ఇడమకల్లు
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°16′52″N 78°59′28″E / 15.281°N 78.991°ECoordinates: 15°16′52″N 78°59′28″E / 15.281°N 78.991°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కొమరోలు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 25.32 కి.మీ2 (9.78 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 2,837 |
• సాంద్రత | 110/కి.మీ2 (290/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1063 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08405 ![]() |
పిన్(PIN) | 523373 ![]() |
ఇడమకల్లు, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[2].పిన్ కోడ్ నం. 523 369., ఎస్.టి.డి. కోడ్ = 08405.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
సూరావారిపల్లె 3.5 కి.మీ, పుల్లారెడ్డిపల్లె 4.6 కి.మీ, నల్లగుంట్ల 5.9 కి.మీ, రెడ్డిచెర్ల 7 కి.మీ, గాడికోట 7.9 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
కొమరోలు=3.9 కి.మీ, గిద్దలూరు=13.8 కి.మీ, రాచెర్ల=21.1 కి.మీ, బెస్తవారిపేట=34.3 కి.మీ.
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
ఇడమకల్లు గ్రామ సమీపంలో, ఇడమకల్లు - రెడ్డిచెర్ల, ప్రధాన రహదారిపై రు. 45 లక్షల వ్యయంతో ఒక వారధి నిర్మాణం జరుగుచున్నది. ఈ వారిధి పూర్తి అయినచో, నరసింహునిపల్లె, ఇడమకల్లు, లింగారెడ్డిపల్లె గ్రామాలకు, వర్షాకలంలో, రవాణా సౌకర్యం బాగా మెరుగవుతుంది.
[4]
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
గ్రామానికి సాగునీటి సౌకర్యం[మార్చు]
- కాలినర్సికుంట:- కొమరోలు మండలంలో తాటిచెర్ల - మైదుకూరు మార్గంలో, ఇడమకల్లు గ్రామ పరిధిలో, "కాలినర్సికుంట" అను ఒక కుంట ఉంది. 2010 లో ఈ కుంటలో గురుస్వామిరెడ్డి అను ఒక క్షేత్ర సహాయకుడు, ఉపాధిహామీ పథకం క్రింద, ఆరు లక్షల రూపాయలతో, పూడిక తీయించారు. ఈ పనుల వలన ఈ కుంటలో ఇప్పుడు నీరుచేరుచున్నది. పూర్తిస్థాయిలో నీరుచేరితే, రైతులు మెట్టపంటలకు స్వస్తి చెప్పి, వరిసాగు చేయగలరు. ఈ కుంటలోని నీటితో, ఇడమకల్లు గ్రామంతోపాటు, అయ్యవారిపల్లె, కత్తులవానిపల్లె గ్రామాల పశువులకు దాహార్తి గూడా తీరుచున్నది. [5]
- రావి చెరువు.
- కృష్ణంరాజు చెరువు.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి మూర్కా రాజేశ్వరి సర్పంచిగా ఎన్నికైనారు. [7]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, మార్చి-18, మంగళవారం నాడు, నవగ్రహ, సుబ్రహ్మణ్యస్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. రుద్ర, చండీ. వాస్తుహోమంతో వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు[మార్చు]
శ్రీ సలిజాముల వెంకటేశ్వర్:- ఈ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్, ఎం.బి.బి.ఎస్ చదివి, అనంతరం సివిల్స్ పరీక్షలు వ్రాసినారు. 2016, మే-10న ప్రకటించిన ఫలితాలలో వీరికి 216వ ర్యాంక్ వచ్చింది. వీరి తల్లి శ్రీమతి కాశమ్మ మాజీ జడ్.పి.టి.సి సభ్యురాలు. తండ్రి శ్రీ వెంకటయ్య, గ్రామ మాజీ సర్పంచ్ . [6]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,837 - పురుషుల సంఖ్య 1,375 - స్త్రీల సంఖ్య 1,462 - గృహాల సంఖ్య 779;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,928.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,452, మహిళల సంఖ్య 1,476, గ్రామంలో నివాసగృహాలు 718 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,532 హెక్టారులు.
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్‌బుక్.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-2; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, మార్చి-19; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014, డిసెంబరు-25; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, మే-7; 4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2016, మే-11; 2వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2017, జూన్-23; 4వపేజీ.