రెడ్డిచెర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రెడ్డిచెర్ల
రెవిన్యూ గ్రామం
రెడ్డిచెర్ల is located in Andhra Pradesh
రెడ్డిచెర్ల
రెడ్డిచెర్ల
నిర్దేశాంకాలు: 15°12′N 79°00′E / 15.2°N 79°E / 15.2; 79Coordinates: 15°12′N 79°00′E / 15.2°N 79°E / 15.2; 79 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, మార్కాపురం రెవిన్యూ డివిజన్
మండలంకొమరోలు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,174 హె. (7,843 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం5,141
 • సాంద్రత160/కి.మీ2 (420/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523373 Edit this at Wikidata

రెడ్డిచెర్ల, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ చరిత్ర[మార్చు]

పూర్వము ఈ ఊరిని రెడ్డిరాజులు పాలించారు. గ్రామ సమీపములొ చెరువును నిర్మించారు. తర్వాత క్షత్రియ రాజులు వశపరఛుకున్నారు. రెడ్దిరాజులు నిర్మించిన చెరువు ఉండడం వల్ల ఈ ఊరికి రెడ్దిచెర్ల అనే పేరు వచ్చింది. గ్రామ లో సుశీలమ్మ గారు నిర్మించిన తిరుమలనాధస్వామి దేవాలయం ప్రసిద్ధిచెందినది. తర్వాత రామరాజు[జడ్జి] గారు పునర్నిమించారు. ఈ దేవాలయానికి అనేక ఎకరాల పొలము మాన్యము ఉన్నది. ఈ విషయాలను సేకరించినది "గొంగటి మల్లయ్య గారి కుమారుడు, వరదరాజు"[పరిజ్ఞానము మేరకు].

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

రెడ్దిరాజులు నిర్మించిన చెరువు కలిగి ఉండడం వల్ల ఈ ఊరికి "రెడ్దిచెర్ల" అనే పేరు వచ్చింది.

గ్రామ భౌగోళికం[మార్చు]

తూర్పున చెరువు, దక్షిణాన వలపరాయని కొండ, పడమర కనుమలు, ఉత్తరాన సారవంతమైన నల్లరేగడి పొలాలు ఉన్నాయి.

సమీప గ్రామాలు[మార్చు]

అల్లినగరం 3.2 కి.మీ,సూరావారిపల్లె 4.5 కి.మీ,పుల్లారెడ్డిపల్లె 6.9 కి.మీ,ఇడమకల్లు 7 కి.మీ,గాడికోట 10.6 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

కొమరోలు 6.9 కి.మీ,గిద్దలూరు 20.7 కి.మీ,రాచెర్ల 27.9 కి.మీ,చంద్రశేఖరపురం 31.6 కి.మీ.

సమీప గ్రామాలు[మార్చు]

మూలపల్లి,మల్లారెడ్డిపల్లి,పోసుపల్లి,పామూరుపల్లి, గోనెపల్లి,మిట్టమీదపల్లి,బ్రాహ్మణపల్లి,అల్లీనగరం,బావాపురం.

సమీప మండలాలు[మార్చు]

కొమరోలు,పోరుమామిళ్ళ[కడపజిల్లా],కలసపాడు[కడప],గిద్దలూరు.కొమరోలు,పోరుమామిళ్ళ[కడపజిల్లా],కలసపాడు[కడప],గిద్దలూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గిద్దలూరు నుండి ఆర్ టి సి వారి బస్ ఉ:6గం. మ:1:30 సా:4:15 రాత్రి:6:30, కొమరోలు నుండి ఆటో సౌకర్యము ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల కలదు.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామంలో హోమియో వైద్యశాల కలదు.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఎం.ఐ.ట్యాంక్ (ఊర చెరువు)

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ ఆర్.వెంకటేశ్వరరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. గ్రామంలో అచ్చమాంబ దేవాలయము, రామాలయము, సాయిబాబదేవాలయము, కొండపైన రామస్వామిసెల ఉన్నాయి.
  2. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [2]
  3. శ్రీ తిరుమలనాధస్వామి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జూన్-17, మంగళవారం నాదు, స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం విష్వక్సేన, గణపతి, స్వస్తిపుణ్యాహవచనం పూజలు నిర్వహించారు. తిరుమలనాధ, చంద్రమౌళీశ్వర, ఆంజనేయ విగ్రహాలకు, పంచామృతాభిషేకాలతోపాటు, సూర్య, గణపతి హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధానంగా ప్రత్తి,సజ్జ,పప్పుశెనగ, మొక్కజొన్న పంటలు పండిస్తారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం ప్రధాన వ్రుత్తిగా జీవిస్తారు.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

రెడ్దిచెర్ల వెంకమరాజు,రామరాజు,రామరాజు[జడ్జ్],సింహాద్రిరావు,గొంగటి[దుగ్గాని]మల్లయ్య,గొంగటి సురేష్ బాబు ముఖ్యులు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,141 - పురుషుల సంఖ్య 2,605 - స్త్రీల సంఖ్య 2,536 - గృహాల సంఖ్య 1,373

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,342.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,743, మహిళల సంఖ్య 2,599, గ్రామంలో నివాస గృహాలు 1,282 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3,174 హెక్టారులు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2014,మే-13; 5వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-18; 4వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-5; 6వపేజీ.