లపాటు పొడిగించే అవకాశంతో పాటు జరిమానా విధించవచ్చు’ అని అందులో పొందుపరిచారు. అప్పుడు ‘పురుష మైథున వ్యతిరేక చట్టం’గా వ్యవహరించబడుతున్న ఈ 377 సెక్షన్‌ను 1935లో సవరించారు. దాని పరిధిని విస్తరించారు. అంగచూషణ (ఓరల్ సెక్స్) ను కూడా 377 సెక్షన్‌లో చేర్చారు. అయితే కాలక్రమంలో తీర్పుల్లో వస్తున్న మార్పులకనుగుణంగా 377వ సెక్షన్‌లో స్వలింగ లైంగిక సంపర్కాన్ని కూడా చేర్చారు. బ్రిటన్‌లో ఈ చట్టానికి 1967లో సవరణ చేశారు. 21 ఏళ్లు దాటిన వారు పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కానికి పాల్పడితే చట్టవిరుద్ధం కాదని మార్పు చేశారు. అయితే, 2009లో స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హై కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.[10][11][12] 'స్వలింగ సంపర్కం' నేరంకాదని, అలాపరిగణించడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడ మేనని తీర్పు ఇచ్చింది.[10][11][12] దీంతో స్వలింగ సంపర్కాన్ని చట్టసమ్మతం చేసి దీనిని నేరంగా పరిగణించని దేశాలలో మనది 127వ దేశంగా అయ్యింది.[13] అయితే, బలవంతపు 'హోమోసెక్సువాలిటి' మానభంగం కనుక, శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని కూడా ఆ తీర్పులో తెలిపింది.
అనుకూల వాదన
[మార్చు]- హైకోర్టులో పిటిషన్ వేసి విజయం సాధించిన నాజ్ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనరుకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది.
- ప్రాచీన చట్టాలను మారుతున్న కాలానికనుగుణంగా మార్చుకోవలసిన అవసరం ఉంది. కాలంతో పాటు చట్టాలను మార్చకపోవడంతో చాలా ప్రాచీన చట్టాలు అలాగే ఉండిపోయాయి. వాటిని సవరించాలి.
- మనుషులందరూ ఒకటేనని హైకోర్టు తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కుల నుంచి బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిల్ చేస్తున్న పోలీసులకు కోర్టు బుద్డిచెప్పింది. స్వలింగసంపర్కులకు సమాజంలో హోదా స్థాయి పెరిగింది.
- ”మేమూ మనుషులమే. మాకూ మనోభావాలుంటాయి. మమ్మల్ని తక్కువగాఎందుకు చూస్తారు' అంటూ స్వలింగ సంపర్కులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అశోక్ రావు కవి, విక్రమ్ సేఠ్ లాంటి వాళ్లు తాము 'గే' అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2006లో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కూడా ఈ విషయాన్ని బయటకు ప్రకటించారు. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు ఇష్టపూర్వకంగా శృంగార సంబంధంలో ఉంటే దాన్ని నేరం అనకూడదని 2008లో నాటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ వాదించారు.వాస్తవానికి స్వలింగ సంపర్కం అనేది మానసిక పరమైన వైరుధ్యమే తప్ప అదో వ్యాధి గానీ, నేరం గానీ కాదని మానసిక వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా పలు ప్రాంతాల్లో వీరికి పోలీసుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తెలుగు సినిమాల్లో కూడా స్వలింగ సంపర్కాన్ని ఎప్పుడూ తప్పు లాగా చూపించారే గానీ దాన్ని సహజ లక్షణంగా చెప్పలేదు. మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ ఒక యువకునిపై ఆయనకున్న ప్రేమను అద్భుతమైన వర్ణనలతో డైరీలో రాసి పెట్టాడట. సిగ్మండ్ ఫ్రాయిడ్ 1935లోనే ‘స్వలింగ సంపర్కం ఒక దుర్వ్యసనం కాదు.అదేదో తప్పుడుపని అయినట్లు దాని గురించి సిగ్గుపడాల్సింది ఏమీలేదు. స్వలింగ సంపర్కాన్ని శిక్షించడం మహా అన్యాయం, క్రూరత్వం’ అన్నాడు. స్వలింగ సంపర్కం మానవ హక్కులకు భంగం కలిగించేదేమీ కాదు. అలాంటప్పుడు అది చట్టవిరుద్ధం ఎందుకవుతుంది? భారత శిక్షాస్మృతిలోని ఆ సెక్షన్ కింద నమోదైన కేసులు చాలా అరుదనే వాదన కూడా సరైనది కాదు. ఒక్క వ్యక్తే అయినాసరే నేరారోపణకు ఎందుకు గురికావాలి? మానవ హక్కులకు ‘పాశ్చాత్యం’ లేదా ‘ప్రాచ్యం’ 'అప్రాచ్యం' అంటూ తేడా ఏమీ ఉండదు. శివ, కేశవులకు పుట్టిన శబరిమల అయ్యప్ప స్వామి అట్లాంటిక్ తీరంలో పుట్టలేదు. మానవ హక్కులకు విఘాతం కలిగించే ఏ చట్టమైనా అన్యాయమైనదే. వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో ఈ స్వలింగ సంపర్కం ఉంది.పూర్వం ఏనాడో దేవాలయాల గోడల మీద చెక్కిన అసంఖ్యాక స్త్రీ పురుష సంభోగ శిల్పాలు స్వలింగ సంపర్కం నేరంకాదని చెబుతున్నాయి.హిందూ దేశం చాలా స్వేచ్ఛాయుత దేశం. పుత్రకామేష్ఠి, పుండరీక లాంటి యజ్నాలూ యాగాలూ కూడా జరిగాయి. హిజ్రాల దేవత ముర్గీ మాత ఆలయం గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని బెచర్జీ పట్టణంలో ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వలింగ సంపర్క హక్కులను కాలరాసింది. కోర్టు తీర్పు వారి జీవిత హక్కులను లాగేసుకుంది.స్వలింగ సంపర్కాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటిస్తున్న 1861 నాటి చట్టాన్ని సమూలంగా మార్చాలి.ఈ తీర్పుపై పునఃసమీక్షను కోరుతాం. స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరంగా ప్రకటిస్తున్న ఐపిసి 377వ సెక్షన్‌ను కొట్టివేయాలి. స్వలింగ వివాహాలు కేవలం సంపర్కం కోసమే కానక్కరలేదు. అంతకంటే ముఖ్యంగా జీవితంలో ఇష్టమైన వ్యక్తితో అవసరమైన తోడు కోసం కూడా స్వలింగ వివాహం అవసరం కావచ్చు. ఒక 'చారిత్రాత్మక అవకాశం' చేజారిపోయింది. స్వలింగసంపర్కం నేరమనే ఐపిసి 377 సెక్షన్ 'మధ్యయుగ మనస్తత్వాన్ని' ప్రతిబింబిస్తోంది. ఇది మధ్యయుగం నాటి మనస్తత్వాన్ని దేశ ప్రజలపై రుద్దడమే.అంతకుమునుపే మనుషులందరూ ఒకటేనని హైకోర్టు తేల్చి చెప్పింది కదా? . స్వలింగ సంపర్కుల నుంచి బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిల్ చేస్తున్న పోలీసులకు హైకోర్టు ఆనాడే బుద్డిచెప్పింది. హైకోర్టు తీర్పు తరువాత స్వలింగ సంపర్కులకు సమాజంలో హోదా స్థాయి పెరిగింది. మానవహక్కుల గురించి మాట్లాడే సుప్రీంకోర్టు ఎందుకోగానీ స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఎందుకు తప్పుబట్టాలి? ఈ వ్యవహారంలో పార్లమెంటు జోక్యాన్ని న్యాయవ్యవస్థ కోరింది కాబట్టి పార్లమెంటు చట్టాన్ని మార్చాలి. తీర్పు తిరోగమన దిశలో ఉంది. ఇద్దరు పురుషులు లేదా మహిళలు పరస్పర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొంటే అది నేరం ఎందుకవుతుంది? ఈ తీర్పు వల్ల గేలు, లెస్బియన్‌లు, హిజ్రాలపై వివక్ష తొలగిపోదు.వాళ్ళు భయం భయంగా, సమాజానికి దూరంగా ఉండిపోతారు. పౌరసమాజంలో బహిరంగ భాగస్వాములు కాలేరు.ఎన్నో ప్రాచీన చట్టాలను మారుతున్న కాలానికనుగుణంగా మార్చుకున్నాం. కాలంతో పాటు చట్టాలను మార్చకపోవడంతో కొన్ని ప్రాచీన మూర్ఖపు చట్టాలు అలాగే ఉండిపోయాయి. వాటిని సవరించాలి, సంస్కరించాలి.ఇద్దరు మగవాళ్ళుగానీ, ఇద్దరు మహిళలు గానీ కలిసి కాపురం చేస్తే అది కేవలం శారీరక సంభోగం కోసమే కానక్కరలేదు. పెళ్ళి చేసుకునో, చేసుకోకుండానో ఒక స్త్రీ పురుషుడు కలిసి కాపురం చేస్తే దానిని ‘సక్రమ సహజీవనం ’అన్నారు. పెళ్ళి కాకుండా చేసే సహజీవనం అసహజమైనది,నేరము,పాపము కానప్పుడు స్వలింగ వివాహం నేరమెలా అవుతుంది? ఇందులో తప్పేంటి? ” (అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్, నాజ్ ఫౌండేషన్, ఇండియన్ ఆమ్నెస్టీ, జెడి (యు) ఎంపి శివానంద్ తివారీ, టిఎంసి ఎంపి డిరెక్ ఒబ్రీన్, సిపిఎం ఎంపి సీతారాం ఏచూరి, సినీ నటి మియా ఫారో, హీరోలు అమీర్‌ఖాన్, జాన్ అబ్రహం, రచయిత ఫర్హాన్అక్తర్, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్, కేంద్రమంత్రులుసల్మాన్ ఖుర్షీద్, జైరాంరమేశ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం వగైరా ....)
వ్యతిరేక వాదన
[మార్చు]పోరాట చరిత్ర
[మార్చు]భారతదేశంలో
[మార్చు]-2001లో స్వలింగసంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఎన్‌ఏజడ్ (నాజ్) ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
-2004 సెప్టెంబరు 2న ఢిల్లీ హై కోర్టు పిల్‌ను డిస్మిస్ చేసింది.
-2004 సెప్టెంబరులోనే స్వలింగసంపర్కులు తిరిగి రివ్యూ పిటిషన్ దాఖలు
-2004 నవంబరు 3న రివ్యూ పిటిషన్ కూడా హై కోర్టు తోసిపుచ్చింది.
-2004 డిసెంబరులో స్వలింగసంపర్కులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
-2006 ఏప్రిల్ 3న కేసును తిరిగి పరిశీలించాల్సిందిగా ఢిల్లీ కోర్టుకు అత్యున్నత స్థానం సూచించింది.
-2008 సెప్టెంబరు 18న కేంద్ర ఆరోగ్య శాఖ, హోంశాఖలు స్వలింగ సంపర్కం చట్టబద్ధతపై భిన్న స్వరాలు వినిపించాయి.
-2008 సెప్టెంబరు 25న కేంద్ర ప్రభుత్వాన్ని స్వలింగసంపర్కులు సంప్రదించి తమ హక్కులకు భంగం వాటిల్లజేయవద్దని కోరారు.
-2008 సెప్టెంబరు 26న స్వలింగసంపర్కం అనైతికమని, దాన్ని నేరంగా పరిగణించకపోతే సమాజంలో విపరీత ధోరణులకు దారితీస్తుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
-2008 అక్టోబరు 15న స్వలింగసంపర్కాన్ని నిషేధించడంపై శాస్ర్తీయపరమై న ఆధారాలతో రావాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
-2008 నవంబరు 7న స్వలింగసంపర్కం నేరం కాదంటూ సంబంధిత కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్‌పై హై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
-2009 జూలై 2న సెక్షన్ 377 భారత రాజ్యాంగంలోని అధికరణలు 14, 15, 21ల ప్రకారం తప్పని, పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది.[10][11][12]
-2009 జూలై 9న స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందనను తెలియజేయాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
-2013 డిసెంబరు 11న సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని, ఒకవేళ దానిలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే పార్లమెంటు చేయవచ్చని తీర్పు చెప్పింది.[14]
-2018 సెప్టెంబరు 6న భారత సుప్రీంకోర్టు ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత సమ్మతంతో సంపర్కానికి భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 377ని వర్తింపజేయడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిస్తూ, తమ యొక్క స్వంత 2013 తీర్పుని కొట్టివేసింది, దీంతో ఇక స్వలింగ సంపర్క కార్యకలాపాలు చట్టబద్ధం అయ్యాయి.[15]
కోర్టు తీర్పులు
[మార్చు]ఢిల్లీ హైకోర్టు తీర్పు - 2009
[మార్చు]- స్వలింగ సంపర్కం మానసిక రుగ్మత కాదు. మనిషి లైంగిక ప్రక్రియలో అది మరో కోణం. పరస్పరం అంగీకారంతో వయోజనులు పాల్గొనే స్వలింగ సంపర్కం చట్టబద్ధమే
- పరస్పరాంగీకారంతో వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం పీనల్ కోడ్ పరిధిలోకి రాదు. స్వలింగ సంపర్క చర్యల్ని నేరపూరితమైనవిగా పేర్కొనరాదు. స్వలింగ సంపర్కులైన పురుషులు వివక్షకు గురవుతున్నారు. వారిని కళంకితులుగా, నేరం చేసిన వారిగా చూస్తూ వివక్షకు గురి చేస్తున్నారు. ఇలా చూడడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవిని నివారించి, చికిత్స చేసేందుకు అవరోధం కలుగుతోంది
- పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య సాగే స్వలింగ సంపర్కాన్ని నేరమని భారతీయ శిక్షా స్మృతిలోని (ఐపిసి) 377వ సెక్షన్ పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది.
- మైనర్లతో వారి కిష్టం లేకుండా స్వలింగ సంపర్కానికి పాల్పడడంపై పీనల్ కోడ్ నిషేధం కొనసాగుతుంది.
- పరిపూర్ణ వ్యక్తిగా స్వలింగ సంపర్కునికి ఉన్న హక్కును సెక్షన్ 377 నిరాకరిస్తోంది.
- 18 ఏళ్లు, ఆపై వయస్కులెవరైనా వయోజనుల కిందికే వస్తారు.
- ఒకరికొకరు ఇష్టపడితే వారి మధ్య స్వలింగ సంపర్కం నేరం కాదు.
- లైంగికపరంగా వివక్ష చూపడం వ్యక్తిగత గౌరవానికి, మనుషులంతా సమానమే అన్న భావనకు వ్యతిరేకం.
- స్వలింగ సంపర్కం నైతిక విరుద్ధమని పేర్కొంటూ సమాజంలో ఒక వర్గాన్ని చట్టంలోని ఒక సెక్షన్ నేరస్థులుగా చిత్రీకరించడం రాజ్యాంగం కల్పించిన సమాన హక్కుకు విరుద్ధం.
- ఐపిసిలోని సెక్షన్ 377 రాజ్యాంగ విలువలకు, మనిషి గౌరవ మర్యాదలకు విరుద్ధంగా ఉంది.
భారత ప్రధాన న్యాయస్థానం (సుప్రీంకోర్టు) తీర్పు - 2013
[మార్చు]స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు, స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టేసింది. ఈ మేరకు వివిధ సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలు దాఖలు చేసిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు ఆమోదించింది. స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమని, అది నేరమని, జీవితఖైదు వరకు విధించగలిగేంత శిక్షార్హమని చెప్పే ఐపీసీ సెక్షన్ 377లో రాజ్యాంగపరంగా ఎలాంటి సమస్యా లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఒకవేళ ఆ సెక్షన్ ను ఐపీసీ నుంచి తొలగించాలా లేదా అనే విషయాన్ని శాసన వ్యవస్థ చూసుకోవాలని తెలిపింది.వ్యక్తిగత జీవితంలో ఇద్దరి అంగీకారంతో జరిగే హోమోసెక్సువాలిటీ నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం ఆ తీర్పును కొట్టేసింది. స్వలింగ సంపర్కం అనేది మన దేశంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలకు విరుద్ధమని వివిధ సంస్థలు కోర్టులో వాదించాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టేసినా, ఈ వివాదాస్పద అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం పార్లమెంటేనంటూ వ్యాఖ్యానించింది.
సుప్రీం కోర్టు కోరిన వివరాలు
[మార్చు]1.లైంగిక మైనారిటీల విషయంలో ప్రభుత్వ సంస్థలు వివక్ష కనబరుస్తున్నాయని, కనీస మానవహక్కులను నిరాకరిస్తున్నారని రుజువులు 2.ప్రజల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలకు సంబంధించిన వివరాలు 3.స్వలింగసంపర్కులు, బైసెక్సువల్స్, ట్రాన్స్‌జెండర్ల నేరాల విచారణ రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణలను ఈ సెక్షన్ ఉల్లంఘిస్తోందని చెప్పడానికి ప్రాతిపదికలు. 4. 1950 నుండి ఐపీసీకి 30 సవరణలు జరిగాయి. 2013లో జరిగిన ఒక సవరణ ప్రత్యేకించి లైంగిక నేరాలకు సంబంధించినదే. ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని 172వ లా కమిషన్ నివేదిక ప్రత్యేకంగా సిఫార్సు చేసింది. ఈ అంశం పలుమార్లు చర్చకు వచ్చింది. అయినా ఈ చట్టాన్ని సవరించాలని శాసనవ్యవస్థ అనుకోలేదు. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటుదే. ఐపీసీ సెక్షన్ 377ను తొలగించే అధికారం పార్లమెంటుదేనని, అప్పటివరకు దానికి చట్టబద్ధత ఉంటుంది.
ఏ దేశాల్లో స్వలింగ సంపర్క వ్యతిరేక చట్టాలు ఉన్నాయి?
[మార్చు]53 కామన్‌వెల్త్ దేశాలలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి 41 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగానే పరిగణిస్తున్నాయి. నైజీరియా, కామెరూన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక దేశాలలో స్వలింగ సంపర్కలు జైళ్ళకు నెట్టబడుతున్నారు.
స్వలింగ వివాహాలు
[మార్చు]స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళిళ్లను చట్టబద్ధం చేసిన తొలి దేశం డెన్మార్క్. 2001లో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉరుగ్వే, న్యూజీలాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, కెనడా, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం, ఐస్‌ల్యాండ్, అర్జెంటీనా వంటి దేశాలు స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళిళ్లను చట్టబద్ధం చేశాయి. ఈ ఏడాదే బ్రిటన్ ఆమోదం తెలిపింది. అయితే చర్చి అధికారులను మాత్రం చట్టం నుంచి మినహాయించారు. న్యూజీలాండ్‌లో విదేశీయులు కూడా పెళ్ళి చేసుకునే వెసులుబాటు ఉంది. ఉరుగ్వేలో మామూలు పెళ్ళికి, స్వలింగ సంపర్కుల పెళ్ళికి ఒకే విధమైన నిబంధనలను రూపొందించారు. అయితే 12.12.2013 న ఆస్ట్రేలియాలో గే వివాహం చట్టం రద్దు చేస్తూ ఆస్టేలియా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫ్రాన్స్‌లో స్వలింగ సంపర్క దంపతులు పిల్లలను దత్తత తీసుకోడానికి అనుమతిస్తూ చట్టం ఉంది.
మతాలు ఏమంటున్నాయి
[మార్చు]హిందూ మతం
[మార్చు]- వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో స్వలింగ సంపర్కం ఉంది.అందుకే దేవాలయాల గోడల మీద సైతం స్త్రీ పురుష స్వలింగ సంభోగ శిల్పాలు ఆనాడే చెక్కించారు.
- హరి హరులిద్దరూ కలిసి అయ్యప్పను పుట్టించారు.
- తెలుగు సంవత్సరాలు 60.నారదమహాముని ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు.వారే వీరు.
- పురాణాలు ఉపనిషత్తుల సారం తోటి మానవునిలో భగవంతుణ్ణి చూడటం.స్త్రీ పురుష లక్షణాలు రెండూ లేని తృతీయ ప్రకృతి జీవులు కూడా భగవత్ స్వరూపులే.
- కామసూత్రాలలో స్వలింగసంపర్కులు, లింగమార్పిడిదారులకు, క్లైబ్య, నపుంసక, షండ, స్వైరిణి, నస్త్రీయ, అరవాణి, జోగప్ప, సాఖీబేకీ, పేడి లాంటి పేర్లున్నాయి. వీరిని విటులు లైంగికంగా హింసించి శిక్షించేవారు. ఈ తృతీయపురుషుల్ని దేవుడి గుడుల్లో, ఉత్సవాలలో శుభసూచకంగా భావిస్తారు. వీళ్ళకు శపించే, వరమిచ్చే మహిమలున్నట్లు భావిస్తారు.
- అహం బ్రహ్మాస్మి ప్రకారం అందరూ పరబ్రహ్మలే గనుక వీళ్ళను వివక్షతో చూడకూడదు.తృతీయా ప్రకృతి జీవులను, స్వలింగసంపర్కులను కూడా మనతో సమానంగా గౌరవించాలి.
- ఆయుర్వేదం ప్రకారం గర్భధారణ జరిగిన మొదటి రెండు నెలల్లోనే పిండంలో తృతీయా ప్రకృతి లక్షణాలు జనిస్థాయి.
- కలియుగానికి సూచన స్వలింగ సంపర్కం కాదు.వాళ్ళను అవమానించటం హింసించటమే కలియుగానికి సూచన. వీళ్ళు కూడా దైవసేవకులే. ఆశ్రమాలలో ఉండవచ్చు. స్వలింగసంపర్కులు/వివాహులు కూడా ఆశ్రమవాసులై బ్రహ్మచర్యాన్ని పాటించి గొప్పవాళ్ళయ్యారు.
- జీవితాంతమూ బ్రహ్మచర్యాన్నీ పాటించటం కష్టమే.కానీ బ్రహ్మచర్యమూ, సర్వసంగపరిత్యాగమూ, భవబంధ విమోచనము, ముక్తి పొందటానికి మొదటి అవసరం. ఆధ్యాత్మికతలో ఏకపత్నీవ్రతానికి దక్కేది రెండవ స్థానమే. మొదటి స్థానం బ్రహ్మచర్యానిదే.
- అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీ కృష్ణుని వర్ణన చూడండి. కస్తూరీ తిలకం లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవ మౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం.. ఇలాంటి అలంకరణలేన్నో మన పురాతన పురాణాలలో కనుపిస్తాయి.
- దైవశక్తి తరతమ భేదాలు లేకుండా సకల చరాచర జగత్తు అంతా విస్తరించి ఉంది. జీవులైనా, నిర్జీవులైనా, చెట్టులో పుట్టలో, గట్టులో, పాములో, చివరకు పందిలో కూడా దేవుడున్నాడు. సర్వాంతర్యామి అయిన దేవుడే చేప, తాబేలు, పంది, సింహం, కుక్క, పాము అవతారాల్లో ఉన్నపుడు సాటి మనిషి అంటరాని వాడు ఎలా అవుతాడు?
క్రైస్తవం
[మార్చు]క్రైస్తవం పాపమును ద్వేషిస్తుంది కాని పాపిని ప్రేమిస్తుంది. "రొమా 1:26 అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్దమైన ధర్మమును అనుసరించిరి. రొమా 1:27 అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి. రొమా 1:28, వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను."
- మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి; పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి. (సంఖ్యా కాండము 31:17,18)
- ఇంచుమించు స్వలింగ సంపర్క స్థాయిలోకి వెళ్ళినట్లు మూడు జంటలను ఉదారవాద క్రైస్తవ పండితులు అనుమానిస్తారు:
- రూతు నయోమి--- రూతు ఆమెను హత్తుకొనెను. (“Ruth clave onto her." Ruth 1:14)
- దావీదు-యోనాతాను ----యోనాతాను హృదయము దావీదు హృదయముతోకలిసిపోయెను;యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. (1 సమూయేలు 18:1). యోనాతాను దావీదు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలా గుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. (The soul of Jonathan was knit with the soul of David, and Jonathan loved him as his own soul (1 Samuel 18:1).they kissed one another and wept with one another, until David exceeded (1 Samuel 20:41)
- దానియేలు అష్పెనాజు --- దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను ( God had brought Daniel into favor and tender love with Ashpenaz the prince of the eunuchs (Daniel 1:9)
- మెహూమాను బిజ్తా హర్బోనా బిగ్తా అబగ్తా జేతరు కర్కసు అనే ఏడుగురు నపుంసకులు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేసేవాళ్ళు.అందరిముందుకు వచ్చివిందులో తన అందాలను ఆరబోయటానికి నిరాకరించిన సౌందర్యవతి రాణి వష్తి .హేగే అనే నపుంసకుడు అంతఃపుర స్త్రీల కాపరి.బిగ్తాను తెరెషు అనే నపుంసకులు అహష్వేరోషును చంపటానికి ప్రయత్నిస్తారట (ఎస్తేరు1,2,6). వీళ్ళంతా పరిశుద్ధ గ్రంథాలలో ప్రసిద్ధిగాంచిన నపుంసకులు. వాళ్ళ సేవలను రాజులు బాగానే ఉపయోగించుకున్నారు. వ్యభిచారం చెయ్యని చెయ్యలేని నపుంసకుల్ని కూడా హీనంగా చూడటం, వారికి మానవహక్కులు లేకుండా చేయటం అన్యాయమనేదే వారి వాదన.నపుంసకులకు బైబిలు గానీ ఖురాను గానీ వ్యతిరేకం కాదు.స్వలింగ సంపర్కానికి మాత్రమే అవి వ్యతిరేకం.
- ఐతియొపీయుల రాణియైన కందాకే మంత్రి ధనాగార అధికారి అయిన నపుంసకుడు దైవారాధనకోసం యెరూషలేముకు వచ్చాడు.ఆరాధనకు, బాప్తిస్మానికి నపుంసకుడు అనర్హుడని వివక్ష చూపలేదు.పిలిప్పు నపుంసకుడికి బాప్తిస్మమిచ్చాడు. (అపో.కా.5:27-39)
- తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసి కొనిన నపుంసకులును గలరు. ఈ మాటను అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని యేసు వారితో చెప్పెను. (మత్తయి 19:12)
- జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగు బోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. (1 కోరింథీయులకు 6:9,10)
- ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్యచోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును, హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెను ( 1 తిమోతి1:9,10)
ఇస్లాం
[మార్చు]- మీరెంత అశ్లీలానికి పాల్పడుతున్నారు? స్త్రీలనువదిలి పురుషులవెంట పడతారే?సిగ్గువిడిచి పాడుపని చేస్తారే? (ఖురాన్ 29:28)
- మీ ప్రభువు మీకోసం సృష్టించిన మీ భార్యలను వదిలి సిగ్గుమాలి పురుషులదగ్గరకు వెళ్ళటం హద్దుమీరటమే (ఖురాన్ 26:166)
- మీరెలాంటి అశ్లీలచేష్టలకు పాల్పడు తున్నారు! మీకు పూర్వం ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి సిగ్గుమాలిన పనిచేస్తున్నారే!! మీరు కోర్కెల్ని తీర్చుకోవడానికి స్త్రీలను వదలి పురుషుల వెంటపడ్డారా? ఎంతసిగ్గుచేటు! మీరసలు హద్దుమీరిపోయారు (ఖురాన్7:80-81)
- ఆ తరువాత మాఆజ్ఞ వచ్చేసింది. అప్పుడు మేమా పట్టణాన్ని అమాంతం కుదిపేసి తల్లక్రిందులు చేశాం. ఆపై మండుతున్న మట్టిరాళ్ళు దాని మీద ఉధృతంగా కురిపించాము. అందులోని ప్రతి రాయీ నీ ప్రభువు దగ్గర గుర్తు వేయబడింది. ఇలాంటి శిక్ష దుర్మార్గ వైఖరి అవలంబించినవారికి ఎంతో దూరం లేదు. (ఖురాన్ 11:82-83)
- అతి ఘోరపాపాల్లో స్వలింగ సంపర్కం అనేది పదకొండవది.వ్యభిచారాన్నిబట్టి అల్లా ఎవరినీ నాశనం చేయలేదుగానీ స్వలింగసంపర్కుల్నిబట్టి సొదొమ గొమొర్రా పట్టణాలనే కాల్చివేశాడు.స్వలింగసంపర్కుల పాపాలను కడగటానికి ప్రపంచంలోని నీళ్ళన్నీ కూడా సరిపోవు.వాళ్ళు నరకంలోని అడుగుభాగానికి పోయి బయటకు రాలేరు.
- స్వలింగసంపర్కం, వ్యభిచారం ఈ రెండే జీవితంలోని 72 రకాల పాపాలకు కారణం ( హజరత్ ఇమామ్ అలి అర్రదా).
- బలవంతంగా తన బానిసపై స్వలింగ సంపర్కానికి పాల్పడిన యజమాని లూతు కాలంనాటి పాపిష్టి ప్రజలలో చేరిపోయినట్లు ఉమర్ ప్రకటించారు.
- పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు శృంగారానికి, సంభోగానికీ పాల్పడితే వ్యభిచారులతో సమానంగా శిక్షించాలి. స్వలింగసంపర్కులు రెండుసార్లు రాళ్ళతో కొట్టి చంపదగ్గ వారు. వారికి మరణశిక్ష విధించి శవాలను తగలబెట్టాలి. (అమీరుల్ మూమినీన్ అలి)
- మంచిచెడ్డల ఊహతెలిసిన అన్నాచెల్లెలు కూడా ఒకే మంచంమీద ఒకే దుప్పటికింద పడుకోకూడదు.
శాస్త్రవేత్తల అభిప్రాయం
[మార్చు]యూనివర్సిటీ ఆఫ్ కొలంబియాలో అధ్యాపకుడిగా పనిచేసిన బ్రూస్ బాగ్‌మిల్ బయోలాజికల్ ఎగ్జూబరెన్స్: యానిమల్ హోమోసెక్సువాలిటీ అండ్ నేచురల్ డైవర్సిటీ అనే పుస్తకంలో 450 రకాల పాలిచ్చే జీవులపైన, పక్షులపైన, కీటకాలపైన, జంతువులపైన శాస్త్రీయంగా పరిశోధనచేసి వాటిలోని స్వలింగ సంపర్క ధోరణులను, పుంసక మార్పిడి ధోరణులను (ట్రాన్స్‌జెండర్ బిహేవియర్) సవివరంగా చర్చించారు.
సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం
[మార్చు]బలాత్కారములేని స్వచ్ఛంద స్వలింగసంపర్కం కూడా సహజీవనం లాగానే నేరము కాదు, పాపము కాదు . 377 వ నిబంధనకు సవరణ కోర్టులు తేల్చాల్సిన అంశం కాదు. ఇది కీలకమైన సామాజికాంశం. దీనిపై పార్లమెంట్ చర్చించి, నిర్ణయంతీసుకోవాలి. నిబంధనను మార్చే అధికారం పార్లమెంట్‌కే ఉంది. కాబట్టి కేంద్రం ఇప్పటికైనా ఒక నిర్ణయానికి రావాలి. పార్లమెంట్‌లో చర్చించాలి. మనుషులు జంతువులకు భిన్నంగా ఇలా వుండాలి అనే కట్టుబాటు ఉంది.స్వలింగ సంపర్కాన్నే నేరంగా భావించాలా?లేక స్వలింగ వివాహాన్ని కూడానా? బహుభార్యత్వం, సహజీవనం, వ్యభిచారం, ఐచ్చిక శృంగారం పేరేదైతేనేం జరిగేది సంభోగమే. అయితే ఆ సంభోగమైనా సహజీవనమైనా పరపీడనలేని పద్ధతిలో మాత్రమే జరగాలి.నవీన కాలపు వైద్యులు వ్యభిచారం, అత్యాచారాలకు పాల్పడేదానికంటే కంటే హస్తప్రయోగమే మంచిదని సలహాలిస్తున్నారు.అత్యాచారాను ఆపటం కోసం హస్తప్రయోగాలను ప్రోత్సహిస్తున్నారు. అలాగే సమాజంలో చోటుచేసుకున్న వికృత పోకడలలో బహుభార్యత్వం, వ్యభిచారం, అత్యాచారం లాంటి కుళ్ళు కన్నా స్వలింగ సంపర్కం, సహజీవనం లాంటి పుచ్చు మెరుగు అనిపిస్తోంది. వాత్సాయన కాలం నుండి నేటి వరకు ఏ సమాజము కాని చట్టాలు కాని శృంగారం దంపతుల మధ్యనే వుండాలని పరిమితులు విధించలేదు.పరపరాగ సంపర్కాన్ని అరికట్టనూ లేదు.అది అరికట్టలేనిది.అయితే స్వేచ్ఛా సంభోగాలను అరికట్టాలనే ఉద్దేశంతో లౌకిక నాగరిక సమాజం నైతికత ముసుగును కప్పుకుంది అంతే. శృంగారం ఇరువురు వ్యక్తుల మధ్య అభీష్టానుసారం జరిగితే అభ్యంతరకరం కానవసరం లేదు. సామాజిక కట్టుబాట్లు ఎన్నో పెట్టినా వ్యభిచారం ఆగలేదు.వ్యభిచారం వేరు, అత్యాచారం వేరు .ఐచ్చిక శృంగారం వేరు . పురాణ ఇతిహాస కాలం నుండి నేటి చట్టాల వరకు వాటిలో ఐచ్ఛిక శృంగారానికి అభ్యంతరాలు లేవు. నాగరిక సమాజంలో నాటి జంతుసామ్య వ్యవస్థలో జీవించినట్లుగానే జీవిస్తామంటే కుదరదు.బయట పడాలి.చెప్పేదొకటి చేసేదోకటి ఉండకూడదు.సామాజిక జీవన వ్యవస్థలో మార్పులకు అనుగుణంగానే చట్టాలలో కూడా నైతికతను పటిష్ఠపరుచుకోవాలి. లైంగిక సంపర్కం కోసం పశువులా బలత్కరించడాన్ని నేరంగా పరిగణించాలి. లైంగిక సంపర్కం కోసం బలత్కరించడమంటే వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమే. లైంగిక సంపర్కం కోసం బలత్కరించేవారిని శిక్షించాలి. అదే సందర్భంలో పరస్పర ఇష్టపూర్వకంగా జరిగే లైంగిక సంపర్కాలను నేరంగా, తప్పుగా పరిగణించకూడదు.స్వలింగ సంపర్కం రోగమైతే వైద్యము చేసి నయం చేయాలి. నేరమైతే కోర్టుద్వారా శిక్షించాలి.రోగికైనా, ఖైదీకైనా ప్రాథమిక హక్కుల్నిమాత్రం ప్రసాదించాలి.వాటిని కాలరాయకూడదు.[16]
మనోతత్వశాస్త్రవేత్తల అభిప్రాయాలు
[మార్చు]ఆరు రకాల స్వలింగసంపర్కులు
[మార్చు]1. కోతి : స్త్రీ తత్వాన్ని కలిగి ఉండే పురుషులకు స్వలింగ సంపర్కుల భాషలో కోతి అంటారు. వీరు సంపర్కం సమయంలో చాలావరకూ స్త్రీ పాత్రనే పోషిస్తారు.
2. పంతి : పురుష స్వభావాన్ని కలిగి ఉండి, పురుషుడిలానే ఉంటూ కూడా మరో పురుషుడితో సంపర్కాన్ని కోరుకునే స్వభావాన్ని కలిగి ఉండే వ్యక్తులను ఎంఎస్ఎంల పరిభాషలో పంతి అంటారు. వీరు మరో పురుషుడితో సంపర్కం జరిపేటప్పుడు పురుషుడి స్థానాన్ని ఆక్రమిస్తారు.
3. డబుల్ డెక్కర్ : సమయానుకూలంగా, అవసరానికి అనుగుణంగా సంపర్కం సమయంలో స్త్రీలానూ, పురుషుడిలానూ వ్యవహరించగలిగే స్వభావం కలిగిన వ్యక్తులను డబుల్ డెక్కర్స్ (డీడీ) అంటారు.
4. ట్రాన్స్‌జెండర్ (నిర్వాణ్): పూర్తిగా స్త్రీ వేషధారణతో ఉంటూ, ఆ స్వభావాన్ని సంతరించుకుని ఇచ్ఛాపూర్వకంగా తమ జననాంగాన్ని తీసివేయించుకున్న వ్యక్తులను ట్రాన్స్‌జెండర్ (నిర్వాణ్ - టీజీ) అంటారు. (ముర్గీమాత బాక్స్ చూడండి)
5. ట్రాన్స్‌జెండర్ (ఆక్వా) : ఈ వ్యక్తులు వేషధారణలో, సంయోగ సమయంలోనూ స్త్రీలను పోలి ఉంటారు. అయితే వీరు తమ జననాంగాలను ఉంచుకుంటారు.
6. శివశక్తి/శివపార్వతి/జోగప్ప: వీరు తమను తాము దేవుళ్ళుగా భావించుకుంటారు. శివ, పార్వతి స్వభావాలను కలిగి ఉంటారు. అదే స్వభావం కలిగిన వారితో సంపర్కం పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలలో వీరు చాలా ఎక్కువమంది ఉన్నారని అంచనా.
ఆంధ్రప్రదేశ్ లో ఒక లెక్కప్రకారం వీరి సంఖ్య 75 వేలకు పైగా ఉంది. ఇది ఇక ప్రవర్తనా తీరు అనుకుంటే వీరి సంఖ్య సుమారు ఐదులక్షల వరకూ ఉండవచ్చని అనధికార అంచనా. నిన్నటివరకూ దీనిని ఒక మానసికమైన జబ్బుగా భావించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు కాదని తేల్చిచెప్పింది. ఎంఎస్ఎం అనేది కొత్తగా వచ్చింది కాదు... మన సమాజాలంత పాతది అని దీనిపై జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి.
అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఈ వివక్ష స్థాయి కొద్దిగా తక్కువగా ఉంది. అయితే అక్కడ కూడా వర్కింగ్‌ప్లేస్‌లలో, వైద్యసేవలను అందుకునే దగ్గర తీవ్రమైన వివక్షనే ఎదుర్కొంటున్నారు. ఇరాక్, నైజీరియా, కామెరూన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అనేక దేశాలలో స్వలింగ సంపర్క స్వభావాన్ని కలిగిన వ్యక్తులు ఇవాళ్టికీ జైళ్ళకు నెట్టబడుతున్నారు. కొన్ని సందర్భాలలో శిరచ్ఛేదనకు కూడా గురవుతున్నారు. అనేక దేశాలలో స్వలింగ సంపర్కం అన్న పదమే నిషిద్ధం (చట్టపరంగా), అయితే స్వలింగ సంపర్కం వంటి విషయాలపట్ల సహనం చూపే ఎంతో సహజ ధోరణులను ప్రదర్శించే ఇంగ్లండ్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలలోనూ, కఠినంగా వ్యవహరించే పోలండ్, ఇరాన్, నేపాల్ వంటి దేశాలలోనూ కూడా ఎంఎస్ఎంలు గుర్తింపుకోసం ప్రదర్శనలు, వివిధ పోరాట రూపాలను చేపడుతూనే ఉన్నారు.
ముర్గీమాత... హిజ్రాల దేవత ముర్గీమాత ఆలయం గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని బెచర్జీ పట్టణంలో ఉంది. అహ్మదాబాదుకు 110కి.మీ. దూరంలో ఉన్న ఈ గుడి 1857లో నిర్మితమయింది. చక్కటి రాతిచెక్కడాలతో అలంకృతమయిన ఈ గుడిని ప్రతి ఏడాది సుమారుగా 15 లక్షల మంది యాత్రికులు దర్శిస్తారు. హిజ్రాలకు ఈమె ఆరాధ్యదైవం. స్త్రీత్వం కారణంగా, పురుషాంగాన్ని కలిగి ఉండటాన్ని భరించలేని వ్యక్తులు తమ జననాంగాన్ని తీసివేసుకునే చోటు ఇది. ఇప్పుడు వైద్యులే శస్త్రచికిత్స చేస్తున్నారు.
వైద్యుల అభిప్రాయాలు
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]- హైదరాబాదులో ఎల్జీబీటీ సంస్కృతి
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్ 377
మూలాలు
[మార్చు]- ↑ "Definitions Related to Sexual Orientation and Gender Diversity in APA Documents" (PDF). అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. 2015. p. 6. Archived from the original (PDF) on 12 February 2020. Retrieved 6 February 2020.
Sexual orientation refers to the sex of those to whom one is sexually and romantically attracted. ... [It is] one's enduring sexual attraction to male partners, female partners, or both. Sexual orientation may be heterosexual, samesex (gay or lesbian), or bisexual. ... A person may be attracted to men, women, both, neither, or to people who are genderqueer, androgynous, or have other gender identities. Individuals may identify as lesbian, gay, heterosexual, bisexual, queer, pansexual, or asexual, among others. ... Categories of sexual orientation typically have included attraction to members of one's own sex (gay men or lesbians), attraction to members of the other sex (heterosexuals), and attraction to members of both sexes (bisexuals). While these categories continue to be widely used, research has suggested that sexual orientation does not always appear in such definable categories and instead occurs on a continuum .... Some people identify as pansexual or queer in terms of their sexual orientation, which means they define their sexual orientation outside of the gender binary of 'male' and 'female' only.
- ↑ ఎరిక్ B. షిరాయెవ్; డేవిడ్ A. లెవీ (2016). Cross-Cultural Psychology: Critical Thinking and Contemporary Applications, Sixth Edition. టేలర్ & ఫ్రాన్సిస్. p. 216. ISBN 978-1134871315.
Sexual orientation refers to romantic or sexual attraction to people of a specific sex or gender. ... Heterosexuality, along with bisexuality and homosexuality are at least three main categories of the continuum of sexual orientation. ... Homosexuality is a romantic or sexual attraction between persons of the same sex or gender.
- ↑ జేమ్స్ R. లెహ్మన్; క్రిస్టీన్ డియాజ్; హెన్రీ ఇఙ్; ఎలిజబెత్ M. పెట్టీ; మీనా తాటికుంట; క్రిస్టెన్ ఎక్స్‌ట్రాండ్, eds. (2019). The Equal Curriculum: The Student and Educator Guide to LGBTQ Health. స్ప్రింగర్ నేచర్. p. 5. ISBN 978-3030240257.
Homosexual, literally meaning "same sex", is used as an adjective to describe same-sex or same-gender attraction. ... The term introduces ambiguity because is often applied as an identity label to a person or group based on their behaviors, not because of self-identified sexual orientation or sexual desires. ... in addition to having potentially negative connotations, homosexual is unclear as to what group of people it describes...
- ↑ Roman Homosexuality By Craig Arthur Williams, p.60
- ↑ (Foucault 1986)
- ↑ Buxton, Richard (2004). "Same-Sex Eroticism". The Complete World of Greek Mythology. London: Thames and Hudson. pp. 174. ISBN 0500251215.
As scholars have increasingly come to recognize, the ancient Greek world did not know of the modern 'life-style' category-distinction between homosexuality and heterosexuality, according to which those terms are used to designate contrasting psychological or behavioral profiles.
- ↑ Hubbard Thomas K (22 September 2003). "Review of David M. Halperin, How to Do the History of Homosexuality.". en:Bryn Mawr Classical Review.
- ↑ 8.0 8.1 Boswell, John (1989). "Revolutions, Universals, and Sexual Categories" (PDF). In Duberman, Martin Bauml; Vicinus, Martha; Chauncey Jr., George (eds.). Hidden From History: Reclaiming the Gay and Lesbian Past. Penguin Books. pp. 17–36. S2CID 34904667. Archived from the original (PDF) on 4 March 2019.
- ↑ Norton, Rictor (2016). Myth of the Modern Homosexual. Bloomsbury Academic. ISBN 9781474286923. The author has made adapted and expanded portions of this book available online as A Critique of Social Constructionism and Postmodern Queer Theory.
- ↑ 10.0 10.1 10.2 "Delhi high court decriminalizes homosexuality". www.livemint.com. 2 July 2009. Retrieved 10 July 2018.
- ↑ 11.0 11.1 11.2 "Indian court decriminalises homosexuality in Delhi". the Guardian (in ఇంగ్లీష్). 2 July 2009. Retrieved 10 July 2018.
- ↑ 12.0 12.1 12.2 "Delhi High Court overturns ban on gay sex". IN (in Indian English). Archived from the original on 10 జూలై 2018. Retrieved 10 July 2018.
- ↑ "HC verdict makes India 127th country to legalise homosexuality (ndtv.com)" (in Indian English). Retrieved 16 August 2022.
- ↑ "Suresh Kumar Kaushal vs. Naz Foundation: A Critical Analysis". www.lawctopus.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-07-21. Retrieved 2022-02-01.
- ↑ "India Just Decriminalized Gay Sex". BuzzFeed News (in ఇంగ్లీష్). Retrieved 2018-09-06.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-25. Retrieved 2013-12-18.