రాజుపాలెం (కొమరోలు)
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°16′01″N 79°00′00″E / 15.267°N 79°ECoordinates: 15°16′01″N 79°00′00″E / 15.267°N 79°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కొమరోలు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 16.76 కి.మీ2 (6.47 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 3,404 |
• సాంద్రత | 200/కి.మీ2 (530/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1033 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08405 ![]() |
పిన్(PIN) | 523373 ![]() |
రాజుపాలెం (కొమరోలు), ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[2]
సమీప పట్టణాలు[మార్చు]
గిద్దలూరు 16 కి.మీ,రాచెర్ల 21.6 కి.మీ,చంద్రశేఖరపురం 31.2 కి.మీ,బెస్తవారిపేట 32.9 కి.మీ.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- కె.జి.బి.వి.పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది కానీ సరైన సిబ్బంది లేరు
- అంగనవాడీ కేంద్రం.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాజు పాలెం గ్రామంలో స్టేట్ బ్యాంక్ అనేది అస్సలు లేదు
- ఈ గ్రామాన్ని రాజులు పరిపాలించారు అందుకనే ఈ గ్రామానికి రాజుపాలెం అనే పేరు వచ్చింది అయితే ఈ గ్రామంలో రాజుల కాలంలో కోట బురుజులు కూడా ఉంటాయని మనం చూశాము ఈ గ్రామంలో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఎన్నో సంవత్సరాల చరిత్ర గలిగిన 40 అడుగుల లోతు ఉంటుంది దేవుడి పుట్ట వేప చెట్టు మహిమలు కూడిన ఈ కోట బురుజు చెప్పుకోదగ్గ పేరుగాంచిన బురుజు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
రాజు పాలెం గ్రామంలో తాగడానికి కూడా వాటర్ లేని పరిస్థితి ఎదురుకుంటున్న సమస్యలు సరైన రోడ్డు మార్గాలు సరైన డ్రైనేజీ మార్గాలు కూడా లేవు పంచాయతీ ఆఫీసు కూడా సరిగా లేని పరిస్థితిలో అదేవిధంగా రాజు పాలెం గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు బాగుంటుంది
దశబంధం చెరువు[మార్చు]
గత సంవత్సరం, ప్రభుత్వం వారు, నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో పూడికతీత పనులు ప్రారంభించలేదు. ఈ సంవత్సరం గూడా ప్రభుత్వం చేపట్టకపోవడంతో, గ్రామస్థులే నీటి పారుదలశాఖ అధికారుల అనుమతితో, తమ స్వంత నిధులతో, జె.సి.బి.లతో, ఈ చెరువులో పూడికతీత పనులను ప్రారంభీంచారు. రైతులు ట్రాక్టర్లతో ఈ సారవంతమైన పూడికమట్టిని ట్రాక్టర్ల ద్వారా తమ పొలాలకు తరలించుకొని పోవుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటినిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలలకు ఎరువుల ఖర్చు గూడా గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [4]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి శిద్ధారెడ్డి లక్ష్మీదేవి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]
శ్రీ దుర్గాపరమేశ్వరీదేవి ఆలయం[మార్చు]
ఈ ఆలయంలో, 2013 అక్టోబరు 11 శుక్రవారన్నాడు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, సింహవాహన విగ్రహ, ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. [ఈనాడు ప్రకాశం 2013 అక్టోబరు 12. 5వ పేజీ] రాజు పాలెం గ్రామంలో 2018 శివ మాల ధరించిన వారు 11 మంది ధరించారు శివ మాల ధరించి శివుడి దర్శనం చేసుకున్న వాళ్లు ఎంతో గొప్పతనం శివాలయం చాలా పురాతనమైనది అదేవిధంగా శివాలయం వెనక భాగంలో ఒక పెద్ద రుక్షం ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది దానికి నెమలి గుండ్ల రంగస్వామి ఈగలు ఉన్నాయి చాలా ఈ చెట్టు అద్భుతమైన చెట్టు
శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]
రాజుపాలెం గ్రామం వెలుపల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల సమీపంలో ఈ ఆలయం ఉంది.
గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
ఈ ఊరు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. రాజుపాలెంలో ఎక్కువగా కూలి పనిచేసుకుంటూ జీవనం సాగించే వారు ఎక్కువగా ఉన్నారు
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామం, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం లోని గ్రామం.
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 3,404 - పురుషుల సంఖ్య 1,674 - స్త్రీల సంఖ్య 1,730 - గృహాల సంఖ్య 916;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,607.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,802, మహిళల సంఖ్య 1,805, గ్రామంలో నివాస గృహాలు 830 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,676 హెక్టారులు.
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం; 2014,అక్టోబరు-3; 5వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014,అక్టోబరు-30; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2016,ఏప్రిల్-7; 6వపేజీ.