ఖమ్మం జిల్లా కథా రచయితలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖమ్మం జిల్లా కథా రచయిత ఖమ్మం జిల్లా కథా రచయిత

మనిషి పరిణామక్రమంలో కథప్రాధాన్యత అనన్యసామాన్యం. రాతి యుగపు మనిషి సంఙలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది. ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో ఖమ్మం జిల్లా ఒకటి. ఈ జిల్లా 12 మంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు.

ఖమ్మం జిల్లా తెలుగు కథా రచయితల జాబితా[మార్చు]

రచయిత పేరు కలం పేరు పుట్టిన సంవత్సరం పుట్టిన ఊరు
సోమరాజు రామానుజరావు 18-Jun-96 దుమ్ముగూడెం ఖమ్మం
అయ్యదేవర రామకృష్ణరావు టేకులపల్లి ఖమ్మం
బొల్లిముంత వెంకటరమణారావు హైదరాబాద్ 07-Oct-66 బెల్లంపల్లి (కొత్తగూడెం) ఖమ్మం
భట్టిప్రోలు అక్కిరాజు హైదరాబాద్ 28-Aug-67 ఖమ్మం ఖమ్మం
మైసా నరసింహారావు ఖమ్మం భగవంతం 20-May-70 కొత్తగూడెం ఖమ్మం
చావా శివకోటి ఖమ్మం శివకోటి 18-Nov-40 ఖమ్మం ఖమ్మం
చల్లగుండ్ల వనజకుమారి హైదరాబాద్ నీలి 01-May-69 కాకర్ల ఖమ్మం
చింతూరి మల్లయ్య ఖమ్మం చింతూరి మల్లిబాబు, మాల్యశ్రీ 22-Jun-38 ఖమ్మం ఖమ్మం
దాశరథి రంగాచార్య హైదరాబాద్ 24-Aug-28 చిన్నగూడూరు, ఖమ్మం ఖమ్మం
దిలావర్ మహమ్మద్ ఖమ్మం దిలావర్ 05-Jun-42 పాతకమలాపురం, ఇల్లెందు తాలూకా ఖమ్మం
దూపాటి శేషుకుమారాచార్యులు ఖమ్మం 01-Dec-53 కల్లూరు, సత్తుపల్లి, భద్రాచలం ఖమ్మం
గరికపాటి చంద్రశేఖర్ హైదరాబాద్ 06-Nov-59 ఖమ్మం ఖమ్మం

ఇవి కూడా చూడండి[మార్చు]