అల్లినగరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°11′20″N 79°00′43″E / 15.189°N 79.012°E / 15.189; 79.012Coordinates: 15°11′20″N 79°00′43″E / 15.189°N 79.012°E / 15.189; 79.012
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొమరోలు మండలం
విస్తీర్ణం
 • మొత్తం18.2 కి.మీ2 (7.0 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం2,127
 • సాంద్రత120/కి.మీ2 (300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి928
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08405 Edit this on Wikidata )
పిన్(PIN)523373 Edit this on Wikidata


అల్లినగరం, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523 373., ఎస్.టి.డి.కోడ్ = 08405.[2]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

రెడ్డిచెర్ల 3.2 కి.మీ, సూరావారిపల్లె 7.7 కి.మీ, పుల్లారెడ్డిపల్లె 8.9 కి.మీ, ఇడమకల్లు 10 కి.మీ, గడికోట 13.5 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

కొమరోలు 9.1 కి.మీ, [గిద్దలూరు (ప్రకాశం జిల్లా) |[గిద్దలూరు]]23.8 కి.మీ, చంద్రశేఖరపురం 29.5 కి.మీ, రాచెర్ల 30.6 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ వెంకటయ్య సర్పంచిగా ఎన్నికైనారు. [5]

2021 ఎన్నికల్లో బంగారు రత్నాలు సర్పంచిగా ఎన్నికయ్యారు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

అల్లినగరం పంచాయతీ పరిధిలోని యర్రగుంట్ల గ్రామంలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు రెండురోజులపాటు ఘనంగా నిర్వహించెదరు. [3]

శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం[మార్చు]

అల్లినగరం పంచాయతీ పరిధిలోని యర్రగుంట్ల గ్రామంలోని ఈ ఆలయంలో, శ్రీ సీతారాముల విగ్రహాలకు, 2017, మే-31వతేదీ గురువారం ఉదయం గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రికి ప్రదర్శించిన చిన్నమ్మ నాటకం ఆహుతులను ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమాలకు భక్తులు, గ్రామస్య్హులు అధికసంఖ్యలో విచ్చేసారు. [7]

మందలపాయ శ్రీ తిరుమలనాథస్వామివారి ఆలయం[మార్చు]

అల్లినగరం పంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డిపల్లెలో నెలకొన్న ఈ ఆలయ వార్షికొత్సవం సందర్భంగా, 2017, మార్చి-11వ తెదీ శనివారంనాడు స్వామివారికళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. సాయంత్రం కులుకు భజన, రాత్రికి చింతామణి నాటకం ఏర్పాటుచేసారు. తిమ్మారెడ్డిపల్లెకు చెందిన తిరుమలనాథ సేవాసమితి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత మజ్జిగ, మంచినీరు అందించారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ షేక్ షర్ఫుద్దీన్ కు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి రసాయనికశాస్త్రంలో డాక్టరేటు లభించింది. [4]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2, 127 - పురుషుల సంఖ్య 1, 103 - స్త్రీల సంఖ్య 1, 024 - గృహాల సంఖ్య 535;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2, 219.[3] ఇందులో పురుషుల సంఖ్య 1, 210, స్త్రీల సంఖ్య 1, 009, గ్రామంలో నివాస గృహాలు 445 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1, 820 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[3] ఈనాడు ప్రకాశం; 2014, ఫిబ్రవరి-21; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, నవంబరు-6; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2016, మే-8; 5వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-12; 4వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2017, జూన్-1; 5వపేజీ.