ఇర్కాన్ ఇంటర్నేషనల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇర్కాన్ ఇంటర్నేషనల్, లేదా ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON), రవాణా వసతుల కల్పనలో ప్రత్యేకత కలిగిన భారతీయ ఇంజనీరింగ్ & నిర్మాణ సంస్థ. భారతీయ కంపెనీల చట్టం 1956 ప్రకారం భారతీయ రైల్వేలు 1976 లో ఈ ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించింది. IRCON ను తొలుత ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌గా నమోదు చేసారు. ఇది పూర్తిగా భారతీయ రైల్వేల యాజమాన్యంలో ఉన్న సంస్థ. భారతదేశం లోను, విదేశాల లోనూ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం దీని ప్రాథమిక ధ్యేయం. ఇర్కాన్ అప్పటి నుండి ఇతర రవాణా వసతుల విభాగాల్లోకి కూడా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కార్యకలాపాల పరిధితో, 1995 అక్టోబరులో పేరును ఇండియన్ రైల్వే ఇంటర్నేషనల్ లిమిటెడ్‌గా మార్చుకుంది.

భారతదేశం లోను, విదేశాల లోనూ కష్టతరమైన భూభాగాల్లో సవాలుతో కూడిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టడానికి ఇర్కాన్ ప్రసిద్ధి చెందింది. ఇర్కాన్ భారతదేశంలో 1650 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను, ప్రపంచవ్యాప్తంగా 31 పైచిలుకు దేశాలలో 900 పైగా ప్రాజెక్టులను పూర్తి చేసింది.[1]

ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023 లో ఇర్కాన్ ఇంటర్నేషనల్‌కు 'నవరత్న' హోదా ఇచ్చింది.[2]

వ్యాపార రంగాలు

[మార్చు]

ప్రాధాన్యతా క్రమంలో కంపెనీ కృషి రైల్వేలు, హైవేలు EHT సబ్‌స్టేషన్ ఇంజనీరింగ్, నిర్మాణాల్లో ఉంది. రైల్వేలు (కొత్త రైల్వే లైన్లు, ఇప్పటికే ఉన్న లైన్ల పునరావాసం/మార్పిడి, స్టేషన్ భవనాలు, సౌకర్యాలు, వంతెనలు, సొరంగాలు, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, రైల్వే విద్యుదీకరణ, లోకోమోటివ్‌ల వెట్ లీజింగ్), హైవేలు, EHV సబ్‌-స్టేషన్ (ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం), మెట్రో రైలు వంటి ప్రాజెక్టులలో ఇర్కాన్‌కు నైపుణ్యం ఉంది.

భారతదేశంలో అత్యంత సవాలుగా ఉన్న భౌగోళిక భూభాగం గుండా వెళ్ళే 42.5 కిలోమీటర్ల కాట్రా-బనిహాల్ రైలుమార్గాన్ని నిర్మించడంలో IRCON పాలుపంచుకుంది. కొండచరియలు విరిగిపడటం, మెరుపువరదలు, శిధిలాల పతనం, గుల్ల నేలలు, అధిక మాస్ ఫెయిల్యూర్ ఈ ప్రాంతంలో సాధారణం. పనులు:- (I) టన్నెల్ T14/15 నిర్మాణం. (II) టన్నెల్ T48 (10.2kms) - భారతదేశపు 3వ అత్యంత పొడవైన రైల్వే సొరంగం. (III) టన్నెల్ T49 (12 కి.మీ) - భారతదేశపు అత్యంత పొడవైన రైల్వే సొరంగం. (IV) సంబర్ స్టేషన్ యార్డ్

సాధించిన మైలురాళ్ళు

[మార్చు]
  • వేసిన ట్రాక్ మొత్తం పొడవు = 2025.62 కి.మీ.
  • ట్రాక్ మొత్తం పొడవు (కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు) = 1174 కి.మీ

పనిచేసిన దేశాలు

[మార్చు]

వినియోగదారులు

[మార్చు]

అనుబంధ సంస్థలు

[మార్చు]

ఇర్కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & సర్వీసెస్ లిమిటెడ్

[మార్చు]

ఇర్కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & సర్వీసెస్ లిమిటెడ్ (IISL, పూర్తిగా ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ) 2009 సెప్టెంబరు 30 న కంపెనీల చట్టం 1956 కింద ఏర్పాటు చేసారు. 2009 నవంబర్ 10 న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం నుండి వ్యాపార ప్రారంభ ధృవీకరణ పత్రాన్ని పొందింది.

దాని ప్రధాన క్లయింట్లు:

ఇర్కాన్ PB టోల్‌వే లిమిటెడ్ (IPBTL, పూర్తిగా ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ) 2014 సెప్టెంబరులో కంపెనీల చట్టం, 2013 కింద ఏర్పాటైంది. 2014 అక్టోబరులో వ్యాపార ప్రారంభ ధృవీకరణ పత్రాన్ని పొందింది.

బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT) పద్ధతిలో ప్రాజెక్టులను చేపట్టడం కంపెనీ ఉద్దేశం. నేషనల్ హైవే అథారిటీ కోసం రాజస్థాన్ రాష్ట్రంలో ఫూలోడి, బికనీర్‌ల మధ్య రహదారి మౌలిక సదుపాయాలను నిర్మించడం.

ఇర్కాన్ శివపురి గుణ టోల్వే లిమిటెడ్

[మార్చు]

ఇర్కాన్ శివపురి గుణ టోల్‌వే లిమిటెడ్ (ISGTL, పూర్తిగా ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ) ను 2015 మేలో కంపెనీల చట్టం, 2013 కింద ఏర్పాటు చేసారు.

బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT) పద్ధతిలో ప్రాజెక్టులను చేపట్టడం కంపెనీ ఉద్దేశం. నేషనల్ హైవే అథారిటీ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివపురి, గుణల మధ్య రహదారి మౌలిక సదుపాయాలను నిర్మించడం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "About Us". Ircon International. Archived from the original on 26 July 2011. Retrieved 2018-02-08.
  2. Press Release, PIB. "IRCON granted Navratna status".