Jump to content

చిత్తూరు జిల్లా కథా రచయితలు

వికీపీడియా నుండి

మనిషి పరిణామక్రమంలో కథ ప్రాధాన్యత అనన్యసామాన్యం. రాతియుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది. ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఒకటి. ఈ జిల్లా ఎంతో మంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్టులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితా

[మార్చు]
మధురాంతకం రాజారాం
క్ర.సం.రచయిత పేరుప్రస్తుత నివాసంకలం పేరుపుట్టిన సంవత్సరంపుట్టిన ఊరు (చిత్తూరు జిల్లా)
1పొన్నా లీలావతితూర్పు గోదావరిపానకం
2బడబాగ్ని శంకరరావుచిత్తూరు1959 జూన్ 1పీలేరు
3బడబాగ్ని అరుణకుమారిచిత్తూరు1968 జూన్ 7పీలేరు
4చీకోలు సుందరయ్యహైదరాబాద్కోలుఅంతర్వాణి, సవనక్రాంత్, సి, సుందరి, సుహాసిని1955 డిసెంబర్ 10కుక్కంబాకం
5టి.ఎస్.ఎ.కృష్ణమూర్తిమదనపల్లె1955మదనపల్లె
5సి. ఉమాదేవిహైదరాబాద్1947 ఫిబ్రవరి 4
6మూలింటి చంద్రకళకర్నూలు1969 సెప్టెంబరు 6అరగొండ
7చెంచు నాగార్జునశర్మచిత్తూరు1965 అక్టోబరు 21
8గోపిని కరుణాకర్హైదరాబాద్1966 ఏప్రిల్ 26పీలేరు
9శింగు మునిసుందరం  తిరుపతి1937 సెప్టెంబరు 14పారకాలువ
10మధురాంతకం రాజారాం1930 అక్టోబరు5మొగరాల
11వారణాసి భానుమూర్తిరావుహైదరాబాదు1956 ఏప్రిల్ 28మహల్ రాజుపల్లి

ఇవి కూడా చూడండి

[మార్చు]