గురుగుబెల్లి యతిరాజులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురుగుబెల్లి యతిరాజులు

గురుగుబెల్లి యతిరాజులు (ఆంగ్లం:Gurugubelli Yethirajulu) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

గురుగుబెల్లి యతిరాజులు శ్రీకాకుళం జిల్లా లోని ఎచ్చెర్ల మండలానికి చెందిన ఫరీదుపేట గ్రామంలో జూలై 1 1947 న జన్మించారు. ఆయన కింతలి గ్రామంలో విద్యాభ్యాసం చేసారు. శ్రీకాకుళం పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాఅలలో బి.ఎస్సీ చేసారు. ఆయన విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో మొదటి శ్రేణిలోఉత్తీర్ణులై బంగాతు పతకాన్ని పొందారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ చేసారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి రాజ్యాంగ న్యాయం లో ఎస్.ఎస్.ఎం చేసారు. హైదరాబాదు లోని ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి పి.హెచ్.డి చేసారు. ఆయన డిసెంబర్ 31 1973ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదయ్యారు. ఆయన శ్రీకాకుళం నకు చెందిన ప్రముఖ న్యాయవాది పి.ఎల్.ఎన్.శర్మ వద్ద జూనియర్ గా పనిచేసాడు. ఆయన జనవరి 21 1977 నుండి స్వంతంగా ప్రాక్టీసు మొదలుపెట్టి ఫిబ్రవరి 10 1986 వరకు కొనసాగారు. ఆయన డైరక్టు రిక్రూట్‌మెంటులో జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమింపబడ్డారు. ఆయన కడప లోని రెండవ అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. తరువాత కడపలో మొదటి అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జిగానూ, రాజమండ్రిలో జిల్లా, సెషన్స్ జడ్జిగానూ పనిచేసారు. తరువాత వరంగల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ చైర్మన్ గానూ, వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగానూ, సి.బి.ఐ కేసులలో ప్రత్యేక జడ్జిగానూ, మెట్రొపాలిటన్ సెషన్స్ జడ్జిగానూ, ఎ.పి.జుడిసియల్ అకాడమీ డైరక్తరుగానూ, హైదరాబాదులోని సివిల్ కొర్టులో ఛీఫ్ జడ్జిగానూ తన సేవలనందించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాదు లోని హైకోర్టులో రిజిస్టారు జనరల్ గా పనిచేసారు. ఆయన 2001 డిసెంబర్ 13 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ లో అడిషనల్ జడ్జిగ నియమితులయ్యారు. 2003 మార్చి 6 నుండి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2009 జనవరి 31 నుండి హైదరాబాదులోని ఎ.పి.ఎడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.[2]

పురస్కారాలు[మార్చు]

ఆయనకు లా, జస్టిస్ రంగంలో విశేష సేవలంచించినందులకు గాను 2009లో "స్వర్ణకంకణం, విశాలల్ భారతి గౌరవ సత్కారం"ను న్యూఢిల్లీ లోని ఢిల్లీ తెలుగు అకాడమీ వారు అందజేసారు.

మూలాలు[మార్చు]

  1. "HON'BLE Justice DR. Gurugubelli Yethirajulu". Archived from the original on 2016-09-14. Retrieved 2016-11-20.
  2. "HON'BLE SRI JUSTICE DR.GURUGUBELLI YETHIRAJULU (2009-2014)". Archived from the original on 2016-06-12. Retrieved 2016-11-20.

ఇతర లింకులు[మార్చు]