వృక్షాసనం
వికీపీడియా నుండి
వృక్షాసనం యోగాలో ఒక విధమైన ఆసనం.
పద్ధతి [మార్చు]
- వృక్షాసనం చేసేటప్పుడు సమస్థితిలో నిలబడి, ఎడమ కాలును మోకాలు వద్ద వంచి, ఎడమ మడిమను మూలస్థానం వద్ద ఉంచుతూ, పాదాన్ని కుడి తొడకు అదిమి పట్టి ఉంచాలి. పాదము భూమికి లంబంగా, వ్రేళ్ళు నేలపైవైపు ఉండాలి, చేతులు నడుముపైన ఉంచాలి.
- గాలి పీలుస్తూ కుడికాలిని సమంగా నిలిపి రెండు చేతులు ప్రక్కలకు లాగుతూ భూమికి సమాంతరంగా అర చేతులు నేల వైపు చూపాలి.
- గాలి పీలుస్తూ రెండు చేతులూ తలపైకి తీసుకెళ్ళి అరచేతులను కలిపి శరీరం మొత్తాన్ని పైకి లాగాలి.
- గాలి వదులుతూ 2 రెండొవ స్థితిలోకి రావాలి.
- అలాగే మళ్ళీ గాలి వదులుతూ 1 మొదటి స్థితిలోకి రావాలి. తర్వాత సమస్థితిలోకి రావాలి.
లాభాలు [మార్చు]
కాలి కండరాలకు అధిక వ్యాయామం కల్గుతుంది. ఇలా చేసిన వ్యక్తికి తన శరీరం యొక్క సంతులున జ్ఞానం కల్గుతుందంటున్నారు యోగా నిపుణులు.
|
|||||||||||