లక్ష్మీపురం (కృతివెన్ను)
లక్ష్మీపురం (కృతివెన్ను) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కృతివెన్ను |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 5,471 |
- పురుషులు | 2,741 |
- స్త్రీలు | 2,730 |
- గృహాల సంఖ్య | 1,557 |
పిన్ కోడ్ | 521324 |
ఎస్.టి.డి కోడ్ | 08672. |
లక్ష్మీపురం, కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 324., యస్.టి.డీ కోడ్=08672.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 5 మీ.ఎత్తు
ఈ గ్రామం భీమవరం నుండి 20 కిలోమీటర్లు, కృత్తివెన్నుకు ఏడు కిలోమీటర్ల దూరములో ఉంది.
సమీప పట్టణాలు[మార్చు]
మొగల్రూర్, భీమవరం, నర్సాపూర్, పాలకొల్లు
సమీప మండలాలు[మార్చు]
కల్ల, మొగల్తూర్, బంటుమిల్లి, భీమవరం
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
జువ్వలపాలెం, జక్కారం నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేవెస్టేషన్; విజయవాడ 84 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- లక్ష్మీపురం గ్రామ పంచాయతీ లాకువద్ద గల ప్రాథమిక పాఠశాలలో, 2014, అక్టోబరు-2న గాంధీజయంతి సందర్భంగా, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [2]
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
లక్ష్మీపురంలాకులుగా పిలువబడే ఈ ఊరి లాకులద్వారా చుట్టుపక్కల పదిహేను గ్రామాలకు నీటి సరఫరా జరుగుతున్నది.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి తిరుమలశెట్టి ప్రభావతి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
(1)శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయం:- లక్ష్మీపురం గ్రామ లాకువద్దగల ఈ ఆలయంలో స్వామివారి వార్షిక ఉత్సవాలలో భాగంగా, ఆరవరోజు, 2014,డిసెంబరు-7, ఆదివారం, మార్గశిర బహుళ పాడ్యమి నాడు, స్వామివారిని, గ్రామంలో బుట్టబొమ్మలు, మేళతాళాల నదుమ, గ్రామంలో ఊరేగించారు. భక్తులు కానుకలు, పళ్ళు సమర్పించారు. ఆలయంలో ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం సాయంత్రం తాళం భజనలు ఏర్పాటుచేసారు. ఆరోజు సాంస్కృతిక కార్యక్రమాలు గూడా ఏర్పాటుచేసారు. [3]
(2)లక్ష్మీపురం పల్లెపాలెం పంచాయతీ పరిధిలోని శ్రీ దానమ్మతల్లి జాతర మహోత్సవాలు, 2015,మే నెల-6వ తేదీ బుధవారంతో ముగిసినవి. ఉదయం 9-52 గంటలకు, వేదపండితుల సమక్షంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [4]
(3) శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే నెల-5వ తేదీ మంగళవారంనాడు ప్రారంభమైనవి. ఈ కార్యక్రమాలలో భాగంగా, 6వ తేదీ బుధవారం నాడు, స్వామివారి విగ్రహాలను ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన యాగశాలలో ఉంచి, భూతబలి, గురుధ్యానం, విఘ్నేశ్వర పూజలతోపాటు పలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఏడవతెదీ గురువారంనాడు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ, లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారికి క్షీరాభిషేకం కన్నులపండువగా నిర్వహించారు. 8వ తేదీ శుక్రవారం రాత్రి నిర్వహించిన ధాన్యాదివాసం కార్ర్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నది. 9వ తేదీ శనివారంనాడు, ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాలలో, స్వామివారికి పూజలు నిర్వహించారు మరియూ స్వామివారికి పవళింపుసేవ నిర్వహించారు. 10వ తేదీ ఆదివారంనాడు, విగ్రహప్రతిష్ఠ నిర్వహించారు. విగ్రహప్రతిష్ఠ అనంతరం స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు బారీగా అన్నసమారాధన నిర్వహించారు. [4]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం. ప్రధాన వ్యసాయపంట వరి అయినా చాలావరకూ వరిచేలు పూడ్చబడి రొయ్యల,చేపల చెరువులుగా మార్చబడినవి.
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
లక్ష్మీపురం పల్లెపాలెంలోని పిన్నేరువద్ద 7.54 కోట్ల అంచనా వ్యయంతో ఒక జెట్టీ (ఫిషింగ్ హార్బర్) నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. [5]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 5,471 - పురుషుల సంఖ్య 2,741 - స్త్రీల సంఖ్య 2,730 - గృహాల సంఖ్య 1,557
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5688.[2] ఇందులో పురుషుల సంఖ్య 2899, స్త్రీల సంఖ్య 2789, గ్రామంలో నివాస గృహాలు 1339 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Kruttivennu/Laxmipuram". Retrieved 7 July 2016. External link in
|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-15.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా; 2014, అక్టోబరు-3; 4వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-8; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,మే-7,10,11తేదీలు. [5] ఈనాడు కృష్ణా; 2017,జూన్-13; 1వపేజీ.