గోవుల గోపన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోవుల గోపన్న
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
భారతి,
రాజశ్రీ,
రేలంగి,
చలం,
సూర్యకాంతం
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ రాజ్యం ప్రొడక్షన్స్
భాష తెలుగు

గోవుల గోపన్న 1968, ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు సినిమా. తొలితరం సినీ నటీమణి లక్ష్మీరాజ్యం తన భర్త శ్రీధర్‌రావుతో కలిసి రాజ్యం పిక్చర్స్ అనే బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించింది. సి.ఎస్.రావు ఈ చిత్రానికి దర్శకునిగా పనిచేశాడు. బి.ఆర్.పంతులు దర్శకత్వంలో 1966లో వెలువడిన కన్నడ చిత్రం ఎమ్మె తమ్మణ్ణ ఈ చిత్రానికి మాతృక.

సాంకేతిక వర్గం

[మార్చు]

నటీనటులు

[మార్చు]

చిత్రకథ

[మార్చు]

అమాయకపు గోపన్న గోవులను పట్నంలోని ఛైర్మన్ నాగరాజు (గుమ్మడి) కుమార్తె తార, తన కారుకు అడ్డం వచ్చాయని కర్రతో కొడుతుంది. దానికి కోపించిన గోపన్న ఆమెపై చేయి చేసుకుంటాడు. ఈ సంగతి తన తండ్రికి చెబుతుంది తార (రాజశ్రీ) గోపన్నను అంతం చేయమని తన రౌడీలను పంపుతాడు నాగరాజు. నాగరాజు కుమారుడు, కస్తూరి (చలం) వారి బారినుండి గోపన్నను రక్షించి, అతని వేషంమార్చి లాయర్ నరసింహం (రేలంగి) ఇంటికి పంపుతాడు. అంతకుముందు తమ కుమార్తె రాధ(భారతి)కు భర్తగా తన స్నేహితుని కుమారుడు శేఖర్ ఎల్.ఎల్.బిని నిర్ణయించిన నరసింహం అతన్ని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంతలో వచ్చిన గోపన్ననే శేఖర్‌గా భావించి ఆదరిస్తారు. రాధ, గోపన్నలు ప్రేమించుకుంటారు. పట్నం వచ్చిన శేఖర్‌ను, గోపన్నగా భావించిన నాగరాజు అనుచరులు అతన్ని బాగా చితక్కొట్టగా, వారినుంచి తప్పించుకొని నరసింహంవద్దకు వెళతాడు. అక్కడ గోపన్న కథ విని అతన్ని విద్యావంతునిగా చేస్తానని మాట ఇవ్వటం, వారిరువురూ ఒకరిగా నటిస్తూ చలామణి అవుతారు.

శేఖర్‌ను కలుసుకున్న తార అతన్ని ప్రేమించటం, ఆమెతో వివాహానికి శేఖర్ ఇష్టపడి, లాయర్ నరసింహంకు ఈ విషయం తెలియచేస్తాడు. శేఖర్ తండ్రి మరణానికి, వారి ఆస్తిపోవడానికి నాగరాజు కారణం అని నరసింహం చెప్పగా, ఆవేశంతో నాగరాజు వద్దకువెళ్ళి బందీ అవుతాడు. విద్యావంతుడైన గోపన్న తెలివిగా నాగరాజు సంపాదించిన శేఖర్ తండ్రి డైరీని, రాధతో కలిసి చేజిక్కించుకోవటం, నాగరాజు అక్రమ వ్యాపారాలు సాగించే డెన్‌లోవున్న శేఖర్‌ను విడిపించి, పోలీసులకు నాగరాజును, అనుచరులను స్వాధీనం చేయటం. రాధతో గోపన్న, తారతో శేఖర్, సి.ఐ.డి. రాజేశ్వరి (రాజీ) సుకన్యతో కస్తూరికి వివాహాలు జరగటంతో చిత్రం సుఖాంతం అవుతుంది[1].

విశేషాలు

[మార్చు]

ఈ చిత్రానికి మూలమైన కన్నడ సినిమాలో కన్నడ నటుడు రాజ్‌కుమార్ ప్రధాన పాత్రను పోషించాడు. 1966లో విడుదలైన ఈ చిత్రాన్ని బి.ఆర్.పంతులు నిర్మించి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. ఇదే చిత్రాన్ని హిందీలో ప్రముఖ నిర్మాతలు సుందర్‌లాల్ నహతా, డూండీలు విజయలక్ష్మీ పిక్చర్స్ బేనర్‌పై 1969లో జిగ్రీ దోస్త్ పేరుతో నిర్మించారు. ఆ సినిమాలో జితేంద్ర నటించాడు.

ఆ తరువాత 1970లో తమిళంలో జయంత్ ఫిలిమ్స్ పతాకంపై మాట్టుకారవేలన్ అనే పేరుతో ఎం.జి.రామచంద్రన్ హీరోగా నిర్మించారు.

ఇలా ఒకే కథ కన్నడ, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చిత్రంగా రూపొంది విజయం సాధించటం విశేషం.

పాటలు

[మార్చు]
  1. ఆకాశంలో హంసలమై హాయిగ ఎగిరే జంటలమై అలా అలా - ఘంటసాల, పి.సుశీల . రచన: దాశరథి.
  2. ఈ విరితోటల లోగిటిలో నీకను చూపుల కౌగిటిలో - ఘంటసాల, సుశీల, జె.వి.రాఘవులు,లత . రచన: శ్రీ రంగం శ్రీనివాస రావు.
  3. కన్నెల వలపుల వెన్నెలు దోచే కన్నయ ఈ మాయలేల - సుశీల, ఘంటసాల . రచన: దాశరథి
  4. ఢంఢం డ్రెక్లీనింగ్ ఎందముగా పేరుంది ఉతికిస్తాం - ఘంటసాల, బెంగులూరి లత . రచన: కొసరాజు
  5. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా - ఘంటసాల, సుశీల . రచన: కొసరాజు.
  6. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా - ఘంటసాల రచన: కొసరాజు.
  7. హల్లో మిష్టర్ గోవుల గోపన్నా నీ తల్లో తెలివి సున్నా - ఎస్. జానకి బృందం , రచన: ఆరుద్ర
  8. హడావిడి పెట్టకోయి బావా ఆ మాత్రం ఆగలేవా - ఎస్. జానకి, రచన:ఆరుద్ర.

మూలాలు

[మార్చు]
  1. "గోవుల గోపన్న- -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 07-04-2018". Archived from the original on 2018-06-01. Retrieved 2018-10-26.

బయటి లింకులు

[మార్చు]