చిణువు

వికీపీడియా నుండి
(చిత్ర కణము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

చిణువు లేదా పిక్సెల్ అన్నది ఒక చిత్రం యొక్క అణువు అనే పదానికి సంక్షిప్త రూపం. సంగణక శాస్త్రంలో రాస్టర్ చిత్రాలను అధ్యయనం చేసేందుకు చిత్రాన్ని కనిష్ఠ అణువులుగా విడగొడతారు, ఇలా వచ్చిన ప్రత్యేక అణువే చిణువు. ఒక చిత్రం యొక్క అత్యల్పంగా/కనిష్ఠంగా మార్చగల లేదా చూపగల భాగమే చిణువు. ప్రతి చిణువుకు ఒక చిరునామా ఉంటుంది. ఆ చిరునామాను వాడి చిత్రంలో ఆ ప్రాంతం యొక్క సరియైన స్థితిని, రంగును కనుక్కోవచ్చు. ఒక చిత్రంలో ఎన్ని చిణువులు ఉంటాయి అన్న దాన్ని బట్టి ఆ చిత్రం యొక్క విభాజకత నిర్ధారమవుతుంది.[1]

మూలాలు[మార్చు]

  1. Forret, Peter. "Megapixel calculator @ toolstud.io". toolstud.io (ఆంగ్లం లో). Retrieved 2019-12-12.
"https://te.wikipedia.org/w/index.php?title=చిణువు&oldid=2950389" నుండి వెలికితీశారు