మొదటి పేజీ

వికీపీడియా నుండి

వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 43,936 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

స్వాగతం
ఈ వారపు బొమ్మ
తక్కెడ

తక్కెడ (లేదా త్రాసు, తుల, తరాజు) అనేది సరుకుల బరువును తూచేందుకు లేదా నిర్ణయించేందుకు ఉపయోగించే సాధనం. ఒక సమాంతర దండం (కర్ర) మధ్య చేతిలో పట్టుకొనేందుకు వీలుగా ఒక తాడు ఉండి ఆ దండానికి రెండు చివరల తాళ్ళ సహాయంతో రెండు పళ్ళాలు వేళ్ళాడుతుంటాయి.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భాష మరియు సంస్కృతి
తెలుగు సినిమా
భారత దేశము మరియు ప్రపంచము
విజ్ఞానము మరియు సాంకేతికం
విశేష వ్యాసాలు
సహకారము
ఈ వారపు వ్యాసము


Parikrama.jpg

బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు.

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు. ఇంకా....పూర్తివ్యాసం: పాతవి

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి

అలెగ్జాండర్
  • ... ప్రాచీన భారతీయ రాజు పురుషోత్తముడు ప్రపంచ విజేతయైన అలెగ్జాండర్ నే మెప్పించాడనీ! (అలెగ్జాండర్ వ్యాసం(కుడివైపున బొమ్మ చూపబడినది))
  • ... విజయవాడ పట్టణములో గల ఇంద్రకీలాద్రి పర్వతముపై అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడనీ! (ఇంద్రకీలాద్రి పర్వతం వ్యాసం)
  • ... అటకామా ఎడారి ప్రాంతంలో వర్షపాతం దాదాపు శూన్యమనీ! (అటకామా ఎడారి వ్యాసం)
  • ... చీమలు కందిరీగల నుంచి పుట్టుకొచ్చాయనీ! (చీమ వ్యాసం)
  • ... సబితా ఇంద్రారెడ్డి భారతదేశంలోనే హోంశాఖా మంత్రియైన తొలి మహిళ అనీ! (సబితా ఇంద్రారెడ్డి వ్యాసం)
చరిత్రలో ఈ రోజు

నవంబర్ 10



భారతీయ భాషలలో వికీపీడియా

సోదర ప్రాజెక్టులు:
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి సహాయము చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు ఉపయోగిస్తారు.
పేజీకి సంభందించిన లింకులు