కోఫీ అన్నన్
1938, ఏప్రిల్ 8 న ఘనా లోని కుమాసిలో జన్మించిన కోఫి అన్నన్ (Kofi Atta Annan) ఐక్యరాజ్య సమితి యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి. ఇతను ఐక్య రాజ్య సమితికి 7 వ ప్రధాన కార్యదర్శి. ఆఫ్రికా ఖండం నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. రెండు సార్లు ఎన్నికై 1997, జనవరి 1 నుంచి పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగినాడు. 2001లో ఇతడికి నోబెల్ శాంతి బహమతి లభించింది.
ఘనా లోని కుమాసిలో జన్మించిన ఇతడు ఉన్నత విద్య అమెరికాలో అభ్యసించాడు. 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. 1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమతిలో ప్రవేశించాడు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ నుంచి బాధ్యతలు చేపట్టినాడు. 5 సంవత్సరాల పదవీ కాలం అనంతరం రెండో పర్యాయం మళ్ళీ ఎన్నికై 2002 నుంచి మరో ఐదేళ్ళు పనిచేసి, బాన్ కి మూన్కు కి అధికారం అప్పగించాడు.
కుటుంబం
[మార్చు]అన్నన్ కవల పిల్లల్లో ఒకడు. ఇది ఘనా దేశపు సంస్కృతిలో చాలా విశేషంగా చెప్పుకుంటారు. ఆయన కవల సహోదరియైన ఎఫువా అట్టా 1991 లో మరణించింది. అట్టా అంటే ఘనా భాషలో కవలలు అని అర్థం. ఘనా సంస్కృతి ప్రకారం మొదటి పేరైన కోఫీ వారు పుట్టిన రోజును సూచిస్తుంది. కోఫీ అనే మొదటిపేరు కలవారంతా శుక్రవారం పుట్టినట్లు లెక్క. ఆయన పేరును చాలామంది అన్నన్ అని వ్యవహరిస్తారు కానీ ఆయన మాత్రం యానన్ అని పలుకుతాడు.
అన్నన్ కుటుంబమంతా ఆ దేశపు ఉన్నత వర్గానికి చెందినది. ఆయన తాతలిద్దరూ, మామగారు కూడా వారి తెగకు నాయకులు. అన్నన్ స్వీడన్కు చెందిన నానె మరియా అన్నన్ అనే లాయర్ ను వివాహమాడాడు. అంతకు మునుపు నైజీరియాకు చెందిన టిటీ అలాకిజా అనే మహిళను వివాహం తరువాత ఇద్దరు పిల్లలు కలిగారు. తరువాత ఆమెతో 1970లలో విడాకులు తీసుకున్నాడు.
బిరుదులు
[మార్చు]- 2001లో ఐక్యరాజ్యసమితితో కలిసి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది.
- 2003లో ఇందిరా గాంధీ శాంతి బహుమతి లభించింది.
- 2007లో బ్రిటిష్ రాణి నుంచి నైట్‌హుడ్ బిరుదు లభించింది.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శులు
- AC with 15 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- నోబెల్ బహుమతి గ్రహీతలు
- నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు
- ఘనా వ్యక్తులు
- 1938 జననాలు
- ప్రపంచ ప్రసిద్ధులు
- జీవిస్తున్న ప్రజలు
- ఇందిరా గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు