ఎస్. ఎమ్. శ్రీనాగేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జనరల్ సత్యవంత్ మల్లన్న శ్రీనగేష్
ఎస్. ఎమ్. శ్రీనాగేష్


చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్

వ్యక్తిగత వివరాలు

జననం (1903-05-11)1903 మే 11
కొల్హాపూరు, మహారాష్ట్ర
మరణం 1977 డిసెంబరు 27(1977-12-27) (వయసు 74)
జీవిత భాగస్వామి రాజకుమారీ కొచ్చర్

జనరల్ సత్యవంత్ మల్లన్న శ్రీనగేష్ (సత్యవంత్ శ్రీనగులే మల్లన్న కూడా వ్యవహరించబడ్డాడు) (మే 11 1903 – 27 డిసెంబరు 1977) 1955, మే 14 నుండి 1957, మే 7 వరకు భారతీయ సైనికదళం యొక్క మూడవ సైన్యాధ్యక్షుడుగా పనిచేసిన భారతీయ సైనికాధికారి.[1][2] సైన్యం నుండి విరమణానంతరం 1957 నుండి 1959 వరకు హైదరాబాదులోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీకి ప్రిన్సిపాలుగా పనిచేశాడు. ఆ తర్వాత 1959 నుండి 1962 వరకు అస్సాం గవర్నరుగా, 1962 నుండి 1964 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా, 1964 నుండి 1965 వరకు మైసూరు రాష్ట్ర గవర్నరుగా పనిచేశాడు.

ప్రారంభజీవితం, విద్య

[మార్చు]

శ్రీనగేష్, మహారాష్ట్రలోని కొల్హాపూరులో బ్రహ్మసమాజ ప్రభావితులైన కన్నడిగ లింగాయత్ కుటుంబంలో పెద్దకొడుకుగా జన్మించాడు.[3] ఈయన తండ్రి డాక్టర్ సత్యవంత్ మల్లన్న, హైదరాబాదు ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క వ్యక్తిగత వైద్యుడు. 1903లో కొల్హాపూరులో జన్మించిన శ్రీనగేష్ ఇంగ్లాండులోని వెస్ట్ బక్‌లాండ్ పాఠశాలలో చదివి, 1921లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరాడు. ఈయన ఇంగ్లాండులోని సాంథర్స్ట్ రాయల్ మిలటరీ కళాశాలకు ఎంపికైన తొలి భారతీయ బృందాల్లో ఒకడు. 1923లో భారతీయ సైనికదళంలో చేరిన అత్యుత్తమ వ్యక్తిగా క్వెట్టా కప్‌నుగెలుచుకున్నాడు.

1939 వరకు మిలటరీ జీవితం

[మార్చు]

సాంథర్స్ట్ లో శిక్షణ తర్వాత, 1923 ఆగష్టు 29న అన్‌అటాచ్డ్ జాబితాలో సెకండ్ లెఫ్టెనెంట్‌గా ఇండియన్ ఆర్మీకి నియమించబడ్డాడు.[4] ఒక సంవత్సరం పాటు నార్త్ స్టాఫర్డ్‌షైర్ రెజిమెంటులోని మొదటి బెటాలియన్ తో తప్పనిసరి శిక్షణను పొంది, 1924 అక్టోబరు 14న ఇండియన్ అర్మీలో భర్తీ అయ్యి, 1వ మద్రాసు పయనీర్స్ రెజిమెంటులోని రెండవ బెటాలియన్ కు నియమించబడ్డాడు. ఈ సైనిక బృందం తుదకు రద్దుచేయబడే వరకు ప్రధానంగా బర్మాలో పనిచేసింది.[5]

శ్రీనగేష్ 1925 నవంబరు 30న లెఫ్టెనెంటుగా, 1932, ఆగష్టు 30న కెప్టెనుగా పదవోన్నతి పొందాడు.[6][7] 1933లో 19వ హైదరాబాదు రెజిమెంటుకు చెందిన నాలుగవ బెటాలియన్లో చేరి, దాని అడ్జుటంట్‌గా 1935 డిసెంబరు నుండి 1939 డిసెంబరు వరకు సింగపూర్లో పనిచేశాడు.[8] 1939 డిసెంబర్లో డెహ్రాడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి శిక్షకుడిగా నియమించబడ్డాడు.

ద్వితీయాంకం

[మార్చు]

శ్రీనగేష్ 1940, ఆగష్టు 30న మేజరుగా పదవోన్నతి పొందాడు.[9] 1942, డిసెంబరు 17 నుండి 1945, ఆగష్టు 28 వరకు, 6/19వ హైదరాబాదు రెజిమెంటు (ఇప్పుడు 6వ కుమావూ రెజిమెంట్) కు కమాండింగ్ అధికారిగా కూడా పనిచేశాడు. 1942 డిసెంబర్లో ఆపద్ధర్మ లెఫ్టెనెంట్ కల్నల్ గానూ, ఆ తర్వాత 1943, మార్చి 27న తాత్కాళిక లెఫ్టెనెంట్ కల్నల్ గానూ పదవోన్నతి పొందాడు.[10] 1945 ఆగష్టులో బర్మాలో ఉన్న 19వ ఇండియన్ (డాగ్గర్) విభాగానికి చెందిన 64వ భారతీయ ఇన్ఫెంట్రీ బ్రిగేడుకు బ్రిగేడు కమాండరుగా అధికారికంగా నియమించబడ్డాడు. 1945 నవంబర్లో ఇండియన్ మిలటరీ మిషన్‌కు ఉపాధ్యక్షుడిగా, కల్నల్ హోదాలో జర్మనీకి వెళ్ళటానికి ఎంపికచేయబడ్డాడు.[11] ఈ పదవిలో ఉండగా, ఈయన ఆర్ధిక సలహాదారు, సహాయకుడిగా కూడా పనిచేస్తూ, జర్మనీలో భారతీయుల బాగోగులను చూసేందుకు, జాడతెలియని యుద్ధ ఖైదీలను వెతికేందుకు కృషిచేశాడు.

1946, అక్టోబరు 2న ఆగ్రాలోని కుమావూ రెజిమెంటల్ కేంద్రానికి తొలి భారతీయ కమాండెంటుగా నియమించబడి, ఆ పదవిలో 1946, డిసెంబరు 12 దాకా కొనసాగాడు. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధానంతర జపాన్లో బ్రిటీషు కామన్‌వెల్త్ ఆక్యుపేషన్ ఫోర్స్ యొక్క 268వ ఇన్‌ఫెంట్రీకి నాయకత్వం వహించడానికి ఎంపిక చేయబడి, ఆ పదవిలో 1947 దాకా ఉన్నాడు. 1947లో బర్మాలోని ప్రసిద్ధ లుషాయ్ బ్రిగేడుకు బ్రిగేడు కమాండరుగా కూడా ఉన్నాడు.

జపాన్ నుండి తిరిగివచ్చిన తర్వాత ఈయన మేజర్ జనరల్‌గా పదవోన్నతి పొంది, మద్రాసు ప్రాంతానికి కమాండింగ్ జనరల్ అఫీసరుగా నియమించబడ్డాడు. 1948 జనవరి నుండి ఆగష్టు వరకు ఆర్మీ కేంద్రకార్యాలయంలో అడ్జుటెంట్ జనరల్‌గా పనిచేశాడు. ఈయన 5వ కార్ప్స్ ( ఆ తర్వాత 15వ కార్ప్స్ గా పేరు మార్చబడింది) కూడా కమాండంటుగా ఉన్నాడు. 1947-48 భారత పాక్ యుద్ధ సమయంలో ఈయన జమ్మూ కాశ్మీరులో అన్ని దళాలకు సేనాధిపతిగా ఉన్నాడు. ఈ బాధ్యతను 1949, జనవరి 1న సీజ్‌ఫైరు దాకా నిర్వహించాడు. 1950లో లెఫ్టెనెంటు జనరల్ గా పదవోన్నతి పొందాడు. 1949, జనవరి 15న జీ.ఓ.సి-ఇన్-సి పశ్చిమ కమాండుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత జీ.ఓ.సి-ఇన్-సి దక్షిణ కమాండుకు నియమించబడి, ఆ పదవిలో 1955, మే 14న, ఆర్మీ చీఫ్‌గా నియమించేబడేదాకా కొనసాగాడు.

34 యేళ్ళ మిలటరీ సేవ తర్వాత జనరల్ శ్రీనగేష్ 1957, మే 7 న పదవీ విరమణ పొందాడు. ఆ వెనువెంటనే 1957 నుండి 1959 వరకు ఈయన హైదరాబాదులోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీకి ప్రిన్సిపాలుగా కూడా పనిచేశాడు. 1959, అక్టోబరు 14 నుండి 1960, నవంబరు 12 వరకు, మరలా 1961, జనవరి నుండి 1962, సెప్టెంబరు 7 వరకు అస్సాం గవర్నరుగా పనిచేశాడు. ఈయన 1962, సెప్టెంబరు 8 నుండి 1964, మే 4 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగానూ, ఆ తర్వాత 1964 మే 4 నుండి 1965 ఏప్రిల్ 2 వరకు మైసూరు గవర్నరుగా పనిచేశాడు.

ఈయన 1977, డిసెంబరు 27న మరణించాడు. ఈయనకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు .

సత్కారాలు ,  అలంకరణలు

[మార్చు]
మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt
మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt మూస:Ribbon devices/alt
General Service Medal 1947
Indian Independence Medal
1939–1945 Star
Burma Star
War Medal 1939–1945
India Service Medal

రెఫెరెన్సులు

[మార్చు]
 • Issar, Satish K. (2009). General S. M. Srinagesh, New Delhi: Vision Books, ISBN 81-7094-741-381-7094-741-3

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. http://www.munzinger.de/search/portrait/Satyavant+Mallannah+Shrinagesh/0/6655.html
 2. http://www.tribuneindia.com/2009/20090621/spectrum/book1.htm
 3. "S. M. Shrinagesh". Udayavaani. Archived from the original on 22 జనవరి 2016. Retrieved 20 January 2016.
 4. "No. 32858". The London Gazette. 31 August 1923. p. 5911.
 5. "No. 33018". The London Gazette. 6 February 1925. p. 858.
 6. "No. 33124". The London Gazette. 15 January 1926. p. 374.
 7. "No. 33871". The London Gazette. 7 October 1932. p. 6337.
 8. October 1939 & April 1940 Indian Army Lists
 9. "No. 34993". The London Gazette. 15 November 1940. p. 6570.
 10. Indian Army List for October 1945 (Part I). Government of India Press. 1945. pp. 137A.
 11. Indian Army List for April 1946 (Part 2). Government of India Press. 1946. p. 1688.