కృత్తివెన్ను

వికీపీడియా నుండి
(కృతివెన్ను నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కృత్తివెన్ను
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కృత్తివెన్ను
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 7,585
 - పురుషులు 4,007
 - స్త్రీలు 3,973
 - గృహాల సంఖ్య 1,994
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08672


కృత్తివెన్ను
—  మండలం  —
కృష్ణా జిల్లా పటములో కృత్తివెన్ను మండలం స్థానం
కృష్ణా జిల్లా పటములో కృత్తివెన్ను మండలం స్థానం
కృత్తివెన్ను is located in Andhra Pradesh
కృత్తివెన్ను
కృత్తివెన్ను
ఆంధ్రప్రదేశ్ పటంలో కృత్తివెన్ను స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°24′21″N 81°21′28″E / 16.405788°N 81.357651°E / 16.405788; 81.357651
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం కృతివెన్ను
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 52,632
 - పురుషులు 26,522
 - స్త్రీలు 26,110
అక్షరాస్యత (2001)
 - మొత్తం 57.99%
 - పురుషులు 63.09%
 - స్త్రీలు 52.78%
పిన్‌కోడ్ 521324

కృత్తివెన్ను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్: 521 324., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 5 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

మొగల్తూర్, భీమవరం, పెడన, నర్సాపూర్

సమీప మండలాలు[మార్చు]

బంటుమిల్లి, కలిదిండి, కల్ల, ఆకివీడు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

బంటుమిల్లి నుండి మరియు కైకలూరు ల నుండి బస్సు, ఆటోల సౌకర్యం ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

శ్రీ బాలజ్యోతి జూనియర్ కాలేజి. జిల్లాపరిషత్ హైస్కూల్, కృత్తివెన్ను

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

  1. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
  2. త్రాగునీటి సౌకర్యం:- ఇక్కడ ప్రధాన సమస్య మంచినీరు. సముద్రమునకు అతి సమీపాన ఉండుట వలన రెండడుగుల గొయ్యి తవ్వినా ఉప్పునీరు వస్తుంది. సరియైన మంచినీటి సౌకర్యాలు ఇప్పటి వరకూ లేవు.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వరస్వామివారి దేవస్థానము[మార్చు]

ఊరికి దూరంగా సముద్రానికి సమీపాన గుడిదిబ్బ గ్రామములోగల శ్రీ నాగేశ్వరస్వామివారి దేవస్థానమునకు విచిత్రమైన కథ ఉంది. ఈ దేవస్థానములో స్వామి గర్భాలయముపై నుండి స్వామి వారి లింగాకృతిపై పిడుగు పడుటచే లింగము ముక్కలుగా విడిపోయింది. తదనంతరము ఆ ఆలయమును పడగొట్టి సరికొత్తగా మరొక ఆలయము నిర్మించి కొత్త లింగమును ప్రతిష్ఠించాలనుకొన్నారు అయితే సమావేశానంతరము ఆరాత్రి వారి కలలో స్వామి కనుపించి తనను కదలించవలదనిన్నీ పాతలింగమును అలాగే ఉంచి ఆలయము నిర్మింపవలెననీ తెలియజేయుటచే కేవలం ఆలయమును మాత్రం కొత్తది కట్టించారు. ఇప్పటికిన్నీ అదే లింగము పూజలందుకొనుచున్నది. మరొక చిత్రమైన విషయము దేవాలయమునకు వెళ్ళిన వారికి అదే లింగమునుండి చిన్న ముక్కను ప్రసాదంగా ఇస్తారు అలా అప్పటినుండి ఇస్తూ వస్తున్నా కూడా లింగములో ఏమాత్రము తరుగుదల లేదని అప్పటి మాదిరిగా ఇప్పటికిన్నీ అలాగే ఉన్నదని ఆలయ పూజారులు చెపుతారు. ఈ ఆలయమునకు తగిన మాన్యము ఉంది. ఏటా శివరాత్రికి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. [6]

శ్రీ కోదండరామాలయం[మార్చు]

1952లో నిర్మితమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో, ఆలయ పునర్నిర్మాణానానికి శ్రీకారం చుట్టి, పునర్నిర్మాణం పూర్తిచేసారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థుల సహకారంతోపాటు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ వారు, రు. 2.80 లక్షల నిధులు సమకూర్చారు. ఈ ఆలయంలో శ్రీ సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారల విగ్రహ, కలశ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మార్చ్-25వ తేదీ ఉదయం 9-40 గంటలకు, అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిచారు. అనంతరం స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించారు. అనంతరం దేవాలయం వద్ద, భక్తులకు పెద్దయెత్తున అన్నదానం నిర్వహించారు. [4]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయము[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి 51వ పంచరాత్ర మహోత్సవాలు, 2014.డిసెంబరు-2, మంగళవారం నుండి 6వ తేదీ శనివారం, మార్గశిర పౌర్ణమి వరకు, వైభవంగా నిర్వహించారు. ఐదవ రోజు శనివారం నాడు, ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటలనుండి సాయంత్రం వరకు, దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు. మద్యాహ్నం నుండి విచిత్రవేషధారణల నడుమ, పెద్దయెత్తున మందుగుండు సామగ్రి కాల్చుచూ, కనకడప్పులతో స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా మహిళలు స్వామివారికి హారతులు పట్టి ప్రత్యేకపూజలు నిర్వహించారు. [2]

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 16వ వార్షికోత్సవ కార్యక్రమాలు, 2015,ఫిబ్రవరి-12, గురువారం నుండి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. మూడవ రోజు శనివారంనాడు భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. నాల్గవరోజు, 15వ తేదీ ఆదివారం నాడు, స్వామివారిని గ్రామ వీధులలో ఊరేగించెదరు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

చేపల మరియు రొయ్యల చెరువులు ఎక్కువగా సాగుచేయబడుతున్నవి.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, చేపలపెంపకం, కూరగాయలు పండించుట

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

  1. గ్రామ జనాభాలో ఆచంట పరిసర ప్రాంతాలనుండి వలస వచ్చిన వారు అధికం.
  2. ఈ గ్రామములో 2016,ఫిబ్రవరి-29న, దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. [5]

గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]

క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. చందాల 310 1,324 693 631
2. చెరుకుమిల్లి (కృత్తివెన్ను) 341 1,431 721 710
3. చినపాండ్రాక 1,519 6,309 3,141 3,168
4. చినగొల్లపాలెం 2,452 9,650 4,898 4,752
5. ఎండపల్లి 308 1,241 620 621
6. గరిసేపూడి 244 1,067 552 515
7. ఇంటేరు 279 1,243 641 602
8. కొమల్లపూడి 545 2,186 1,091 1,095
9. కృత్తివెన్ను 1,994 7,980 4,007 3,973
10. లక్ష్మీపురం 1,339 5,688 2,899 2,789
11. మాట్లం 899 3,862 1,941 1,921
12. మునిపేడ 405 1,564 779 785
13. నీలిపూడి 510 2,189 1,082 1,107
14. నిడమర్రు 1,463 6,239 3,137 3,102
15. తాడివెన్ను 152 659 320 339

వనరులు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kruttivennu/Kruthivennu". Retrieved 7 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా, 2014,డిసెంబరు-7; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-12; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-26; 4వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2016,ఫిబ్రవరి-29; 11వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2017,ఫిబ్రవరి-21; 12వపేజీ.

మూలాలు[మార్చు]