Jump to content

చర్చ:శ్రీశైల క్షేత్రం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
శ్రీశైల క్షేత్రం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 21 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


శ్రీశైల క్షేత్రము చర్చాపేజీ నుండి

[మార్చు]

ఈ వ్యాసానికి కొంచెము సరళమైన పేరుపెడితే బాగుంటుందేమొ!! కొన్ని సూచనలు చేయండి. (ఇప్పటికే శ్రీశైలం అను పేరుతో మండలము పేజీ ఉన్నది). --వైఙాసత్య 10:20, 21 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీశైల క్షేత్రము __చదువరి (చర్చ, రచనలు) 17:06, 21 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఈ వ్యాసానికి ఈ పేరు ఉంచడానికి కారణము, ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల వ్యాసము నుండి వచ్చినది. మనము శ్రీశైల క్షేత్రము అని భేషుగ్గా పిలిచి ప్రస్తుత పేరునుండి ఓ దారి మార్పు కాగితము ఇస్తే సరిపోతుంది. చావా కిరణ్ కుమార్
ఈ ఆలోచన బాగుంది. అలాగే చేద్దాము --వైఙాసత్య 21:19, 21 మే 2006 (UTC)[ప్రత్యుత్తరం]

తరలింపులు

[మార్చు]

ఇది వరకు శ్రీశైలం వ్యాసంలో శ్రీశైల మండలము గురించి ఉండేది. ఆ వ్యాసం యొక్క పరిధి చిన్నది మరియు సాధారణంగా శ్రీశైలమంటే పుణ్యక్షేత్రమనే భావిస్తారు కాబట్టి ఇక్కడున్న సమాచారాన్ని శ్రీశైలం మండలము కు తరలించి శ్రీశైల క్షేత్రము వ్యాసాన్ని ఇక్కడికి తరలించా --వైజాసత్య 08:20, 11 ఆగష్టు 2007 (UTC)

ఆలయంలోని ద్వజస్తంభం గురించి శ్రీశైలం లో మల్లికార్జునుని ఆలయానికి ముందు మరియు వెనుక కూడా ద్వజస్తంభాలు ఉన్నాయి కదా! సరే, ముందు ఉన్నది మల్లికార్జున స్వామి వారిది మరి వెనుక ఉన్నది ఎందుకు? అమ్మవారికి కూడా ఒక ద్వజస్తంభం ఉంది కదా!madhuriprakash 10:53, 2 జనవరి 2008 (UTC)మాధురీరావ్2007

బొమ్మలు శుద్ది చెయ్యాలి.

[మార్చు]

ఈ వ్యాసంలోని బొమ్మలు శుద్ది చెయ్యాల్సిన అవసరం కనిపిస్తుంది. నేను ఈ దిగువ బొమ్మలు తొలగించాలనుకుంటున్నాను. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పగలరు.

  1. శ్రీశైలదేవస్థాన సత్రములు. గంగా సదన్, గౌరీ సదన్, శివసదన్ (కారణం - ప్రాముఖ్యత లేని బొమ్మ, హోటల్ కూడా సరిగ్గా కనిపించటం లేదు)
  2. శ్రీశైలక్షేత్ర ప్రధాన ముఖద్వారము (కారణం - వ్యక్తిగత బొమ్మ లా ఉంది, ఇంకా స్వాగత ద్వారం అంత ప్రాముఖ్యత ఉన్నట్టిది కూడా కాదు)
  3. శ్రీ కృష్ణదేవరాయ నిర్మిత గోపురం. (కారణం - ప్రస్తుతానికి దీన్ని తొలగించటం లేదు, కాని ఇంత కంటే మంచి కోణంలో మనకు ఈ బొమ్మ కావాలి)
  4. దేవాలయ ఆవరణ. దేవాలయ ప్రధాన ముఖద్వారము. గర్భాలయ వెనుక బాగము (పాండవులు నిర్మించిన గుడులవైపు) (కారణం - వ్యక్తిగత బొమ్మలా ఉంది)

Chavakiran 06:56, 5 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మిగతా విషయాలు వదిలేస్తె ప్రస్తుతం దేవాలయం లోపలిబాగం ఫొటోలు తీయుటకు అనుమతి లేదు. మీరెలా తీసారన్నది అప్రస్తుతమ్. అప్పట్లో అలా తీసాను. ఇప్పుడు లోపలి పొతోలు తీయుట కష్టం కనుక అవి అప్లోడ్ చేసాను. మిగతా సభ్యులను సంప్రందించి నిర్ణయించుకొండి.```
వ్యాసాన్ని బొమ్మలు డామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మనకు కంటెంట్ ముఖ్యం కనుక కొన్ని ప్రాధాన్యమైన ఫోటోలను మాత్రం వ్యాసం మధ్యలో ఉంచి, మిగతావి చిత్రమాలిక లాగా చివర్లో చేరిస్తే బాగుంటుందని నా సలహా. — రవిచంద్ర(చర్చ) 11:06, 5 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]


నా అభిప్రాయం. (1) తొలగించవచ్చును (2) ఉంచినా పరవాలేదనుకొంటాను (3) ప్రస్తుతానికి ఉంచవచ్చును. ఇంకా మంచి బొమ్మ దొరికినపుడు రిప్లేస్ చేయవచ్చును (4) తొలగించవచ్చును. - కేవలం వ్యాసంలోంచి తొలగించాలా లేక బొమ్మలనే తొలగించాలా? నా అభిప్రాయం బొమ్మలను కూడా తొలగించవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:17, 5 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
Content Related బొమ్మలను ఆయా విభాగాల్లో వుంచి, రవిచంద్ర గారు చెప్పినట్లు, మిగతా బొమ్మలను వ్యాసం చివర్లో "చిత్రమాలిక" లో వుంచడం సబబుగా వుంటుంది. అలాగే, ఇంకా మంచి (నాణ్యతగల) చిత్రాలు వచ్చేంత వరకు, వీటిని చిత్రమాలికలో వుంచడం, వ్యాస సమాచారాన్ని డామినేట్ చేసి వుంచడం బాగుంటుందని నా అభిప్రాయం. అహ్మద్ నిసార్ 15:39, 5 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేజీ తరలింపు చేయటానికి చర్చ

[మార్చు]

ఈ పేజీ ఆలయానికి చెందిన వ్యాసం పేజీ. శ్రీశైలం అనేది వాస్తవంగా పట్టణం పేరు. ఇది జనగణన పట్టణం.ఈ వ్యాసం వికీ డేటా లింకు పట్టణ వ్యాసానికి తొలగించి, ఆంగ్లంలో Mallikarjuna Jyotirlinga ఉన్న ఆలయంపేజీకి వికీ డేటా లింకు కలిపాను. శ్రీశైలం (శ్రీశైలం మండలం) అనే పేరుతో పట్టణవ్యాసం ఉంది.కావున దీనిని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయం, శ్రీశైలం అనే పేరుతో తరలింపు చేసి, ఈ పేర్లతో శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయం, శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీశైలమహాక్షేత్రం, శ్రీశైల దేవస్థానం అనే పేర్లతో దారిమార్పు చేస్తే ఇది దేవస్థానం వ్యాసం అని తెలుస్తుంది. దీనిమీద గతంలోనే 2007లోనే చర్చలు జరిగినవి. ఫలితం జరుగలేదు చదువరి , పవన్ సంతోష్ , రాజశేఖర్ , ప్రణయ్ రాజ్ , వెంకటరమణ గారలు , చురుకైన ఇతర గౌరవ వికీపీడియన్లు స్పందించవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:53, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, ఈ వ్యాసం పూర్తిగా జ్యోతిర్లింగానికి సంబంధించినది అయినందున ఆంగ్ల వ్యాసం ప్రకారం "మల్లికార్జున జ్యోతిర్లింగం" కు దారిమార్పు లేకుండా తరలించాను. శ్రీశైలం పేరుతో అనేక వ్యాసాలున్నందున దీనిని అయోమయ నివృత్తి పేజీగా సృష్టించాను.-- K.Venkataramana -- 15:25, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పై వాటిలో ఏమైనా దారిమార్పు పేజీలు సృష్టించి ఇవ్వవలసి ఉంటుందా? యర్రా రామారావు (చర్చ) 15:29, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు సూచించినట్లు శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయం, శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీశైలమహాక్షేత్రం, శ్రీశైల దేవస్థానం వంటి వ్యాసాలను సృష్టించి ఈ వ్యాసానికి దారిమార్పు చేయవచ్చు.-- K.Venkataramana -- 15:36, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు యర్రా రామారావు గారికీ, వెంకటరమణ గారికీ ధన్యవాదాలు. వికీపీడియాలో వ్యాసం పేరును నిర్ణయించే పద్ధతి సాధారణ నామం కదండీ. పేర్లు సహజంగా ఒక సాధారణ వ్యక్తి వెతికినప్పుడు ఎలా వెతుకుతారో అలానే ఉండాలన్నది ముఖ్య సూత్రం. ఆ ప్రకారం చూస్తే, ఆంగ్ల పాఠకులు, రచయితల సంగతి నాకు తెలియదు కానీ తెలుగులో రాసేవారు మాత్రం మల్లికార్జున జ్యోతిర్లింగం అని రాయరు. ఆంగ్లంలో కాశీ విశ్వేశ్వరాలయం గురించి చూడండి, విశ్వేశ్వర జ్యోతిర్లింగం అని ఉండదు. Kashi Vishwanath Temple అనే ఉంటుంది. ఈ తేడా ఎందుకంటే, విశ్వేశ్వర జ్యోతిర్లింగం అని ఆంగ్లంలో దాన్ని సహజంగా పిలవరు కనుక. అందువల్ల ఆంగ్లంలో పెట్టినట్టుగానే మనమూ పెట్టాల్సిన పని లేదు. ఈ వ్యాసంలో కేవలం మల్లికార్జున స్వామి ఆలయం గురించే కాక ఇతర క్షేత్ర విశేషాలు కలిపి ఉన్నాయి కనుక శ్రీశైల క్షేత్రం అని అనవచ్చని నా ఉద్దేశం. మిగిలినవారు కూడా మీమీ అభిప్రాయాలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 15:03, 23 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
"శ్రీశైల క్షేత్రం" అనే వ్యాసం సృష్టించి ఈ వ్యాసానికి దారిమార్పు చేయండి.-- K.Venkataramana -- 15:11, 23 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది వరకు శ్రీశైల క్షేత్రము అనే వ్యాసం దారిమార్పుతో ఉంది.-- K.Venkataramana -- 15:37, 23 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

"శ్రీశైల క్షేత్రం" అనేది ఇక్కడ సూచించిన పేజీలన్నిటికంటే సరైన ఫేరు అని నా అభిప్రాయం. పేజీని ఆ పేరుకు తరలించాలి. ఇతర పేజీలను దారిమార్పులుగా చెయ్యాలి. __చదువరి (చర్చరచనలు) 04:48, 24 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారి అభిప్రాయమే నాదీను. శ్రీశైల క్షేత్రమనే పేరు బాగుందనిపిస్తుంది. మిగతా పేర్లు దారి మార్పుగా ఉండవచ్చు. రవిచంద్ర (చర్చ) 05:37, 24 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకలో ఉన్న పేరుతోనే వాస్యం పేరు ఉంటే బాగుంటుంది కాబట్టి, ఈ వ్యాసానికి "శ్రీశైల క్షేత్రం" అనేది సరైన పేరు అని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:01, 24 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]