అదిలాబాద్ జిల్లా కథా రచయితలు
ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో అదిలాబాద్ జిల్లా ఒకటి. అదిలాబాద్ జిల్లా కథా రచయితలు వర్తమానకాలంలో చాలా మందే ఉన్నారు.
కథ ప్రాశస్త్యం
[మార్చు]మానవ సమాజ చరిత్రలో కథ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాతి యుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది. ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో అదిలాబాద్ జిల్లా ఒకటి. ఈ జిల్లా ఎంతో మంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులయ్యారు. వర్తమాన కాలంలో ఎంతోమంది కథారచయితలుగా రాణిస్తున్నారు.
అదిలాబాద్ జిల్లాలో తెలుగు కథా ప్రక్రియ
[మార్చు]ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో లాగానే అదిలాబాద్ జిల్లాలో కూడా తెలుగు కథకులు ఉద్భవించారు. గీతాంజలి కలం పేరుతో విరివిరిగా కథలు రాసే డాక్టరు భారతి అదిలాబాద్‌కు చెందినవారు. "బచ్చేదాని అనే కథా సంపుటిని వెలువరించారు. చాలా పత్రికల్లో వీరి కథలు ప్రచురితమయ్యాయి. బోన్సాయ్, ఖడ్గచాలనం, వికలాంగుడు మొదలగునవి వీరి కథా నిర్మాణాన్ని చూపుతాయి. ముస్లిం స్త్రీల సమస్యలపై విరివిగా కథలు రాస్తున్న గీతాంజలి ఇటీవలెనే ముస్లిం స్త్రీల అస్తిత్వ పోరాట కథలు ‘పహెచాన్’ను వెలువరించారు".[1] భాగీరధి, వీరి జంగుబాయి లాంటి మరికొన్ని కథలు రాసిన గోపీభాగ్యలక్ష్మి ఈ జిల్లా వాస్తవ్యులే. అలాగే నాగుల రాధేశ్యాం, బి. మురళీధర్, వేట కథల రచయితలుగా వీరు గుర్తింపు పొందిన జె.పి. వైద్య డాక్టర్ చమన్ సింగ్ మున్నగు కథకులు అదిలాబాద్ జిల్లాలో తెలుగు కథా ప్రక్రియకు ప్రతిబింబాలు.[2]
అదిలాబాద్ జిల్లా తెలుగు కథా రచయితల జాబితా
[మార్చు]ఈ క్రింది జాబితాలో అదిలాబాద్ జిల్లాకథకుల వివరాలుక్రోఢీకరించబడ్డాయి.[1][2][3]
రచయిత పేరు | పుట్టిన సంవత్సరం | కలం పేరు | పుట్టిన ఊరు | ప్రస్తుత నివాస స్థలం |
---|---|---|---|---|
బి. మురళీధర్ | 1955 జూన్ 12 | సొనాల | అదిలాబాద్ | |
ధప్పూరి శ్రీధరాచార్యులు | 1944 జూన్ 19 | విజయశ్రీ, సుధారాణి, సుధాతాయి | జైనద్ మండలం | అదిలాబాద్ |
గూడ అంజయ్య | 1954 నవంబరు 01 | ప్రజా, జమదగ్ని | లింగాపురం | హైదరాబాద్ |
డాక్టరు భారతి | గీతాంజలి | |||
గోపీభాగ్యలక్ష్మి | ||||
నాగుల రాధేశ్యాం | ||||
బి. మురళీధర్ | ||||
జె.పి. వైద్య | ||||
ఫణి కుమార్ | ||||
బిక్కునూరి రాజేశ్ | ||||
శ్రీధర్‌రావు దేశ్‌పాండే | ||||
సదాశివ | ||||
సంపత్ కుమార్ | ||||
సిరిమల్లె రూప |
డాక్టర్ చమన్ సింగ్
ఇవి కూడా చూడండి
[మార్చు]- అనంతపురం జిల్లా తెలుగు కథారచయితలు
- కర్నూలు జిల్లా కథా రచయితలు
- చిత్తూరు జిల్లా కథా రచయితలు
- తూర్పు గోదావరి జిల్లా కథా రచయితలు
- పశ్చిమగోదావరి జిల్లా కథా రచయితలు
- కరీంనగర్ జిల్లా కథా రచయితలు
- మెదక్ జిల్లా కథా రచయితలు
- వరంగల్ జిల్లా కథా రచయితలు
- కడప జిల్లా కథా రచయితలు
- నల్గొండ జిల్లా కథా రచయితలు
- మహబూబ్ నగర్ జిల్లా కథా రచయితలు
- కృష్ణా జిల్లా కథా రచయితలు
- ప్రకాశం జిల్లా కథా రచయితలు
- నెల్లూరు జిల్లా కథా రచయితలు
- గుంటూరు జిల్లా కథా రచయితలు
- ఖమ్మం జిల్లా కథా రచయితలు
- జాతీయ తెలుగుకథా రచయితలు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం – 1 తెలంగాణా సోయి, 07 జూన్, 2007 సంచిక[permanent dead link]
- ↑ 2.0 2.1 "ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం – 2". Archived from the original on 2016-03-04. Retrieved 2014-01-07.
- ↑ కథానిలయం జాలగూడులో రచయితల వివరాలు