చర్చ:కాకతీయులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషంఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
Ashoka Chakra.svg
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


మార్పులు[మార్చు]

దుర్గాప్రసాదు గారి పుస్తకమాధారముగా నేను అంగ్ల వికి లో కాకతీయుల వ్యాసమున పలుమార్పులు చేర్పులు గావించితిని. తెలుగు వికిలో వ్యాసము వ్రాయునపుడు అది చూడగలరుKumarrao 12:06, 5 మార్చి 2008 (UTC)

వ్యాసము విస్తరణలోనున్నది. గమనించగలరు.Kumarrao 13:10, 15 జూలై 2008 (UTC)

కాకతీయులు కర్ణాటక[మార్చు]

కాకతీయుల పూర్వీకులు కర్ణాటక నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చిన విషయం మార్పుచేర్పులలో తొలగిపోయినట్టుంది. అది చేర్చగలరు. ఇది ఆంధ్ర చరిత్రకారుల్లో పి.వి.పరబ్రహ్మ శాస్త్రి రచించిన కాకతీయులు పుస్తకంలో ఉంది. ఈయన్ను కన్నడ పక్షపాతి అని కొట్టివేయలేము..ఎందుకంటే శాతవాహనులు ఆంధ్రులని ఋజువు చేసింది ఈయనే --వైజాసత్య 12:43, 16 జూలై 2008 (UTC)

కాకతీయుల పుట్టుక[మార్చు]

నేను తెలుగు విశ్వవిద్యాలయము వారు ప్రకటించిన విజ్ఞాన సర్వస్వము-చరిత్ర సంపుటము నుండి మరియు దుర్గాప్రసాద్ గారి ఆంగ్ల పుస్తకము నుండి సమాచారము సేకరించాను. కాకతీయుల పుట్టుక చాలా వివాదాస్పదము.

  • చరిత్రకారుల అభిప్రాయము కాకతీపురము ఒరుగంటికి పాతపేరు.
  • అలాగే 'రాష్టకూట' అను పదము రాష్ట్రకూటులకు విశ్వాసపాత్ర్రులైన కాకతీయుల పూర్వీకులు తమ పేరుకు చివర వ్రాసుకున్నారు. మరొక ఉదాహరణ: వెలనాడు, కమ్మనాడు లోని పలువురు తెలుగు నాయకులు తమిళ చో(ళు)డులకు విధేయులై వారి పేర్ల చివర 'చోడ' అని వ్రాసుకున్నారు.
  • రాష్ట్రకూటులు ఉత్తర భారతమునుండి వచ్చిన ఆర్య సూర్యవంశ క్షత్రియులు. కాకతీయులు దుర్జయ వంశము వారు.
  • కాకతీయుల పేర్లు అచ్చ తెలుగు పేర్లు. ఉదా: వెన్న, ఎర్ర, గుండ, బేత, ప్రోల మొదలగునవి.

వీటినిబట్టి కాకతీయులు తెలుగు, కర్ణాట దేశముల సరిహద్దు ప్రాంతములకు చెందిన తెలుగు వారని చెప్పవచ్చును.Kumarrao 11:50, 17 జూలై 2008 (UTC)

  • కాకతీయుల కులము గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయమున్నవి. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరి కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి దుర్జయ వంశమువారని చెప్పబడ్డారు. గుంటూరు తాలూకా మల్కాపురంలో కూలిపోయిన ఒక గుడియొద్ద ఉన్న నంది విగ్రహం మీద చెక్కిన శిలాశాసనం 395 (A. R. No. 94 of 1917.) కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని తెలుపుచున్నది [1]. కర్నూలు జిల్లా త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వర ఆలయంలో చెక్కబడిన శిలాశాసనం 371 (A. R. No. 196 of 1905.) ప్రకారం గణపతిదేవుడు సూర్యవంశ క్షత్రియుడని తెలుపుచున్నది [2]. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 13:32, 17 నవంబర్ 2015 (UTC))

రుద్రమదేవి బొమ్మ[మార్చు]

కాసుబాబు గారు, వ్యాసములోనున్న రుద్రమ దేవి బొమ్మ చాల అసహజముగా ఉన్నది. ఈ బొమ్మ ఆంగ్ల వికీలో కూడ ఉన్నది. బొమ్మలోని వేషధారణ భారతదేశములో ముస్లిముల ప్రవేశము తరువాత రాజపుత్ర స్త్రీలు, ఉత్తరభారత మహిళలు పాటించిన పద్ధతిలో ఉంది. నా అభిప్రాయము రుద్రమదేవి ఈ విధముగా ఉండి ఉండదు. ఆమె కాలానికి ముస్లిములు వారి వేషభాషలు ఆంధ్రదేశములోనికి రాలేదు. చర్చించి దయచేసి బొమ్మ తీసివేయండి.Kumarrao 09:48, 21 జూలై 2008 (UTC)

అవును. నాకూ అలానే అనిపించింది. ఎలాగూ ట్యాంక్ బండ్ విగ్రహాలలో రుద్రమదేవి బొమ్మ ఉంది గనుక ఈ బొమ్మ అవుసరం లేదనుకొంటాను. పరిశీలించి, తరువాత తొలగిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:26, 21 జూలై 2008 (UTC)
ప్రస్తుతానికి ట్యాంకుబండ్ బొమ్మ పెట్టాను. పాత బొమ్మ తొలగింపు అవసరమో కాదో తరువాత పరిశీలిస్తాను. ఈ వ్యాసంలో నేను కూడా పని చేయనా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:57, 21 జూలై 2008 (UTC)

కాకతీయుల సామంతులు ఇక్కడ విలీనం[మార్చు]

పేజీ చరిత్ర
   (ప్రస్తు • గత) 14:03, 5 జనవరి 2009‎ కాసుబాబు (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (1,997 బైట్లు) (-5)‎ . . (ఏకఛత్రాధిపత్యం) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
    (ప్రస్తు • గత) 14:01, 5 జనవరి 2009‎ కాసుబాబు (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (2,002 బైట్లు) (+51)‎ . . ({{విలీనం|కాకతీయులు}}) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
    (ప్రస్తు • గత) 14:51, 13 జూలై 2008‎ Dev (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (1,951 బైట్లు) (-8)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
    (ప్రస్తు • గత) 22:38, 7 జూన్ 2007‎ Mpradeepbot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (1,959 బైట్లు) (+7)‎ . . (బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
    (ప్రస్తు • గత) 17:05, 23 మార్చి 2007‎ వైజాసత్య (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (1,952 బైట్లు) (+31)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
    (ప్రస్తు • గత) 11:52, 24 ఆగష్టు 2005‎ Chavakiran (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,921 బైట్లు) (+1,921)‎

మార్పుచేయవలసిన భాగం[మార్చు]

కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "దుర్జయులు".కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది కమ్మనాడు,వెలనాడు ఉంది.కమ్మ వారికి మూల పురుషు లైన దుర్జయులకు ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం.సూర్యచంద్రవంశక్షత్రియులలోని ఒకానొక శాఖ “దుర్జయవంశీయులు”, సూర్యచంద్రవంశ క్షత్రియ మూలాలు కలిగిన ఒకప్పటి కూర్మారాధకులైన (జైనులైన) “దుర్జయాన్వయులు”,కాకతీయుల,కమ్మవారి మూల పురుషులు.కమ్మవారికీ, కాకతీయులకూ మూలపురుషుడైన “కమ్రమహారాజు” ఈ సముదాయంలోనివాడే. కాకతి అనే జైన దేవతను కులదేవతగా పూజించిన కారణంగా వీరిని కాకతీయులు అనేవారు. కాకతీయ పాలకులలో మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 – 1030), మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1030 – 1075) జైనులే. జైనమతాన్ని వదిలేసి, శైవం స్వీకరించిన రెండవ బేతరాజు( క్రీ.శ. 1075 – 1110) పరమ మాహేశ్వరుడని అనుమకొండ శాసనం పేర్కొంది. అప్పటివరకూ జైన మతంలో కులగోత్రాల ప్రసక్తిలేకుండా జీవించిన వీరు శైవం స్వీకరించాక అప్పటి సామాజిక అవసరాలకు తగినట్లుగా కూర్మారాధక అనే కులంగా ఏర్పడ్డారు.కాకతీయులు తాము క్షత్రియులమని కొన్ని శాసనాలలో, చతుర్థ వంశజులమని కొన్ని శాసనాలలో చెప్పుకున్నప్పటికీ, “జైన మతంలో” ఉండగా “కుల గోత్రాలను” విసర్జించిన కారణంగా వారిని నాటి సమాజం క్షత్రియులుగా గుర్తించక, చతుర్థ వంశజులగానే భావించినట్లుంది. ఆ ఆత్మ న్యూనతా భావం వారిలో ఆధిక్యతా భావం ఏర్పడడానికి దారితీసింది. ఆ ఆధిక్యతా భావంతోనే కొందరు కాకతీయ ప్రభువులు తమను తాము ‘అత్యర్కేందు కుల ప్రసూతులు’ గా అంటే సూర్య – చంద్ర వంశాల కంటే మిన్నయైన కులానికి చెందినవారిగా భావించేవారు. ప్రతాపరుద్రీయ కావ్యంలో విద్యానాథుడు కాకతీయులు ‘అత్యర్కేందు కుల ప్రసూతుల’ నే పేర్కొన్నాడు.అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.కూర్మారాధక క్షత్రియ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి "కమ్మకులం"గా ఏర్పడడారు.కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) "కర్మ కులం"గానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.

శాసనాధారాలను బట్టి బయ్యారం శాశనం ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.

ఆధారాలు[మార్చు]

కాకతీయులు ఏ కులమునకు చెందినవారో ఖచ్చితమైన ఆధారాలు లేవు. చరిత్రకారులు చెప్పినా అది అభిప్రాయమే. చరిత్రకారులందరూ ఒకే అభిప్రాయానికి వస్తే తప్ప చెప్పలేము. కమ్మవారు క్షత్రియ కులాలకు చెందినవారు కాదు. వారికి ధనుంజయ, వశిష్ట, కాస్యప, కౌండిన్య, భరద్వాజ, ఆత్రియ, పశుపతి వంటి క్షత్రియ గోత్రాలు లేవు. అలాగే కాకతీయులు కమ్మ కులానికి చెందినవారని అనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కనుక ఈ భాగానికి ఖచ్చితమైన - ఆమోదితమైన ఆధారాలు జతపరచడం అవసరం. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 15:11, 14 ఫిబ్రవరి 2018 (UTC))

  1. Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64.
  2. Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64.