శుశ్రుతుడు

వికీపీడియా నుండి

మూస:Infobox Medical Person

శుశ్రుతుడు

శుశ్రుతుడు (ఆంగ్లం :Sushruta) ఆయుర్వేదానికి చెందిన ఒక సర్జన్ మరియు అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశ్రుతుడు, వారణాసిలో జన్మించాడు.[1] ఇతని ప్రసిద్ధ గ్రంధం శుశ్రుత సంహితవైదిక సంస్కృతం లో వ్రాయబడినది.[1] ఈ శుశ్రుత-సంహితలో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి.[1] శుశ్రుత-సంహితలో 184 అధ్యాయాలు ఉన్నాయి; 1120 వ్యాధుల గురించి, 700 వైద్య మూలికల గురించి, 64 రసాయనాల గురించి, 57 జంతు సంబంధమైన ఔషధాల గురించి వివరాలు ఇవ్వబడ్డాయి.

శుశ్రుతుడు ప్లాస్టిక్ శస్త్రచికిత్సలు(plastic surgeries), కంటి శుక్లాల శస్త్రచికిత్సల(cataract surgeries) నే కాక, ఇతర వ్యాధులకు చికిత్సలను ఉటంకించాడు తన శుశ్రుత-సంహితలో. 1. హృత్శూల (Angina Pectoris) గురించి, మానవ శరీరంలోని రక్తప్రసరణ , రక్తనాళాల గురించి శుశ్రుతుడికి అవగాహన ఉండేది. 2.శుశ్రుతుడు డయాబెటిస్ (Diabetes) ను మధుమేహ వ్యాధి గా గుర్తించాడు. మధుమేహం ఊబకాయులలో, శ్రమించని వారిలో ఎక్కువగా వస్తుందనీ, దీనికి నివారణోపాయం వ్యాయామమని చెప్పాడు.


పాదపీఠికలు [మార్చు]

  1. 1.0 1.1 1.2 Dwivedi & Dwivedi (2007)

మూలాలు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=శుశ్రుతుడు&oldid=817280" నుండి వెలికితీశారు