Jump to content

గొల్లపాలెం (కృత్తివెన్ను)

వికీపీడియా నుండి

గొల్లపాలెం, కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం కొమాళ్ళపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక చిన్న గ్రామం.

గొల్లపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కృతివెన్ను
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ ప్రముఖులు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన బోయిన లక్ష్మణరాజు, విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నారు. ఇతను 2012వ సంవత్సరంలో ఉత్తమ ఉద్యోగిగా ఎంపికచేసి, కేంద్రమంత్రి చేతులమీదుగా పురస్కారాన్ని అందజేసినారు. [1]

గ్రామ విశేషాలు

[మార్చు]

80 కుటుంబాలు, 350 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో, కొంతమంది కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, పైకివచ్చి, మన రాష్ట్రంలోనేగాక, ఇతర రాష్ట్రాలలో గూడా ఉద్యోగాలు చేస్తున్నారు. వీరందరూ కలిసి తాము పుట్టిపెరిగిన గ్రామాన్ని అభివృద్ధిచేయాలనే ఆలోచనతో, 2014,ఫిబ్రవరి-1వ తేదీనాడు "శ్రీ కృష్ణ యాదవ సంక్షేమ సంఘం" అను సంఘాన్ని స్థాపించి, గ్రామాభివృద్ధికి పాటుపడుచున్నారు. వీరు ప్రతి నెలా కొంత నగదును గ్రామానికి పంపుచూ, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుచున్నారు. [1]

గొల్లపాలెం కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలంలో ఉన్న ఒక ద్వీపం. ఈ ద్వీపంలో చినగొల్లపాలెం, పెద్ద గొల్లపాలెం అను రెండు ఊళ్ళు ఉన్నాయి. ఈ ద్వీపంలో కొబ్బరి, సర్వీ, చేపలు విరివిగా లభిస్తాయి. ఈ ద్వీపం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం రేవుకి ఆనుకుని ఉంది. కొబ్బరి చెట్లు, సర్వీ చెట్లతో ఉండే ఆ ద్వీపంలో సముద్రతీరం గుంటలతో నిండి ఉంటుంది. అందువల్ల ఈ ద్వీపం పర్యాటకులకు అనువైన స్థలం కాదు. కనుక ఈ ద్వీపం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందలేదు. బంగాళా ఖాతంలో ఉన్న ఈ ద్వీపానికి చేరాలంటే పడవలో వెళ్ళాలి. ఈ ద్వీపంలో సముద్రపు రొయ్యలు, పీతలు, సందువా, కోణం, వంజరం, పండుగప్ప, సొరచేపలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు వంటివి దొరుకుతాయి.ఇక్కడ సుమారు 15000 వేల జనాభా ఉన్నారు.

పెద గొల్లపాలెం బీచ్ మాఘపౌర్ణమి సందర్భంగా 2017, ఫిబ్రవరి-10వతేదీ శుక్రవారంనాడు భక్తులతో కిటకిటలాడినది. సముద్రస్నానాలు చేయడానికి వచ్చినవారితో నిండిపోయింది. నిడమర్రు పంచాయతీ పరిధిలోని ఈ బీచ్‌లో, తెల్లవారుఝాము నుండియే భక్తులు సముద్రస్నాలకు పోటెత్తినారు. ఐదు రోజుల క్రితం నిడమర్రు గ్రామస్థులకు సముద్రపు వేట వలలలో శ్రీ సీతారాములు, ఆంజనేయ విగ్రహాలు దొరకటంతో వాట్ని ముస్తాబు చేసి ఈ సందర్భంగా సాగర తీరంలో ఉంచారు. సముద్రస్నాలా అనంతరం భక్తులంతా శ్రీ సీతారాముల విగ్రహాలకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. [2]

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

సింగరాయపాలెం, అల్లూరునుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 79 కి.మీ

మూలాలు

[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2015,మే-27; 8వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2017,ఫిబ్రవరి-11; 13వపేజీ.