కుకు కోహ్లీ
కుకు కోహ్లీ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | అవతార్ కోహ్లీ, సందేశ్ కోహ్లీ |
వృత్తి | దర్శకుడు, ఎడిటర్, స్క్రీన్ ప్లే రచయిత |
జీవిత భాగస్వామి | అరుణా ఇరానీ |
బంధువులు | ఆది ఇరానీ (బావమరిది) ఫిరోజ్ ఇరానీ (బావమరిది) |
కుకు కోహ్లీ (అవతార్ కోహ్లీ ) హిందీ సినిమా దర్శకుడు, ఎడిటర్, స్క్రీన్ ప్లే రచయిత[1] ఫూల్ ఔర్ కాంటే సినిమాలో అజయ్ దేవగన్‌కి బాలీవుడ్‌లో తన మొదటి బ్రేక్ ఇచ్చాడు.
జననం
[మార్చు]ఇతడు పాకిస్తాన్ లోని పెషావర్‌లో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]తొలిరోజుల్లో చాలా సంవత్సరాలపాటు రాజ్ కపూర్ వద్ద పనిచేసి, సినిమాలు తీయడంలో నైపుణ్యాలను నేర్చుకున్నాడు.[2] సన్నీ డియోల్, అమృతా సింగ్‌ల లాంచ్ ప్యాడ్ అయిన బేతాబ్ సినిమాకు రెండవ యూనిట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ సినిమా గోల్డెన్ జూబ్లీగా నిలిచి వాళ్ళిద్దరికి స్టార్‌డమ్ వచ్చింది. తరువాత సన్నీ డియోల్, డింపుల్ కపాడియాతో అర్జున్ అనే సిల్వర్ జూబ్లీ సినిమాలో కోహ్లి స్వయంగా చిత్రీకరించిన ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు ఇప్పటివరకు చిత్రీకరించిన అత్యుత్తమ సన్నివేశాలలో ఒకటిగా ప్రశంసించబడ్డాయి.
తర్వాత 1991లో ఫూల్ ఔర్ కాంటే సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా డైమండ్ జూబ్లీ హోదాను సాధించడంతోపాటు అజయ్ దేవగన్‌ను దేశంలోని అత్యంత డిమాండ్ ఉన్న స్టార్‌లలో ఒకరిగా చేసింది. దీని తరువాత 1991లో ధర్మేంద్ర నటించిన కోహ్రామ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. 1994లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ , కరిష్మా కపూర్, నగ్మా నటించిన సుహాగ్ సినిమా మళ్ళీ గోల్డెన్ జూబ్లీగా నిలిచింది.
1995లో అజయ్ దేవగన్, టబు నటించిన హకీకత్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు విజయవంతమైంది. ఈ సినిమా ఫిలింఫేర్ అవార్డులకు ఉత్తమ దర్శకుడితో సహా 7 విభాగాలలో నామినేట్ చేయబడింది, ఆ సంవత్సరపు ఉత్తమ దర్శకుడిగా కూడా కోహ్లి స్క్రీన్ అవార్డ్స్‌కు ఎంపికయ్యాడు. 1999లో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాలతో జుల్మీ సినిమా తీశాడు. ఈ సినిమా కూడా అన్ని చోట్ల విజయవంతమయింది. 1999లో గోవింద ద్విపాత్రాభినయంలో ఇతడు తీసిన అనారి నెం.1 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. 2002లో అతడు తీసిన యే దిల్ ఆషికానా సినిమాతో మ్యూజిక్ మ్యాస్ట్రోలు నదీమ్-శ్రవణ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. 2004లో అర్జన్ బజ్వా - కంచి కౌల్ నటించిన వో తేరా నామ్ థా ఇతడు దర్శకత్వం వహించిన చివరి సినిమా.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1990లో నటి అరుణా ఇరానీతో వివాహం జరిగింది. ఇది అతడి రెండవ వివాహం.
సినిమాలు
[మార్చు]దర్శకత్వం
[మార్చు]- ఫూల్ ఔర్ కాంటే (1991)
- కోహ్రామ్ (1991)
- సుహాగ్ (1994)
- హకీకత్ (1995)
- అనారీ నం.1 (1999)
- జుల్మీ (1999)
- యే దిల్ ఆషికానా (2002)
- వో తేరా నామ్ థా (2004)
మూలాలు
[మార్చు]- ↑ "Kuku Kohli". Bollywood Hungama. Archived from the original on 19 February 2015. Retrieved 2023-07-17.
- ↑ "New Talent, Old Virture". The Hindu. 2004-02-05. Archived from the original on 1 May 2004. Retrieved 2023-07-17.