Jump to content

అనూప రాజ్యం

వికీపీడియా నుండి

అనూప అనేది ఇతిహాసమైన మహాభారతంలో ప్రస్తావించిన ఒక రాజ్యం. ఇది ప్రస్తుత మహారాష్ట్రలో ఉన్న విదర్భకు వాయవ్యంగా ఉంది. మద్ర, కాంభోజ వంటి పశ్చిమ రాజ్యాలకు చెందిన జాతుల వారు దీనిని స్థాపించారు.

మహాభారతంలో ప్రస్తావనలు

[మార్చు]

ప్రాచీన భారతదేశ (భారతవర్ష) రాజ్యంగా అనూప ప్రస్తావన

[మార్చు]

....ఉపవృత్తులు, అనూప వృత్తులు, సురాష్ట్రులు, కేకయులు; కుటులు, మాహేయులు, కక్షులు, సముద్రనిష్కుటులు; ఆంధ్రులు (6,9).

దక్షుని వంశంలో అనూప

[మార్చు]

దక్షుడు ఒక ప్రజాపతి (అనేక మంది సంతానాన్ని కలిగి, ఒక జాతికి మూలపురుషుడైనవాడు). ప్రధ అతని కుమార్తెలలో ఒకరు. ఆమెను మరీచి మహర్షి కుమారుడు కశ్యప మహర్షి వివాహం చేసుకున్నాడు. అనూప ఆమె కుమార్తెలలో ఒకరు. (1,65)

పశ్చిమానుపక పేరుతో రాజు

[మార్చు]

మృతపుడు అని పిలిచే అసురులలో శ్రేష్ఠుడు భూమిపై రాజై, పశ్చిమానుపక అనే పేరు పొందాడు.(1,67)

ధర్మరాజు సభలో అనూప రాజు

[మార్చు]

కేతుమతుడు, వసుదానుడు, వైదేహుడు, కృతక్షణుడు: గొప్ప బలం ఉన్న సుధర్ముడు, అనిరుద్ధుడు, శ్రుతాయువు; అజేయుడైన అనూప రాజు, అందమైన కర్మజిత్తు; శిశుపాలుడు అతని కుమారునితో పాటు కరూష రాజు; అజేయులైన వృష్ణి వంశ యువకులు, ఈ రాజులందరూ రాజధాని ఇంద్రప్రస్థంలో కొత్తగా నిర్మించిన యుధిష్ఠిరుని సభలో ఉన్నారు. (2,4)

కురుక్షేత్ర యుద్ధంలో అనూపులు

[మార్చు]

కురుక్షేత్ర యుద్ధం రెండవ రోజున పాండవుల క్రౌంచారుమ (పక్షి ఆకారం) సైనిక వ్యూహంలో దశార్ణులు, ప్రయాగులు, దాశేరకులు, అనూపకులు, కిరాతులు ఆ వ్యూహం మెడ భాగంలో మోహరించబడ్డారు. (6,50)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • కిసరి మోహన్ గంగూలీ, The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose, 1883–1896.

బాహ్య లింకులు

[మార్చు]