చినగొల్లపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చినగొల్లపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కృతివెన్ను
ప్రభుత్వము
 - సర్పంచి జడ్డు వడ్డికాసులు
జనాభా (2011)
 - మొత్తం 8,138
 - పురుషులు 4,079
 - స్త్రీలు 4,059
 - గృహాల సంఖ్య 2,357
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్

చినగొల్లపాలెం, కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

1970 వరకూ చినగొల్లపాలెం మూడువైపులా నీరు, ఒకవైపు నేల ఉన్న ద్వీపకల్పంగా ఉండేది. 1974-75 మధ్యకాలంలో నేలవున్న వైపు కూడా ఏటిని తవ్వడంతో ఇది దీవిలా మారిపోయింది. పూర్వం ఈ గ్రామం పడతడిక గ్రామపంచాయితీకి శివారు గ్రామంగా ఉండేది. 1995 నుంచి మేజర్ పంచాయితీగా కొనసాగుతోంది. గతంలో మల్లేశ్వరం నియోజకవర్గంలో భాగంగా ఉన్న గ్రామం ప్రస్తుతం పెడన శాసనసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[1]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామం పూర్తిపేరు - "చిన్నగొల్లపాలెం దీవి". ఈ ప్రాంతంలో మొదట గొర్రెలను మేపుతూ యాదవులు (గొల్లలు) స్థిరపడడంతో ఆ విషయాన్ని సూచిస్తూ చినగొల్లపాలెం అనే పేరు ఏర్పడింది.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 5 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మొగల్తూరు, భీమవరం, పెడన, నర్సాపూర్

సమీప మండలాలు[మార్చు]

కృతివెన్ను, భీమవరం, కల్ల, నర్సాపూర్

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

THEY HAVE ONLY TWO GOVT HIGH SCHOOLS, THREE PUBLIC SCHOOLS.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

 1. ఉప్పుటేరు మధ్యలో లంక గ్రామం ఇది. ఇక్కడే ఉప్పుటేరు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ ఉప్పుటేరు మీద వంతెన కట్టిన తర్వాత మచిలీపట్నానికీ, భీమవరానికీ వెళ్ళటానికి మార్గం సుగమం అయ్యింది.
 2. మానవకల్పిత దీవియైన ఈ ప్రాంతంతో 1975 నుంచి నలభై ఏళ్లపాటుగా రోడ్డు రవాణా తెగిపోయింది. 2014-15లో నిర్మించిన రోడ్లు, వంతెనలతో రోడ్డు రవాణా సౌకర్యం మళ్లీ ఏర్పడింది. 22 కోట్ల రూపాయలతో పడతడిక నుంచి గ్రామానికి ఏర్పడిన ఈ వంతెన వల్ల కృష్ణాజిల్లాకు చెందిన పొరుగు ప్రాంతాలతో రోడ్డు రవాణా సంబంధాలు ఏర్పడ్డాయి. చినగొల్లపాలెం-మొగల్తూరు నడుమ 23 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న వంతెన పూర్తైతే పశ్చిమగోదావరి జిల్లా ప్రాంతాలకు కూడా రాకపోకలు సాగుతున్నాయి.[1]

భీమవరం, జక్కారం నుండి, కైకలూరు ల నుండి బస్సు, ఆటోల సౌకర్యం ఉంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. ఈ వూరివారయిన శ్రీ కొప్పినీడి హనుమంతరావు (దీవిరాజు) గారు బీ.యస్.సీ. (ఎగ్రికల్చర్) చదివి ఆర్.టీ.సీ.లో డిపో మేనేజరుగా ఉద్యోగం వస్తే కాదని వ్యవసాయంపై మక్కువతో గ్రామంలోనే ఉండి 1982, 1996, 2006 లలో సర్పంచిగా పనిచేశారు. చిన్నగొల్లపాలెందీవికి మౌలిక వసతులు కల్పించటంలో ఎనలేని కృషి చేశారు. మండలంలో ఎక్కువ సార్లు సర్పంచిగా ఎన్నికైనది వీరే. ఒక్కసారి మాత్రం ఉప సర్పంచిగా చేశారు.[3]
 2. ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో జడ్డు వడ్డికాసులు సర్పంచిగా ఎన్నికైనారు.[4] [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ఈ దీవి పర్యాటకపరంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. సముద్రతీరం వెంబడి కొబ్బరితోటలు, సరుగుడు తోటలు, ఇసుక మేటలు, పక్కన రోడ్డు మార్గం వంటివన్నీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ గ్రామానికి కల్పిస్తున్నాయి. చినగొల్లపాలెంలోని రోడ్డుమార్గాలు రెండువైపులా ఉన్న ఉప్పుటేరు, ఆ ఏరు పొడవునా ఏర్పడిన మొగలి పొదలు వాటి వద్దకు కాలానుగుణంగా వలసవచ్చే విదేశీ పక్షులు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. ఈ దీవి మొత్తం ప్రకృతి అందాలతో పులకింపజేస్తుంది. ఈ గ్రామంలోని బీచ్‌ల అందాల వల్ల ఆంధ్రా గోవాగా చినగొల్లపాలెంకు పేరువచ్చింది.[1]

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ఈ గ్రామానికి చెందిన రేవు ముత్యలరావు, సివిల్ సర్వీసెస్ లో మంచి ర్యాంకు పొంది ఈ గ్రామాన్ని వార్తలోకి తెచ్చాడు.[5]

 • రేవు ముత్యాలరాజు: ఐండియన్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాపర్ గా నిలిచి ప్రస్తుతం ఐ.ఎ.ఎస్. అధికారిగా పనిచేస్తున్నారు.
 • పులవర్తి రామాంజనేయులు: రాజకీయ నాయకుడు, భీమవరం మాజీ శాసన సభ్యులు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ పరింకాయల ఏడుకొండలు, ప్రస్తుతం, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లో జె.ఈ.గా పనిచేస్తున్నారు. వీరు 2014 స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షలలో, అఖిల భారత స్థాయిలో, 169వ స్థానం సంపాదించి, జె.ఈ.గా ఎంపికైనారు. వీరు ముందుగా ప్రిలింస్ లోనూ, ఆ తరువాత మెయిన్స్ లోనూ ఉత్తీర్ణత సాధించి, ఇటీవల నిర్వహించిన ఇంటర్ వ్యూలో ఎంపికై 169వ ర్యాంక్ సాధించారు. [6]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,138 - పురుషుల సంఖ్య 4,079 - స్త్రీల సంఖ్య 4,059 - గృహాల సంఖ్య 2,357

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9650.[6] ఇందులో పురుషుల సంఖ్య 4898, స్త్రీల సంఖ్య 4752, గ్రామంలో నివాసగృహాలు 2452 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 వెంకటేశ్వరరావు, కె. (11 january 2015). "చినగొల్లపాలెం.. ఆంధ్రా గోవా". ఆదివారం ఆంధ్రజ్యోతి. Check date values in: |date= (help)
 2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kruttivennu/Chinagollapalem". Archived from the original on 25 మార్చి 2017. Retrieved 7 July 2016. External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)
 3. ఈనాడు కృష్ణా జులై 18, 2013. 11వ పేజీ.
 4. ఈనాడు కృష్ణా ఆగష్టు 4, 2013. 5వ పేజీ.
 5. ది హిందూ దినపత్రిక జులై 14, 2013. 2వ పేజీ.
 6. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-15.

[6] ఈనాడు కృష్ణా; 2015, మే నెల-22వతేదీ; 11వపేజీ.