ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పుణ్యక్షేత్రాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాల జాబితా

జాబితా[మార్చు]

  1. అంతర్వేది - శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం - సఖినేటిపల్లి మండలంలో ఉంది. రాజోలు, పాలకొల్లు మీదుగా బస్సు సౌకర్యం ఉంది.
  2. అన్నవరం - శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం - శంఖవరం మండలంలో ఉంది. రాజమహేంద్రవరం - విశాఖపట్నం ప్రధాన రహదారి పై ఉంది. రైలు, రోడ్డు రవాణా సౌకర్యం ఉంది.
  1. అప్పనపల్లి - శ్రీ బాల బాలాజీ దేవస్థానం - మామిడికుదురు మండలంలో ఉంది. రాజోల నుండి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం - రాజోలు రహదారి పై పాశర్లపూడి వద్ద దిగి వెళ్ళవచ్చు.
  2. అయినవిల్లి - శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం - అయినవిల్లి మండలంలో ఉంది. కొత్తపేట - ముక్తేశ్వరం రోడ్ లో ఉంది. రావులపాలెం, ముమ్మిడివరం ల నుండి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం - ముక్తేశ్వరం రహదారిలో ముక్తేశ్వరం వద్ద దిగి వెళ్ళవచ్చు.
  3. ఏడిద - ఏడిద సంగమేశ్వర స్వామి ఆలయం రాజమండ్రికి 25 కి.మీ.ల దూరంలో ఉంది. బస్సు సౌకర్యం ఉంది.
  4. బిక్కవోలు - శ్రీ గోలింగేశ్వర ఆలయం, ఏకశిలా గణపతి ఆలయం - బిక్కవోలు మండలంలో ఉంది. రాజమహేంద్రవరం - సామర్లకోట కెనాల్ రోడ్ పై ఉంది. రైలు, బస్సు సౌకర్యం ఉంది. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం నుండి బస్సు సౌకర్యం ఉంది.
  5. చదలవాడ తిరుపతి - శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానం. - పెద్దాపురం మండలంలో ఉంది. కాకినాడ నుండి ప్రత్తిపాడు వెళ్ళే దారిలో దివిలి వద్ద దిగి వెళ్ళవచ్చును.
  6. చొల్లంగి - శ్రీ సోమేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి దేవస్థానములు - తాళ్ళరేవు మండలంలో ఉంది. కాకినాడ నుండి యానాం వెళ్ళే దారిలో ఉంది.
  7. ధవళేశ్వరం - శ్రీ జనార్ధన స్వామి దేవస్థానం, (నవ జనార్ధన ఆలయములో ఒకటి), శివాలయం, ముత్యాలమ్మ తల్లి దేవస్థానం. రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో ఉంది. జిల్లాలో సుమారు అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం ఉంది. సమీపంలో రాజమహేంద్రవరం వరకు రైలు సౌకర్యం ఉంది.
  8. ద్రాక్షారామం - పంచారామాలలో ఒకటైన శ్రీ భీమేశ్వరాలయం ఉంది. - రామచంద్రపురం మండలంలో ఉంది. రామచంద్రపురం - యానాం దారిలో, కాకినాడ - కోటిపల్లి దారిలో ఉంది. కాకినాడ, రాజమహేంద్రవరం, యానం, రామచంద్రపురం, కోటిపల్లి ల నుండి బస్సు సౌకర్యం ఉంది. కాకినాడ - కోటిపల్లి రైలు మార్గం కూడా ఉంది. కాని ప్రస్తుతం నడువట్లేదు.
  9. ద్వారపూడి - శ్రీ ద్వారపూడి ధర్మశాస్తా అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. మండపేట మండలంలో ఉంది. రాజమహేంద్రవరం - సామర్లకోట కెనాల్ రోడ్ పై ఉంది. రైలు, బస్సు సౌకర్యం ఉంది. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం నుండి బస్సు సౌకర్యం ఉంది.
  10. గండి పోచమ్మ తల్లి గుడి - దేవీపట్నం మండలంలో గొందూరు గ్రామంలో గోదావరి తీరమునందు ఉంది. రాజమహేంద్రవరం నుండి సీతానగరం మీదుగా మార్గం ఉంది. ఆటో సౌకర్యం ఉంది.
  11. గొల్లల మామిడాడ - శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవాలయం, కోదండ రామాలయం ఉన్నాయి. పెదపూడి మండలంలో ఉంది. రామచంద్రపురం - బిక్కవోలు మార్గంలో ఉంది. రామచంద్రపురం, బిక్కవోలు నుండి బస్సు సౌకర్యం, కాకినాడ నుండి ఆటో సౌకర్యం ఉంది.
  12. కడలి - కపోతేశ్వర స్వామి దేవస్థానం - రాజోలు మండలంలో ఉంది. తాటిపాక, రాజోల నుండి మార్గం ఉంది.
  13. కాండ్రకోట - నూకాలమ్మ తల్లి ఆలయం. పెద్దాపురం మండలంలో ఉంది. పెద్దాపురం నుండి మార్గము ఉంది.
  14. కొత్తలంక - శ్రీ వలీబాబా దర్గా - ముమ్మిడివరం మండలంలో ఉంది. అమలాపురం సమీపంలో ముమ్మిడివరం నుండి మార్గం ఉంది.
  15. కోరుకొండ - శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం. కోరుకొండ మండలంలో ఉంది. రాజమహేంద్రవరం - గోకవరం ప్రధాన రహదారి పై కోరుకొండ ఉంది. బస్సు సౌకర్యం ఉంది.
  16. కోటిపల్లి - శ్రీ రాజరాజేశ్వరి సహిత సోమేశ్వరస్వామివారు - పామర్రు మండలంలో ఉంది. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం నుండి బస్సు సౌకర్యం ఉంది. యానాం - జొన్నాడ ల నుండి రోడ్డు మార్గం కలదు, ముక్తేశ్వరం నుండి రేవు దాటి రావచ్చు.
  17. మందపల్లి - శ్రీ మందేశ్వర (శనీశ్వర) స్వామి దేవాలయం - కొత్తపేట మండలం - రావులపాలెం - కొత్తపేట మార్గంలో ఉంది.
  18. మట్లపాలెం - శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం - తాళ్ళరేవు మండలం, కాకినాడ - యానాం మార్గం కాకినాడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు సౌకర్యం ఉంది.
  19. ముక్తేశ్వరం - శ్రీ క్షణ ముక్తేశ్వర ఆలయం - అయినవిల్లి మండలం. అమలాపురం, రావులపాలెం, ముమ్మిడివరం నుండి బస్సు సౌకర్యం కలదు, కోటిపల్లి నుండి రేవు దాటి రావచ్చును.
  20. ముమ్మిడివరం - శ్రీ బాలయోగీశ్వర స్వామి ఆలయం - ముమ్మిడివరం మండలం - అమలాపురం సమీపంలో ముమ్మిడివరం నుండి మార్గం ఉంది.
  21. మురమళ్ళ - శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర ఆలయం - ఐ పోలవరం మండలం - అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ నుండి బస్సు సౌకర్యం ఉంది.
  22. పిఠాపురం - పాదగయ క్షేత్రం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ఆలయం - పిఠాపురం మండలం - కాకినాడ - కత్తిపూడి ప్రధాన రహదారి పై కలదు, రైలు, బస్సు సౌకర్యం ఉంది.
  23. పెద్దాపురం - మరిడమ్మ తల్లి ఆలయం, పాండవుల మెట్ట - పెద్దాపురం మండలం, బస్సు సౌకర్యం కలదు, సమీపంలో సామర్లకోట నుండి రైల్ సౌకర్యం ఉంది.
  24. రంప - పురాతన శివాలయం ఉంది. రంపచోడవరం మండలం, రంపచోడవరం వద్ద బస్సు దిగి సుమారు 5 కిలోమీటర్లు వెళ్ళవలెను.
  25. రాజమహేంద్రవరం - శ్రీ వేణుగోపాలస్వామి, ఉమా మార్కండేయ స్వామి దేవాలయములు, ఇస్కాన్ దేవాలయం, కోటిలింగాల రేవు ప్రధాన ఆలయములు, అన్ని ప్రాంతముల నుండి రైల్, బస్సు, విమాన సౌకర్యం ఉంది.
  26. ర్యాలి - జగన్మోహినీ కేశవ స్వామి దేవాలయం - ఆత్రేయపురం మండలంలో ఉంది. రావులపాలెం వరకు బస్సులో వెళ్లి అక్కడినుండి ఆటో లలో వెళ్ళవచ్చు.
  27. సామర్లకోట - పంచారామాలలో ఒకటైన కుమారా భీమారామము - బస్సు, రైలు సౌకర్యం ఉంది.
  28. తలుపులమ్మ లోవ - తలుపులమ్మ తల్లి దేవాలయం - తుని మండలం, తుని వరకు బస్సు, రైలు సౌకర్యం ఉంది. అచ్చటినుండి సుమారు 10 కిలోమీటర్లు వెళ్ళవలెను.
  29. తంటికొండ - శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము - గోకవరం మండలం - గోకవరం వరకు బస్సు సౌకర్యం ఉంది. అచ్చటి నుండి సుమారు 8 కిలోమీటర్లు వెళ్ళవలెను.
  30. వాడపల్లి - శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము - ఆత్రేయపురం మండలం, లోల్ల గ్రామం వద్ద బస్సు దిగి వెళ్ళవలెను, రావులపాలెం, లోల్ల నుండి ఆటో సౌకర్యం ఉంది.[1]

మూలాలు[మార్చు]

  1. "తీర్థయాత్ర పర్యాటక రంగం | Welcome to East Godavari District Web Portal | India". Archived from the original on 2019-10-08. Retrieved 2020-02-18.