మాట్లం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాట్లం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కృతివెన్ను
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,683
 - పురుషులు 1,848
 - స్త్రీలు 1,835
 - గృహాల సంఖ్య 1,054
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08672

మాట్లం, కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 324., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 5 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మొగల్తూర్, భీమవరం, నర్సాపూర్, పాలకొల్లు

సమీప మండలాలు[మార్చు]

కల్ల, కలిదిండి, బంటుమిల్లి, ఆకివీడు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

జువ్వలపాలెం, ఏలూరుపాడు నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. లోసరి వద్ద ఉప్పుటేరు పై బ్రిడ్జి నిర్మాణం తర్వాత, సమీప ముఖ్య పట్టణమైన భీమవరానికి రోడ్డు మార్గము ఏర్పడింది. అంతకు మునుపు పంటు ద్వారా వెల్లవలసి వచ్చేది. ప్రస్తుతం ఈ రోడ్డు జాతీయ రహదారి 216 గా రూపాంతరం చెందింది.జాతీయ రహదారి 216 (భారతదేశం) ఆర్టిసి వారు లోసరి బస్సులను మాట్లం వరకు పొడిగించారు. రైల్వేవెస్టేషన్; విజయవాడ 83 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలోఉపసర్పంచిగా శ్రీ కొల్లాటి నాగరాజు ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ మారమ్మ, మాల్చమ్మ, గ్రామ దేవతల ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో, 2015, మార్చ్-22వ తేదీ ఆదివారం నాడు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, గణాచారి, పూజారి ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామంలో పిల్లలకు, పెద్దలకు ఆటలమ్మ వంటివి సోకకుండా ఉండాలని ఈ విధంగా గ్రామదేవతలకు ప్రత్యేకపూజలు నిర్వహించి, ముడుపులు కట్టడం ఆనవాయితీ. మాట్లం గ్రామంలో ప్రవేశించే అన్ని రహదారులలోనూ ఈ విధంగా ముడుపులు కట్టినారు. [4]

గ్రామ దేవత శ్రీ మొగదారమ్మ ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాల సందర్భంగా, 2014, జూన్-7న సంబరాలు, 8న, మొక్కుబడుల చెల్లింపులు మొదలైనవి ఘనంగా నిర్వహించారు. [2]

శ్రీ భక్తాంజనేయస్వామివారి విగ్రహo[మార్చు]

ఈ గ్రామంలోని లాంచీల రేవు వద్ద, 2015, మార్చ్-2వ తేదీ సోమవారం ఉదయం 09-45 గంటలకు శ్రీ భక్తాంజనేయస్వామివారి నూతన విగ్రహావిష్కరణ, వైభవంగా నిర్వహించారు. అర్చకులు క్షీరాభిషేకాలు, జలాభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. హోమగుండం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మద్యాహ్నం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నసమారాధనలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రదర్శించిన కనకదుర్గ తాళం భజన, భక్తులను రంజింపజేసినది. [3]

శ్రీ పెన్నమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

మాట్లం-పెన్నమ్మదిబ్బ లోని ఈ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పంచరాత్రి ఉత్సవాలు, 2017, ఫిబ్రవరి-28వతేదీ మంగళవారంతో ముగిసినవి. మంగళవారం ఉదయం ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. [6]

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]

ఈ ఆలయం స్థానిక లక్ష్మీపురం లాకుల వద్ద ఉంది.

వార్షిక జాతరలు - 2015[మార్చు]

  1. ఈ గ్రామంలో, వెంకమ్మ, మారమ్మ, మాల్చమ్మ, మొగదారమ్మ, పోతురాజుల జాతర మహోత్సవాలు, 2015, జూన్-7వ తేదీ ఆదివారంనాడు, వైభవంగా నిర్వహించారు. ఈ సంందర్భంగా, ఉదయం నుండి మద్యాహ్నం వరకు, గ్రామంలోని ఇంటింటికీ పానుపులు వేసినారు. 3 గంటల నుండి వెంకమ్మ దేవతను గ్రామ ప్రధాన వీధులలో ఊరేగించుచూ, గ్రామస్థులంతా దేవతను ఊరు చివరి వరకు సాగనంపటంతో జాతర ముగిసినది.
  2. సాయంత్రం గ్రామ ప్రజలు గ్రామ ప్రధానకేంద్రంలోని మారమ్మ, మాల్చమ్మ దేవాలయం ఎదుట వైభవంగా జాతర మహోత్సవాన్ని చేపట్టినారు. ఇతర ప్రాంతాలలో స్థిరపడిన గ్రామస్థులంతా పిల్లా, పాపలతో, బంధుమిత్రులతో తరలిరావడంతో జాతర కన్నులపండువగా సాగినది.
  3. 7వ తేదీ ఆదివారం రాత్రంతా జాతర వైభవంగా సాగినది. 8వ తేదీ సోమవారం ఉదయం, మొగదారమ్మ ఇంటింటికీ విచ్చేయడంతో, గ్రామస్థులు పానుపులు వేసుకున్నారు. 8 గంటల నుండి, అమ్మవారిని గ్రామ ప్రధానవీధులలో ఊరేగించారు. మొగదారమ్మ జాతర మొక్కుబడులు కార్యక్రమం నిర్వహించారు. భారీ జనసందోహం మధ్య, జరిగిన అమ్మవారి జాతర, కన్నులపండువగా సాగినది. మొగదారమ్మ జాతర మొక్కుబడులు కార్యక్రమం నిర్వహించారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,683 - పురుషుల సంఖ్య 1,848 - స్త్రీల సంఖ్య 1,835 - గృహాల సంఖ్య 1,054

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3862.[2] ఇందులో పురుషుల సంఖ్య 1941, స్త్రీల సంఖ్య 1921, గ్రామంలో నివాస గృహాలు 899 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kruttivennu/Matlam". Retrieved 7 July 2016. External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-15.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014, జూన్-3; 4వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015, మార్చ్-3; 4వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015, మార్చ్-23; 4వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015, జూన్-9; 5వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2017, మార్చ్-1; 12వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=మాట్లం&oldid=2987617" నుండి వెలికితీశారు