కల్లూరు రెవెన్యూ డివిజను
కల్లూరు రెవెన్యూ డివిజను | |
|---|---|
| కల్లూరులో మెయిన్ రోడ్ కల్లూరులో మెయిన్ రోడ్ | |
![]() | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | ఖమ్మం |
కల్లూరు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. ఖమ్మం జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కల్లూరు పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం, సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]
పరిపాలన
[మార్చు]కల్లూరు డివిజనులోని మండలాలు:[5]
| క్ర.సం | కల్లూరు రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
|---|---|---|
| 1 | సత్తుపల్లి మండలం | 16 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
| 2 | వేంసూరు మండలం | 14 రెవెన్యూ గ్రామాలు |
| 3 | పెనుబల్లి మండలం | 21 రెవెన్యూ గ్రామాలు |
| 4 | కల్లూరు మండలం | 23 రెవెన్యూ గ్రామాలు |
| 5 | తల్లాడ మండలం | 19 రెవెన్యూ గ్రామాలు |
| 6 | ఏనుకూరు మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-06-23.
- ↑ "Khammam Revenue Division". www.khammam.telangana.gov.in. Archived from the original on 2021-05-21. Retrieved 2022-06-23.
- ↑ "List of Revenue Divisions, Mandals in Khammam District". www.teachersbadi.in. Archived from the original on 2021-05-15. Retrieved 2022-06-23.
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2022-06-23.
