కొడంగల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కోడంగల్
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో కోడంగల్ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో కోడంగల్ మండలం యొక్క స్థానము
కోడంగల్ is located in Telangana
కోడంగల్
తెలంగాణ పటములో కోడంగల్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°06′25″N 77°37′37″E / 17.107°N 77.627°E / 17.107; 77.627
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము కోడంగల్
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 53,673
 - పురుషులు 26,545
 - స్త్రీలు 27,128
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.15%
 - పురుషులు 58.77%
 - స్త్రీలు 33.34%
పిన్ కోడ్ 509338

కోడంగల్, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల ఒక గ్రామము. పిన్ కోడ్: 509338. కోడంగల్ గ్రామము కర్ణాటక సరిహద్దులో ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్ రాష్ట్ర రహదారి ఈ పట్టణం నుంచే వెళ్తుంది. హైదరాబాదు నుంచి నైరుతి వైపున100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ఉత్తరాన రంగారెడ్డి జిల్లా సరిహద్దును కల్గిఉంది. తాండూర్ పట్టణం ఇక్కడి నుంచి 17 కిలో మీటర్ల దూరాన ఉంది.

భౌగోళికం[మార్చు]

ఈ మండలము మహబూబ్ నగర్ జిల్లాలో వాయువ్యం వైపున ఉంది. ఈ మండలానికి ఉత్తరాన రంగారెడ్డి జిల్లా, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రము, తూర్పున బొంరాస్‌పేట మండలము, దక్షిణమున దౌలతాబాదు మండలాలు ఉన్నాయి. కోడంగల్ 17° 6' ఉత్తర అక్షాంశము మరియు 77° 37' తూర్పు రేఖాంశం మీదుగా ఉంది.

దర్శనీయ స్థలాలు[మార్చు]

కోడంగల్ పట్టణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది. పట్టణం నడిబొడ్డున కల ఈ దేవాలయంనకు ప్రతి సంవత్సరం జాతర కూడా జర్గుతుంది. మండలములోనే కాకుండా 15 మండలాలు కల నారాయణపేట డివిజన్‌లోనే ఈ దేవస్థానం పేరుగాంచింది. ఏటా నిర్వహించే జాతర సమయంలో పరిసర ప్రాంతాలనుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా మరియు కర్ణాటకలోని పలు ప్రాంతాలనుంచి ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కొడంగల్ పట్టణంలో నాలుగువందల సంవత్సరాల పూర్వపు మసీదు కూడా ఉంది.[1]

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 53542. ఇందులో పురుషుల సంఖ్య 26550, స్త్రీల సంఖ్య 26992. అక్షరాస్యుల సంఖ్య 25669.[2]

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

పశుసంపద[మార్చు]

2007 నాటి పశుగణన ప్రకారం మండలంలో 13వేల గొర్రెలు, 11 వేల మేకలు, 2400 పందులు, 1700 కుక్కలు, 25వేల కోళ్ళు, 5700 దున్నపోతులు ఉన్నాయి.

విద్యాసంస్థలు[మార్చు]

కోడంగల్‌లో 1969-70లో స్థాపించబడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. 2008-09 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం నూతనంగా డిగ్రీకళాశాలకు అనుమతి ఇచ్చింది. నారాయణ పేట రెవెన్యూ డివిజన్‌లోనే ఇది మొట్టమొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఇదివరకు జూనియర్ కళాశాల పూర్తయిన విద్యార్థులు డిగ్రీ అభ్యసన కొరకు రంగారెడ్డి జిల్లా తాండూరుకు వెళ్ళవలసి ఉండేది.

  • మండలంలోని ప్రాథమిక పాఠశాలలు: 46.
  • మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలలు : 15.
  • మండలంలోని ఉన్నత పాఠశాలలు: 11.

బ్యాంకులు[మార్చు]

]

చరిత్ర[మార్చు]

పూర్వం ఈ ప్రాంతము కర్ణాటక రాష్ట్రములోని గుల్బర్గా జిల్లాలో భాగంగా ఉండేది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలుగు మాట్లాడే ప్రాంతాలు తెలంగాణలో భాగమైనాయి. అప్పటినుంచి ఈ ప్రాంతము మహబూబ్ నగర్ జిల్లాలో తాలుకాగా కొనసాగింది. 1986లో మండలాల వ్యవస్థ ప్రకారం ఇది ప్రత్యేకంగా మండలంగా ఏర్పడి కొనసాగుతోంది.

కొడంగల్ నామం[మార్చు]

కోతులు అధికంగా ఉండుట వలన ఈ పట్టణానికి కొడంగల్ పేరు వచ్చినదని పూర్వికుల అభిప్రాయముంది. ఇక్కడి స్థానికులు కోతులను కొడంగి అని పిలుస్తారు. కొడంగి పేరు మీదుగా కొడంగల్ పేరు వచ్చినట్లు స్థానికులు నమ్ముతారు. కొడంగల్ నామం రావడానికి కచ్చితమైన ఆధారం లేనప్పటికినీ ఒక బలమైన విశ్వాసం మాత్రం ఇక్కడి ప్రజలలో ఉంది. ఈ పీరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. కన్నడ భాషలో నల్ల బండలను కర్రఖల్లు అంటారు. ఇక్కడ నల్ల బండలు బాగా లభిస్తుండటంతో ఈ ప్రాంతాన్ని కర్రఖల్లు అని పిలిచేవారని అది కాస్త కొడంగల్ గా మారిందని కూడా చెబుతారు,

రవాణా సౌకర్యాలు[మార్చు]

కోడంగల్ బస్ స్టేషను

కోడంగల్‌కు రైలు సౌకర్యం లేకున్ననూ రోడ్డు సౌకర్యం బాగుగా ఉంది. హైదరాబాదు-బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారి కోడంగల్ గుండా వెళుతుంది. అంతేకాకుండా మహబూబ్ నగర్ - తాండూరు రహదారి కూడా ఈ కూడలి గుండానే వెళుతుంది. కోడంగల్‌కు సమీపంలోని రైల్వేస్టేషను తాండూరు రైల్వేస్టేషను.

గ్రామ పంచాయతి[మార్చు]

కొడంగల్ గ్రామ పాలన గ్రామ పంచాయతి (మేజర్)చే నిర్వహించబడుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని 23 మేజర్ గ్రామ పంచాయతీలలో ఇది ఒకటి. 1964లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం ఇది మేజర్ గ్రామ పంచాయతిగా ఏర్పడింది. అంతకు పూర్వం ఇది పురపాలకసంఘంగా కొనసాగిననూ తగినంత జనాభా లేనందున గ్రామ పంచాయతీగా ప్రకటించారు. దివంగత నందారం వెంకటయ్య ఈ గ్రామ పంచాయతీకి తొలి సర్పంచుగా పనిచేశాడు. తదనంతరం ఇతడు రెండు సార్లు కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. కోడంగల్ నియోజకవర్గం నుండి 5 సార్లు విజయం సాధించిన గురునాథ్ రెడ్డి కొడంగల్ పురపాలక సంఘం ఉన్న సమయంలో కౌన్సిలర్‌గా పనిచేశాడు.

వ్యవసాయం, నీటిపారుదల[మార్చు]

మండలంలో అత్యధికంగా పండించే పంటలు కందులు, వరి, జొన్నలు, పెసర్లు. మండలం మొత్తంలో 5 చిన్ననీటిపారుదల వ్యవస్థల కింద 804 హెక్టార్ల భూమి సాగు అవుతుంది. మండలంలో సాధారణ వర్షపాతం 729 మిమీ [3] 2007-08లో అత్యధికంగా 1297 మిమీ వర్షపాతం కురిసింది.

ఇతర వివారాలు[మార్చు]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

  1. The Imperial Gazetteer of India: Karāchi to Kotāyam By Great Britain. Commonwealth Office
  2. Census of India 2011, Provisional Population Totas, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No 125
  3. Handbook of Statistics, Mahabubnagar Dist, 2009"https://te.wikipedia.org/w/index.php?title=కొడంగల్&oldid=2124201" నుండి వెలికితీశారు