శవాసనము
వికీపీడియా నుండి
శవాసనము (సంస్కృతం: शवसन) యోగాలో ఒక విధమైన ఆసనము. శరీరంలో ఎటువంటి కదలికలు లేకుండా శవాన్ని పోలి ఉండటం వల్ల ఈ ఆసనానికి శవాసనమని పేరువచ్చింది. దీనిని 'శాంతి ఆసనం', 'అమృతాసనం' అని కూడా అంటారు. దీనివల్ల శరీరంలో అలసట తగ్గిపోయి అన్ని అవయవాలు విశ్రాంతిని పొందుతాయి.
పద్ధతి [మార్చు]
- వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు విడివిడిగా దూరంగా ఉంచాలి.
- అరచేతులు పైకి ఉండాలి.
- శరీరంలోని ఇతర భాగాలను వదులుగా ఉంచాలి.
- శ్వాసను మెల్లగ పీల్చి వదలాలి. మెల్లగా పీల్చి, దానికి రెట్టింపు సమయం వదలటానికి తీసుకోవాలి. శ్వాస పీల్చినప్పుడు పొట్టను కూడా నింపి, వదలినప్పుడు పొట్టను, ఊపిరితిత్తులను ఖాళీచేయాలి. శ్వాసలో ఎటువంటి శబ్దం రాకూడదు.
- శ్వాసగతిపైననే మనస్సును కేంద్రీకరించాలి.
|
|||||||||||