నల్గొండ జిల్లా కథా రచయితలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో నల్గొండ జిల్లా ఒకటి. నల్గొండ జిల్లా కథా రచయితలు చాలా మందే ఉన్నారు.

కథ ప్రాశస్త్యం

మానవ సమాజ చరిత్రలో కథ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాతి యుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది.

నల్గొండ జిల్లాలో తెలుగు కథా ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో లాగానే నల్గొండ జిల్లాలో కూడా తెలుగు కథకులు ఉద్భవించారు. తెలంగాణ విముక్తి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న నల్గొండ న్యాయవాది బోయినపల్లి రంగారావు ‘వారంరోజుల అవస్థ’ ఇంకా మరెన్నో కథలు రచించాడు. అలాగే వాసి ధరణికోట శ్రీనివాసులు ‘నీలగిరి సాహిత్య సమితి’ స్థాపించి తన కథల్లో తెలంగాణ ప్రజల జీవనపోరాటాన్ని వివరించాడు. ‘చల్లపులుసు’, ‘అన్నంలోకి’, ‘కనకం’ మరిన్ని కథలతో కథా సంపుటాలు వెలువరించాడు. ముక్తవరం పార్ధసారథి భార్యాభర్తల అనురాగబంధాన్ని హృద్యంగా చిత్రిస్తూ ‘ఎర్రనిదీపం’తోపాటు మరిన్ని కథలు రాశాడు. నల్గొండ కథకులు ధరణికోట శ్రీనివాసు కథల గురించి ఆచార్య దివాకర్ల వెంకటావధాని తమ ‘ఆంధ్ర వాఙ్మయచరిత్ర’లో ప్రస్తావించారు. మేరెడ్డి యాదగిరిరెడ్డి రాసిన కథల్లో చదివించే గుణముంది. ఇతని ‘కొలిమి’ కథలో వడ్రంగివారి బతుకువెతలు దర్శనమిస్తాయి.బోయజంగయ్య చీమలు కథలో పాము సైతం చీమలు దండుతో చస్తుందనే నీతి ఉంది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 20 మంది పైగా కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో ఎంతో మంది కథారచయితలుగా రాణిస్తున్నారు.

శ్రీధర్ బాబు పసునూరు
జయధీర్ తిరుమలరావు
శీలం భద్రయ్య

నల్గొండ జిల్లా తెలుగు కథా రచయితల జాబితా

ఈ క్రింది జాబితాలో నల్గొండ జిల్లా కథకుల వివరాలు క్రోడీకరించబడ్డాయి. [1]

రచయిత పేరు ప్రస్తుత నివాస స్థలం పుట్టిన సంవత్సరం కలం పేరు పుట్టిన ఊరు
అజ్మతుల్లా దేవరకొండ
నూతలపాటి గంగాధరం చిత్తూరు నల్గొండ
బోధనం నర్సిరెడ్డి నల్గొండ 04 జూలై, 1958 నల్గొండ భూతం ముత్యాలు నల్గొండ 10 జూన్,1971 భూతం ముత్యాలు తిర్మలగిరి (గ్రామం), నాంపల్లి (మండలం), నల్గొండ జిల్లా పెదకోట్ల చిన్నయ్య నల్గొండ 1965 అక్టోబరు 10 చిన్న భువనగిరి
దొడ్డి రామ్మూర్తి నల్గొండ 1968 ఆగస్టు 20 దీపకుంట, ఊకొండి
దేవులపల్లి శ్యాంసుందరరావు ఖమ్మం 1949 అక్టోబరు 23 సూర్యాపేట
దయాల కల్పన హైదరాబాద్ 1977 ఏప్రిల్ 04 డి. కల్పన పోచంపల్లి
ఎలికట్టె శంకర్ రావు నల్గొండ 1968 ఏప్రిల్ 13 R. ఎర్రగూడెం, నిడమానూరు మండలం
గుడిపూడి సుబ్బారావు నల్గొండ 1936 నవంబరు 12 అన్నవరగూడెం, మోతె మండలం
గుడిపాటి వెంకటేశ్వర్లు హైదరాబాద్ 1964 జనవరి 08 శశాంక, ప్రణవ, అభిషేక్, కిరణ్ సూర్యాపేట
బోయినపల్లి రంగారావు
వాసి ధరణికోట శ్రీనివాసులు
ముక్తవరం పార్ధసారథి
ధరణికోట శ్రీనివాసు
మేరెడ్డి యాదగిరిరెడ్డి
బోయజంగయ్య
కొండపల్లి వెంకట శేషగిరిరావు
గౌసు మొహియుద్దీన్
పసునూరు శ్రీధర్ బాబు హైదరాబాద్ 1969 జూలై 21 మోతుకూరు
దేవరాజు రవి
జయధీర్ తిరుమలరావు
శీలం భద్రయ్య నల్గొండ పట్టణం 1980 డిసెంబర్ 24 శీలం భద్రయ్య అన్నారం(టి), తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా

ఇవి కూడా చూడండి

మూలాల జాబితా

  1. కథానిలయం జాలగూడులో రచయితల వివరాలు

వెలుపలి లంకెలు