Jump to content

కరీంనగర్ జిల్లా కథా రచయితలు

వికీపీడియా నుండి
తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం
అల్లం రాజయ్య

తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో కరీంనగర్ జిల్లా ఒకటని చెప్పవచ్చు. 20 మంది కంటే ఎక్కువ తెలుగు కథా రచయితలు లు కరీంనగర్ జిల్లాలో జన్మించారు.

కథ ప్రాశస్త్యం

[మార్చు]

మానవ సమాజ చరిత్రలో కథ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాతి యుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది.

కరీంనగర్ జిల్లాలో తెలుగు కథా ప్రక్రియ

[మార్చు]

ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో లాగానే కరీంనగర్ జిల్లాలో కూడా తెలుగు కథకులు ఉద్భవించారు. కాకపోతే కరీంనగర్ జిల్లా తెలంగాణా ప్రాంతంలో ఉండంవలన తెలుగు కథా ప్రక్రియ కొంత ఆలస్యంగా మొదలయ్యింది. తెలుగు కథా ప్రక్రియ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ తరువాత వేగం పుంజుకుంది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 20 కంటే ఎక్కువ మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో ఎంతో మంది కథారచయితలుగా రాణిస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితా[1]

[మార్చు]
రచయిత పేరు ప్రస్తుత నివాస స్థానం కలం పేరు పుట్టిన సంవత్సరం పుట్టిన ఊరు
గోపగారి రాములు 1926 జూన్‌ 6 సిరిసిల్ల
అల్లం రాజయ్య గోదావరి, కార్మిక, అందుగుల మొండెయ్య, కిరణ్, తొడసం జ
డి. శ్రీనివాసరావు శ్రీకాకుళం డి.శ్రీనివాసరావు 1966 జనవరి 24 కరీంనగర్
బొందుగులపాటి దామోదరరావు కరీంనగర్ కౌమోదకి 1948 జనవరి 25 గూడెం, కరీంనగర్
బేతి శ్రీరాములు కరీంనగర్ సత్యం, ప్రభాకర్, మయూరి, మల్లేశ, కృషణమూర్తి వగైరా20దాకా 1949 ఆగస్టు 23 జగిత్యాల
బోయిన భాస్కర్ హైదరాబాద్ సుభాను 1970 ఆగస్టు 15 పోతారం
బెజ్జారపు వినోద్ కుమార్ కరీంనగర్ 1965 అక్టోబరు 20 కోరుట్ల
బెజ్జారపు రవీందర్ కరీంనగర్ 1967 జనవరి 09 రాయికల్
భైరవి వెంకట నరసింహ స్వామి కరీంనగర్ 1964 డిసెంబరు 16 వరికోలు, కోపెడ మండలం
చినబాలు పర్శరాములు కరీంనగర్ చైతన్య ప్రకాష్ 1968 జూలై 21 పో. కొండాపూర్, వయా కిషన్ పేట్, కరీంనగర్ జిల్లా
చింతల దేవేందర్ హైదరాబాద్ 1959 జూన్ 28 వేములవాడ
చిప్పబత్తుల సంపత్ కుమార్ కరీంనగర్ సి.హెచ్. సంపత్ కుమార్ 1977 జూలై 04 ఊటూరు, మనాకొండూర్ మండలం
దధిరావు శ్రీనివాసరావు శ్రీకాకుళం డి. శ్రీనివాసరావు 1966 జనవరి 24
ఎనుగంటి వేణుగోపాల్ కరీంనగర్ 27 డిసంబరు, 1966 జగిత్యాల
గూడూరి సీతారాం కరీంనగర్ 1936 జనవరి 01 హన్మాజీపేట, వేములవాడ మండలం
గరిశకుర్తి రాజేంద్ర నిజామాబాద్ సంధ్య, సాహితీ కర్ణుడు 1953 ఏప్రిల్ 02 వేములవాడ
గుండెడప్పు కనకయ్య హైదరాబాద్ గుండెడప్పు 1972 డిసెంబరు 15 వీణవంక
వెల్దండి శ్రీధర్ కరీంనగర్ 1973 మార్చి 15 కోహెడ
పెద్దింటి అశోక్ కుమార్ కరీంనగర్ 6 ఫిబ్రవరి 1968 గంభీరావుపేట

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]